
Sreeleela movie updates : రాఘవేంద్రరావు డైరెక్షన్ లో పెళ్లి సందD సినిమాతో టాలీవుడ్ లో హీరోయిన్గా అడుగుపెట్టిన కన్నడ బ్యూటీ శ్రీలీల. మొదటి సినిమా తోటే మంచి పాపులారిటీ తెచ్చుకొని.. యూత్ లో బాగా క్రేజ్ సంపాదించుకుంది. అయితే ఆ తర్వాత అనుకున్న ఆఫర్లు రాలేదు.. ఆ తర్వాత రవితేజతో నటించిన ధమాకా మూవీ శ్రీలీల కెరీర్ కు మాంచి ధమాకా బూస్ట్ ఇచ్చింది. ఇక రీసెంట్గా శ్రీ లీల, బాలయ్య కాంబో లో అనిల్ రావిపూడి డైరెక్షన్లో తెరకెక్కిన మూవీ భగవంత్ కేసరి. ఈ మూవీ సూపర్ డూపర్ హిట్ గా నిలిచింది. ఇక ఇందులో ఆమె యాక్షన్ కు అందరూ ఫిదా అయిపోయారు.
ప్రస్తుతం టాలీవుడ్ లో మారుమోగుతున్న పేరు శ్రీ లీల.. ఎందుకంటే ఈ భామ వరుసగా పది సినిమాలలో నటిస్తూ సూపర్ బిజీగా ఉంది. రాబోయే అన్ని సీజన్స్ లో ఏదో ఒక సినిమాలో శ్రీలీల కనిపిస్తుంది అనడంలో డౌటే లేదు. మంచి ఫామ్ లో ఉన్న శ్రీలీల ఇప్పుడు తెలుగులో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్‌గా మారింది. భగవంత్ కేసరిలో తన యాక్టింగ్ కు శ్రీలీల మాంచి మార్కులే కొట్టేసింది. ఇక మిగిలిన మూవీస్ విషయానికి వస్తే..శ్రీలీలకు ప్రభాస్ తో నటించే అవకాశం వచ్చిందని టాక్. ప్రజెంట్ ప్రభాస్ చేస్తున్న కల్కి మూవీ తర్వాత మరొక లవ్ స్టోరీ చేయబోతున్నట్లు తెలుస్తోంది.
హను రాఘవపూడి డైరెక్షన్లో తెరకెక్కే ఈ భారీ పాన్ ఇండియన్ మూవీలో ప్రభాస్ సరసన శ్రీలీల నటించే అవకాశం ఉందని టాక్. మరో రూమర్ ఏమిటంటే ఈ ఒక్క మూవీలో నటించడం కోసం శ్రీలీల ఆల్రెడీ ఇద్దరు హీరోలతో సినిమాకి నో చెప్పిందట. డేట్స్ సర్దుబాటు కానీ కారణంగా ఈ రెండు సినిమాలు వదిలేసినట్టు టాక్. అందులో ఒకటి విజయ్ దేవరకొండ మెయిన్ లీడ్ లో గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్లో వస్తున్న మూవీ. రవితేజ తో వచ్చిన ఒక ఆఫర్ ను కూడా డేట్స్ సెట్ కాక శ్రీలీల వదులుకున్నట్లు సమాచారం.
ఇక నవంబర్ 10న వైష్ణవ్ తేజ్.. ఆదికేశవ, డిసెంబర్ 23న నితిన్ ఎక్స్ ట్రా ఆర్డినరీ మ్యాన్, జనవరి 12న మహేష్ గుంటూరు కారం ఇలా నెలకొక సినిమాతో ఫుల్ బిజీగా ఉంది శ్రీలీల. వీటితోపాటుగా ‘ది చెన్నై స్టోరీ’ అనే ఇంగ్లీస్ మూవీలో కూడా శ్రీలీల నటించబోతోందట. మొదట్లో ఈ మూవీ కోసం సమంత అని అనుకున్నారు కానీ లేటెస్ట్ గా ఈ ఆఫర్ శ్రీలీలకు దక్కింది. ఇలా శ్రీలీల వరుసగా టాలీవుడ్ స్టార్ హీరోయిన్ల ఆఫర్స్ అన్ని తన ఖాతాలో వేసుకుంటూ వెళ్తోంది.