BigTV English

Tollywood Actress: బాలీవుడ్ లో సత్తా చాటుతున్న టాలీవుడ్ బ్యూటీస్…

Tollywood Actress: బాలీవుడ్ లో సత్తా చాటుతున్న టాలీవుడ్ బ్యూటీస్…

Tollywood Actress: టాలీవుడ్ టు బాలీవుడ్ కు వెళ్లడం హీరోయిన్లకు కొత్తేమి కాదు.. ఇప్పటికే ఎందరో సౌత్ భామలు నార్త్ సినిమాల్లో ఎంట్రీ ఇచ్చి బ్లాక్ బాస్టర్ హిట్ సినిమాలను తమ అకౌంట్ లో వేసుకుంటున్నారు. సౌత్ నుంచి నార్త్ లో దున్నెస్తున్న హీరోయిన్లు ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం..


సమంత..

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. తెలుగులో ఎన్నో బ్లాక్ బాస్టర్ సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్ గా ఇమేజ్ ను అందుకున్న సమంత తెలుగు, తమిళ సినిమాల్లో మాత్రమే కాదు.. హిందీ సినిమాల్లో కూడా నటించింది.. హిట్ సినిమాల్లో నటించి అక్కడ కూడా స్టార్ ఇమేజ్ ను అందుకుంది.. ప్రస్తుతం సిటాడెల్ వెబ్ సిరీస్ లో నటిస్తుంది.


రష్మిక మందన్న..

నేషనల్ క్రష్ రష్మిక మందన్న కూడా బాలీవుడ్ లో సత్తా చాటింది. అల్లు అర్జున్ పుష్ప సినిమాతో పాన్ ఇండియా హిట్ అందుకున్న రష్మిక. బాలీవుడ్ లో టాప్ టక్కర్’ అనే ప్రైవేటు ఆల్బమ్‌ తో అడుగుపెట్టింది. ఆ తర్వాత అక్కడ క్రేజీ ప్రాజెక్ట్స్ అందుకుంది. గత ఏడాది యానిమల్ మూవీతో బాలీవుడ్ మూవీస్ తో పలకరించింది.. ఆ మూవీ బ్లాక్ బాస్టర్ హిట్ అవ్వడంతో ఇప్పుడు మూడు, నాలుగు ప్రాజెక్టులలో నటిస్తూ హవాను కొనసాగిస్తుంది. తెలుగులో పుష్ప 2 సినిమాలో నటిస్తుంది.

పూజా హెగ్డే..

సౌత్ లోనే తమ సత్తా చాటిన ముద్దుగుమ్మలు ఇప్పుడు నార్త్ లోనూ మెమెంటో చూపిస్తాం అంటున్నారు. నార్త్ లో రాణించిన సౌత్ భామల్లో ముందుగా చెప్పుకోల్సింది. పూజా హెగ్డే గురించే. తెలుగు, తమిళ్ తో పాటు బాలీవుడ్ లోనూ సినిమాలు చేసింది పూజా. అక్కడ హృతిక్ రోషన్, అక్షయ్ కుమార్, సల్మాన్ ఖాన్ లాంటి హీరోల సరసన నటించి మెప్పించింది. కానీ ఒక్క హిట్ సినిమా కూడా తన ఖాతాలో పడలేదు..

వీరితో పాటుగా చాలా మందే ఉన్నారు.. ఇలియానా తెలుగులో టాప్ హీరోయిన్ గా రాణిస్తున్న సమయంలోనే హిందీలోకి అడుగు పెట్టింది. అక్కడ పలు సినిమాల్లో నటించి ఆతర్వాత సినిమాలకు బ్రేక్ ఇచ్చింది.. ఆసిన్, శ్రియా వంటి స్టార్ హీరోయిన్లు కూడా ఉన్నారు.. ఇక ఇప్పుడు ట్రెండ్ మారింది బాలీవుడ్ ముద్దుగుమ్మలు తెలుగు సినిమాల్లో నటించడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు..

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×