E-Paper
Advertisement

Dimple Hayathi : డింపుల్ పాప సీక్రెట్ టాటూ.. ఇంత మార్పు ఎందుకో..?

Dimple Hayathi : డింపుల్ పాప సీక్రెట్ టాటూ.. ఇంత మార్పు ఎందుకో..?
Advertisement

Dimple Hayathi : టాలీవుడ్ హీరోయిన్ డింపుల్ హయాతి గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. తెలుగులో పలు సినిమాల్లో నటించింది. ఈమె నటించిన సినిమాలు ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేదు. దాంతో పాప పేరు పెద్దగా ఎవరికీ తెలియదు. ఇక ఈ అమ్మడు మొదటి సినిమాలనే స్టార్ హీరోలతో చేసింది. అందులో ఒక్క సినిమా కూడా హిట్ టాక్ ను అందుకోలేదు. దాంతో హీరోయిన్ గా పెద్దగా గుర్తింపు తెచ్చుకోలేదు. ఇక సినిమా ఆఫర్స్ అమ్మడుకు రాకపోవడంతో ఫ్రెండ్స్ తో ట్రిప్ లు వేస్తూ ఎంజాయ్ చేస్తుంది. తాజాగా ఈ అమ్మడు తన ఫ్రెండ్స్ తో వెకేషన్ లో ఉంది. ఆ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ప్రస్తుతం అవి వైరల్ గా మారాయి.

డింపుల్ తన ఫ్రెండ్స్ తో వెకేషన్ కు వెళ్లిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఆ ఫొటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.. ఆ ఫోటోలలో పాప టాటు వేయించుకున్న ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ టాటు ఏనుగు ఆకారాన్ని పోలీ ఉండటంతో అందరి దృష్టిని ఆకట్టుకుంది. ఆ టాటు వెనుక ఏదైన అర్థం ఉందా? లేదా సరదాగా వేయించుకుందా అనేది మాత్రం తెలియలేదు. కానీ ప్రస్తుతం ఆ ఫొటోలు నెట్టింట తెగ ట్రెండ్ అవుతున్నాయి. ఆ ఫోటోలపై మీరు ఒక లుక్ వేసుకోండి..

Advertisement

ఇక డింపుల్ కేరీర్ విషయానికొస్తే.. వరుణ్ తేజ్ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన జర్రా జర్రా అనే ఐటెం సాంగ్‌లో తళుక్కున మెరిసింది డింపుల్ హయాతి. ఈ పాటలో తన డ్యాన్స్, ఎక్స్‌ప్రెషన్స్‌తో మంచి పేరు తెచ్చుకున్నా ఛాన్సులు మాత్రం రాలేదు. అయితే దానికంటే ముందు సునీల్ కుమార్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన గల్ఫ్ మూవీలో కనిపించింది అది ఆకట్టుకోలేదు. బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ అయ్యింది. ఆ తర్వాత గద్దలకొండ గణేష్ చిత్రంపై ఎన్నో ఆశలు పెట్టుకుంది డింపుల్. కానీ ఇక్కడా సీన్ రివర్స్. అనంతరం ఏఎల్ విజయ్ డైరెక్షన్ లో వచ్చిన అభినేత్రి అనే మూవీలో కీ రోల్ పోషించింది. ఇందులో మిల్కీ బ్యూటీ తమన్నా లీడ్ రోడ్ చేసింది.

తెలుగులో దేవి 2, ఏరుకలతో పాటు హిందీలో అత్రాంగి రే, తమిళ్‌లో వీరమయే వాగై సోదమ్‌లో నటించింది. అది కూడా పాపకు పేరును అందివ్వలేదు. ఆ తర్వాత రవితేజ సరసన ఓ సినిమా చేసింది. ఆ ఖిలాడిపై ఎన్నో ఆశలు పెట్టుకుంది. ఇందులో బికినీతో పాటు రొమాంటిక్ సీన్స్‌లో ఇరగదీసింది కానీ పాపకు కొంచెం కూడా పేరును ఇవ్వలేక పోయాయి. తెలుగులో చివరగా రామ బాణం సినిమాలో గోపీచంద్ సరసన నటించింది. ఆ సినిమా ప్లాప్ అవ్వడంతో ఇంకో ఛాన్స్ వస్తుందా అని వెయిట్ చేస్తుంది. తన కలర్ కారణంగానే తనకు అవకాశాలు రావడం లేదని పలు సందర్భాల్లో ఆవేదన వ్యక్తం చేసింది డింపుల్. అంతేకాదు వివాదాలు కూడా ఎక్కువగా ఉండటంతో సినిమా ఆఫర్స్ రాలేదనే టాక్ నడుస్తుంది. మరి పాప అదృష్టం బాగుండి ఒక్క హిట్ సినిమా అన్నా పడుతుందేమో చూడాలి..

Related News

కరువు పరిస్థితులపై సినీ ఇండస్ట్రీ సహకారం కోరిన సీఎం రేవంత్.. వెంటనే స్పందించిన నాగ్!

సాయికృష్ణ మిస్టరీ కేసు సంఘటన.. మళయాల క్రైం థ్రిల్లర్‌ మూవీలో ప్రధాన కథనం..! ఇన్విస్టిగేషన్‌ ఆఫీసర్‌ని బురిడీ కొట్టించే సీన్లు..!

వికెట్ పడిన ఆనందంలో జుట్టు పట్టుకున్నా, కానీ ఆ బౌలర్ విగ్గే ఊడిపోయింది

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Big Stories

Advertisement
×