E-Paper
Advertisement

Hai Nanna: అరుదైన అవార్డును అందుకున్న హయ్ నాన్న..

Hai Nanna: అరుదైన అవార్డును అందుకున్న హయ్ నాన్న..
Advertisement

Hai Nanna: నాచురల్ స్టార్ నాని, మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన చిత్రం హాయ్ నాన్న. నూతన దర్శకుడు శౌర్యవ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా గతేడాది డిసెంబర్ లో రిలీజ్ అయ్యి ప్రేక్షకులను ఆకట్టుకుంది. వైరా క్రియేషన్స్ బ్యానర్ నిర్మించిన ఈ చిత్రంలో కియారా ఖన్నా బాలనటిగా పరిచయమైంది. తండ్రీకూతుళ్ల మధ్య ప్రేమను ఎంతో అద్భుతంగా తెరకెక్కించి అభిమానుల మనసులను ఆకట్టుకున్నారు.

Advertisement

ఇక తాజాగా ఈ సినిమా అరుదైన అవార్డును సొంతం చేసుకుంది. ఎథెన్స్ ఇంటర్నేషనల్ ఆర్ట్ ఫిల్మ్ ఫెస్టివల్ మార్చి 2024 ఎడిషన్ లో హాయ్ డాడీ బెస్ట్ ఫీచర్ ఫిల్మ్ గా ఎంపికైంది. “హాయ్ నాన్నా వేడుకలు అన్ని మూలల్లో కొనసాగుతున్నాయి..హాయ్ నాన్న.. హాయ్ డాడీగా రిలీజ్ అయ్యింది. ఇప్పుడు మార్చి 2024 ఎడిషన్‌లో గౌరవనీయమైన ఏథెన్స్ ఇంటర్నేషనల్ ఆర్ట్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ఉత్తమ ఫీచర్ ఫిల్మ్‌గా ప్రతిష్టాత్మక అవార్డును అందుకుంది.. ఈ అవార్డును అందుకోవడం సంతోషంగా ఉంది” అని మేకర్స్ తెలిపారు. ప్రస్తుతం ఈ వార్త నెట్టింట వైరల్ గా మారింది.

ఇక ఈ అవార్డు రావడంపై డైరెక్టర్ శౌర్యవ్ సంతోషం వ్యక్తం చేశాడు. ఎథెన్స్ ఇంటర్నేషనల్ ఆర్ట్ ఫిల్మ్ ఫెస్టివల్ లో హాయ్ నాన్నకు అవార్డ్ రావడం సంతోషంగా ఉందని తెలిపాడు. హాయ్ నాన్న సినిమా తనకు ఎంతో గౌరవాన్ని, గుర్తింపును తెచ్చిందని, తమ సినిమాను ఆదరించిన వారందరికీ థాంక్స్ అని తెలిపాడు. అంతేకాకుండా మనం తీసిన సినిమా బావుంటే.. అది ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను మెప్పిస్తుందని ఈ సినిమా మరోసారి రుజువు చేసిందని తెలిపాడు. ఈ అవార్డుని అందించిన జ్యూరీకి, హాయ్ నాన్న సినిమాకు ప్రాణం పోసిన నటీనటులకు పనిచేసిన టెక్నీషియన్స్ కు థాంక్స్ అని తెలిపాడు.

Advertisement

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×