BigTV English
Advertisement

Heroine Sada: అవకాశాలు లేక అలాంటి కెరియర్ ను ఎంచుకున్న సదా.. ఏమైందంటే..?

Heroine Sada: అవకాశాలు లేక అలాంటి కెరియర్ ను ఎంచుకున్న సదా.. ఏమైందంటే..?

Heroine Sada.. సినీ ఇండస్ట్రీలో ఎప్పుడు ఎవరి కెరియర్ ఎలా టర్న్ తీసుకుంటుందో చెప్పలేని పరిస్థితి ఏర్పడింది అనడంలో సందేహం లేదు. ముఖ్యంగా చాలామంది హీరోయిన్స్ ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత సక్సెస్ అయ్యి ఆ తర్వాత అవకాశాలు లేక ఇండస్ట్రీకి దూరం అవుతారు. అందులో కొంతమంది బిజినెస్ లోకి అడుగుపెడితే ,మరి కొంతమంది ఇంటికే పరిమితమవుతారు. అయితే ఇక్కడ ఒక హీరోయిన్ మాత్రం అటు వివాహం చేసుకోకుండా ఇటు ఇండస్ట్రీలోకి రాకుండా సరికొత్త అవతారం ఎత్తి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఆమె ఎవరో కాదు జయం సినిమాతో తన అంద చందాలతో తెలుగు ఆడియన్స్ హృదయాలు దోచుకున్న హీరోయిన్ సదా.


మొదటి సినిమాతోనే భారీ గుర్తింపు..

మొదటి చిత్రంతోనే తెలుగు ప్రేక్షకుల మన్ననలు పొందిన ఈ ముద్దుగుమ్మ.. ” వెళ్ళవయ్యా వెళ్ళు” అనే డైలాగ్ తో భారీ పాపులారిటీ సొంతం చేసుకుంది. ఆ తర్వాత అవునన్నా కాదన్నా, అపరిచితుడు వంటి సినిమాలతో కూడా మంచి క్రేజ్ అందుకుంది సదా. 2014లో యమలీల 2 సినిమాతో మళ్ళీ ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈమె అప్పటినుండి సిల్వర్ స్క్రీన్ పై కనిపించలేదు. ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టిన ఈమె అటు సినిమాలతో పాటు టీవీ షోలలో కూడా జడ్జిగా వ్యవహరిస్తూ సందడి చేస్తోంది. అంతేకాదు ఈమెలో మరో టాలెంట్ కూడా ఉందండోయ్. అదే ఫొటోగ్రఫీ.


వైల్డ్ ఫొటోగ్రాఫర్ గా మారిన సదా..

ఫొటోగ్రఫీ అంటే చాలా ఇష్టం ఉన్న ఈమె ఖాళీ సమయాలలో తనకు ఇష్టమైన ఫోటోగ్రఫీ పై ఫోకస్ పెడుతూ అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ క్రమంలోనే ఎంతో అందమైన ఫోటోలను తీస్తూ సోషల్ మీడియాలో షేర్ చేస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా ఒక బ్యూటిఫుల్ వీడియోని కూడా షేర్ చేసింది ఈ ముద్దుగుమ్మ. సద్ద చేన్లో తిరుగుతూ చిలకలు సద్ద గింజలు తింటున్న ఫోటోలను చాలా న్యాచురల్ గా బంధించి, వాటిని సోషల్ మీడియాలో షేర్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో చూపరులను చాలా ఆకట్టుకుంటుందని చెప్పవచ్చు. ఇకపోతే అవకాశాలు లేకే ఫోటోగ్రఫీ గా మారిపోయింది అంటూ కొంతమంది కామెంట్లు చేస్తున్నారు. ఏదేమైనా సదా వైల్డ్ ఫోటోగ్రఫీగా మారింది అంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.

సదా కెరియర్..

ఇక సదా విషయానికి వస్తే.. సదా అసలు పేరు సదాఫ్ మొహమ్మద్ సయీద్. మహారాష్ట్రలోని రత్నగిరి లో ఒక ముస్లిం కుటుంబంలో జన్మించిన ఈమె రత్నగిరిలో సెక్రెడ్ హార్ట్స్ కాన్వెంట్ హై స్కూల్లో.. స్కూల్ విద్యాభ్యాసం పూర్తి చేసింది. ఈమె తండ్రి ఒక వైద్యుడు కాగా తల్లి బ్యాంకు ఉద్యోగి. ఆ తర్వాత ముంబైకి వెళ్లిన ఈమెను అక్కడ తేజ చూసి తాను రూపొందిస్తున్న ప్రేమ కథా చిత్రం జయంలో అవకాశం ఇచ్చారు. అలా ఇండస్ట్రీకి పరిచయమైన సదా సినిమాలు, వెబ్ సిరీస్లలో కూడా నటించింది. అలాగే తెలుగు, తమిళ్ , కన్నడ , హిందీ భాషల్లో కూడా నటించి ఆకట్టుకుంది. హలో వరల్డ్ అనే వెబ్ సిరీస్ తో ప్రేక్షకులను ఆకట్టుకుంది.

?utm_source=ig_embed&utm_campaign=loading" data-instgrm-version="14">

 

View this post on Instagram

 

?utm_source=ig_embed&utm_campaign=loading" target="_blank" rel="noopener">A post shared by Sadha Sayed (@sadaa17)

Related News

Tejaswini Nandamuri: నందమూరి వారసురాలు వైరల్ యాడ్ డైరెక్టర్ ఎవరో తెలుసా? ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందా?

Film industry: ఘనంగా సినిమాటిక్ ఎక్స్ పో 3వ ఎడిషన్!

CM Revanth on Movie Tickets: సినిమా టికెట్ డబ్బుల్లో సినీ కార్మికులకు వాటా… సీఎం సంచలన ప్రకటన

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇల్లు చూడండి.. ఎంత అద్భుతంగా ఉందో!

Telugu Heroes : సినిమాలతో పాటు హోటల్స్… లగ్జరీ రెస్టారెంట్స్ ఉన్న హీరోలు వీళ్లే

Salman Khan: పాక్ ను కెలికిన సల్లు భాయ్.. తెలుగు సినిమాలు బాగా చూస్తారంటూ..

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Big Stories

×