BigTV English

Actress Anshu : పబ్లిసిటీ కోసం చెయ్యలేదు.. అసలు నిజం చెప్పిన హీరోయిన్..

Actress Anshu : పబ్లిసిటీ కోసం చెయ్యలేదు.. అసలు నిజం చెప్పిన హీరోయిన్..

Actress Anshu : అక్కినేని నాగార్జున హీరోగా నటించిన మన్మథుడు మూవీలో హీరోయిన్ గా నటించిన అన్షు అందరికి గుర్తే ఉంటుంది. ప్రభాస్ సరసన రాఘవేంద్ర మూవీలో నటించింది. అప్పటిలో మంచి క్రేజీ హీరోయిన్ అవుతుందని అందరు అనుకున్నారు. కానీ పెద్దగా సినిమాలు చెయ్యలేదు. ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన ఈమె వరుస సినిమాలతో బిజీగా ఉంది. ఇటీవల యంగ్ హీరో సందీప్ కిషన్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ మజాకా లో ప్రత్యేక పాత్రలో నటించింది. గ్లామర్ పరంగా గానీ, నటన పరంగా గానీ అన్షుకి మార్కులు పడలేదు. ఆడియెన్స్‌ నుంచి ఆమెకు ప్రశంసలు అయితే దక్కలేదు. అన్షు మీద డైరెక్టర్ చేసిన అనుచిత వ్యాఖ్యలతో ఒక్కసారిగా దుమారం రేగింది. అలా ఈ సినిమా వార్తల్లో నిలిచింది. అయితే తాజాగా అన్షు నెటిజన్లు దిమ్మతిరిగే న్యూస్ ను రీవిల్ చేసింది.. అసలేం జరిగింది..?


మజాకా మూవీ..

హీరో సందీప్ కిషన్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్నాడు కానీ పెద్దగా వర్కౌట్ కాలేదు. సినిమాలు కథ పరంగా మంచి టాక్ ను సొంతం చేసుకుంటున్నాయి. కానీ స్టార్ ఇమేజ్ ను అందుకొనే రేంజ్ కు అయితే వెళ్ళలేదు. తాజాగా మజాకాతో ప్రేక్షకులను పలకరించాడు. వివాదాలతో థియేటర్లలో రిలీజ్ అయ్యింది. కానీ సక్సెస్ అవ్వలేదు. కుళ్లు జోకులు, వెకిలి సీన్లకు జనాలు నవ్వుకున్నారు. నవ్వుకున్నారు అంటే ఎంజాయ్ చేశారు అని కాదు. ఇక ఇంతేనా? వీళ్లు మారరా? అంటూ ఆడియన్స్ జోకులు వేసుకున్నారు. థియేటర్లలో పెద్దగా ఆడని ఈ సినిమా ఓటిటిలోకి రాబోతుంది. మరి అక్కడ ఎలాంటి టాక్ ని సొంతం చేసుకుంటుందో చూడాలి..


Also Read: ఈరోజు టీవి ఛానెల్లో వచ్చే సినిమాలు.. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కు పండగే..

అన్షుకు గాయం నిజమే..

హీరోయిన్ అన్షు మజాకా మూవీలో కీలక రోడ్డులో నటించిన విషయం తెలిసిందే.. అయితే ఈ సినిమా ప్రమోషన్స్ టైం లో ఆమె తలకు గాయమై కనిపించడం అందరూ చూశారు. తలకి గాయమైనట్టుగా ఓ బ్యాండేజీతో కనిపించింది. అప్పుడు ఆ కట్టు గురించి ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. ఇప్పుడు అన్షునే ఓ వీడియోని షేర్ చేస్తూ అసలు విషయాన్ని చెప్పింది. ఆవీడియోలో ఆమె మాట్లాడుతూ.. ఇది నేను పబ్లిక్ స్టంట్ కోసం చేయలేదు.. ఇది నిజమైన గాయమే.. నెల క్రితమే ఈ ఘటన జరిగింది నా ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ వల్ల నేను బయటపడ్డాను ఇది ఒక చేదు అనుభవం త్వరలోనే దీని నుంచి కోల్కొని నేను స్ట్రాంగ్ గా మారతానని నాకు నమ్మకం ఉంది. ఆ వీడియోతో ట్రోలర్స్ కి దిమ్మ తిరిగే షాక్ ఇచ్చిందని అన్షు ఫాన్స్ అభిప్రాయపడుతున్నారు.. మొత్తానికి వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.. సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన ఈమెకు ఈ మూవీ అంతగా గుర్తింపుని తీసుకురాలేదు. ఇక ముందు ముందు మంచి ప్రాజెక్ట్లలో నటిస్తుందేమో చూడాలి.

?igsh=MWh3d2Npc2xjcHgyag==

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×