BigTV English

Hi Nanna  : హాయ్ నాన్న సెన్సార్ కంప్లీట్..లెంగ్త్ ఏంటో తెలుసా?

Hi Nanna  : హాయ్ నాన్న సెన్సార్ కంప్లీట్..లెంగ్త్ ఏంటో తెలుసా?
hi nanna

Hi Nanna  : నాచురల్ స్టార్ నాని,మృణాల్ ఠాకూర్ కాంబోలో తెరకెక్కిన రొమాంటిక్ ఎమోషనల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ హాయ్ నాన్న. డిసెంబర్ 7న ప్రేక్షకులను పలకరించడానికి ఈ చిత్రం గ్రాండ్ గా థియేటర్లలోకి వస్తోంది. ఇక ఇందులో నాని శృతిహాసన్ సరసన చిన్న గెస్ట్ రోల్ చేస్తోంది. మూవీ నుంచి విడుదలైన ట్రైలర్.. సాంగ్స్.. సినిమాపై అంచనాలని ఓ రేంజ్ లో పెంచాయి. కాస్త ఎమోషనల్ ఎక్కువగా ఉన్న.. ఈ మూవీపై బజ్ బాగా నెలకొంది.


ఇక ట్రైలర్ చూస్తే.. తండ్రి కూతుర్ల సెంటిమెంట్ ఏ రేంజ్ లో ఉందో స్పష్టంగా అర్థం అవుతుంది. కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ప్రామిసింగ్ గా ఉన్న మూవీ ట్రైలర్ చిత్రంపై ఆసక్తి పెంచుతోంది. నాని ఎప్పటికప్పుడు తన సినిమాలలో డిఫరెంట్ కథ ఎంచుకోవడమే కాకుండా.. సినిమా సినిమాకి మంచి ప్రామిసింగ్ కంటెంట్ తో వస్తున్నాడు. పైగా తెలుగు మార్కెట్లో నాని సినిమాలకు గిరాకీ బాగానే ఉంటుంది.

ఈ నేపథ్యంలో హాయ్ నాన్న మూవీ పై అంచనాలు బలంగా ఉన్నాయి. ఒకపక్క ఇప్పటికే విడుదలైన సందీప్ రెడ్డి వంగ యాక్షన్ రొమాంటిక్ మూవీ యానిమల్ మరో పక్క 8న థియేటర్లలోకి రాబోతున్న నితిన్ ఎక్స్ట్రాడినరీ మ్యాన్.. పోటీ బలంగా ఇచ్చే ఆస్కారం ఉన్నా కానీ నాని మూవీ పై అంచనాలు ఏమీ తగ్గడం లేదు. ఇక ఆ విషయం పక్కన పెడితే ఈ చిత్రం ఈరోజు తన సెన్సార్ పనులు పూర్తి చేసుకుంది. ఆ వివరాలు ఎలా ఉన్నాయో ఓ లుక్కేద్దాం పదండి.


ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీ కావడంతో సెన్సార్ బోర్డు కూడా ఈ మూవీకి క్లీన్ యూ సర్టిఫికెట్ ఇచ్చేసింది. ఈ మూవీ నిడివి 2 గంటల 35 నిమిషాలు అని టాక్. అంతేకాదు ఈ విషయాన్ని తెలియ పరుస్తూ.. ప్రతి ఒక్కరి జీవితంలో ఉండే ఒక అద్భుతమైన కావ్యానికి దృశ్య రూపమే హాయ్ నాన్నా మూవీ అంటూ చిత్ర బృందం ట్విట్టర్లో పోస్ట్ కూడా షేర్ చేసింది. అలాగే దగ్గరలో ఉన్న థియేటర్ కి డిసెంబర్ 7న తప్పకుండా వెళ్లి మూవీ ని చూసి మమ్మల్ని ఆశీర్వదించాలి అని కూడా వెరైటీగా కోరిక కోరేశారు ఈ మూవీ యూనిట్. మరి మీరు కూడా మీ ఫ్యామిలీతో వాళ్ళని ఆశీర్వదించడానికి థియేటర్ కి వెళ్తున్నారా..?

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×