BigTV English

Meat in Fridge: పచ్చి మాంసాన్ని ఫ్రిడ్జ్‌లో పెడుతున్నారా? ఎవరికి ఎక్కువ ప్రమాదమో తెలుసా?

Meat in Fridge: పచ్చి మాంసాన్ని ఫ్రిడ్జ్‌లో పెడుతున్నారా? ఎవరికి ఎక్కువ ప్రమాదమో తెలుసా?

వారానికి సరిపడా మాంసాన్ని తెచ్చి ఫ్రిజ్లో భద్రపరిచి కావాల్సినప్పుడు వండడం అనే పద్ధతి ఎందరో ఇళ్లల్లో కనిపిస్తుంది. కొంతమంది పచ్చిమాంసాన్ని ఫ్రిజ్లో భద్రపరిస్తే మరి కొందరు ఆ మాంసాన్ని శుభ్రం చేసి మ్యారినేట్ చేసి దాన్ని నిల్వ చేస్తారు. రెండు మూడు రోజులకు ఒకసారి వండుతూ ఉంటారు. కానీ ఇలాంటి పచ్చి మాంసాన్ని నిల్వ చేయడం వల్ల మహిళలు ఇన్ఫెక్షన్ బారిన పడుతున్నట్టు అధ్యయనాలు చెబుతున్నాయి.


ప్రపంచంలో 60 శాతం మంది మహిళలు తమ జీవిత కాలంలో ఒక్కసారి అయినా యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ బారిన పడుతున్నట్టు తేలింది. దీనికి ఫ్రిజ్లో దాచే పచ్చి మాంసం కూడా కారణమేనని తెలుస్తోంది.

మహిళల్లోనే ఎక్కువ


పురుషులతో పోలిస్తే మహిళల్లోనే యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ వచ్చే అవకాసం 30 రెట్లు ఎక్కువ. దానికి కారణం మహిళల మూత్రనాళం చాలా చిన్నగా ఉంటుంది. దానిలో త్వరగా ఇన్ఫెక్షన్ చేరే అవకాశం ఉంటుంది. అలాగే మూత్రనాళము, మలవిసర్జన నాళం కూడా ఒకదానికొకటి దగ్గరగా ఉంటాయి.

ఫ్రిడ్జ్‌లో ఈ.కోలి బ్యాక్టీరియా

ఫ్రిడ్జ్ లో నిల్వ ఉంచే మాంసం పై ‘ఈ. కొలి’ వంటి బ్యాక్టీరియా అధికంగా ఉంటుంది. ఎప్పుడైతే మహిళలు తమ చేత్తోనే ఆ మాంసాన్ని తీసి కడిగి వండుతారో ఆ సమయంలో ఆ బ్యాక్టీరియా వారి చేతులపై చేరుతుంది. ఆ చేతుల నుంచి ముక్కు, నోటి ద్వారా పొట్టలోకి చేరే అవకాశం ఉంది. అలా అది మూత్రనాళంలో చేరి యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ కి గురవుతోంది.

చేతులతో ముట్టుకోవద్దు

పచ్చి మాంసాన్ని నేరుగా చేతులతో ముట్టుకోవద్దు. దాన్ని ముట్టుకునేటప్పుడు గ్లౌస్ వేసుకోవడానికి ప్రయత్నించండి. అలాగే ఫ్రిజ్లో దాదాపు పచ్చి మాంసాన్ని నిల్వ చేయకపోవడమే మంచిది. ఫ్రిజ్లో ఇతర పదార్థాలమీద కూడా ఈ. కొలి అనే బాక్టీరియా చేరవచ్చు. అది చాలా ప్రమాదకరమైనది. త్వరగా అనారోగ్యాలు బారిన పడేలా చేస్తుంది.

మెనోపాజ్ మహిళలకే ఎక్కువ ముప్పు

మెనోపాజ్ దశ చేరుకున్న మహిళల్లో కూడా యూటీఐ వచ్చే అవకాశం చాలా బాగా ఎక్కువగా ఉన్నట్టు గణాంకాలు చెబుతున్నాయి. దీనికి కారణం మన దశలో ఉన్న మహిళల్లో ఈస్ట్రోజన్ స్థాయిలు తగ్గిపోతాయి. దీనివల్ల మూత్రనాళానికి తగిన రక్షణ దొరకదు. అందుకే ఇన్ఫెక్షన్ల బారిన త్వరగా పడే అవకాశం ఉంటుంది.

Also Read: లిచీ పండ్ల కన్నా వాటిలో ఉన్న విత్తనాలే ఆరోగ్యకరమైనవి, వాటితో ఎన్నో సమస్యలు రాకుండా అడ్డుకోవచ్చు

ఈ లక్షణాలుంటే.. జాగ్రత్త

మూత్ర విసర్జన సమయంలో తీవ్ర నొప్పి రావడం, మంట రావడం లేదా పదేపదే మూత్రానికి వెళ్లాల్సి రావడం అనేది యూరినేరి ట్రాక్ ఇన్ఫెక్షన్ లక్షణాలుగా చెబుతారు. మూత్రం రంగు మారినా, దుర్వాసన వస్తున్నా, మూత్రంలో రక్తం పడినా కూడా వెంటనే వైద్యులను సంప్రదించాలి. నీరసంగా, అలసటగా అనిపించినా, పొత్తికడుపుపై ఒత్తిడిగా అనిపిస్తున్న యూరినరీ ట్రాక్స్ ఇన్ఫెక్షన్ వచ్చిందేమో చెక్ చేయించుకోవడం చాలా ఉత్తమం.

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి సేకరించిన సమాచారాన్ని ఇక్కడ యథావిధిగా అందించాం. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. తప్పకుండా వైద్యుడు లేదా ఆహార నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే ఈ ఆహారాన్ని మీ డైట్‌లో చేర్చుకోవాలి. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘బిగ్ టీవీ’ బాధ్యత వహించదని గమనించగలరు.

Related News

Anjeer: వీళ్లు.. అంజీర్‌లను అస్సలు తినకూడదు తెలుసా ?

Dasara festival 2025: నవరాత్రి పండుగకు స్పెషల్ వంటలు.. ఉల్లిపాయ, వెల్లుల్లి లేకుండా ప్రత్యేక రెసిపీలు

Heart Attack: వ్యాయామం చేసేటప్పుడు ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా ? హార్ట్ ఎటాక్ కావొచ్చు !

Healthy Hair Tips: ఆరోగ్యమైన జుట్టు కోసం సహజ చిట్కా.. వారంలో రెండు సార్లు చాలు

Glowing Skin Tips: కెమికల్స్ లేకుండా ఇంట్లోనే గ్లోయింగ్ స్కిన్.. ఇలా చేస్తే చందమామలా మెరిసే చర్మం

Yoga For Brain Health: ఈ యోగాసనాలతో.. బ్రెయిన్ డబుల్ షార్ప్ అవుతుందట !

Air Fryer: ఎయిర్ ఫ్రైయర్ వంటలు ఆరోగ్యానికి ఇంత మంచివా? అస్సలు ఊహించి ఉండరు!

Alcohol: విస్కీ, వైన్, బీర్, కల్లు.. వీటిలో ఏది ఎక్కువ డేంజర్!

Big Stories

×