Big Stories

Hi Nanna Twitter Review : హాయ్ నాన్న ఎమోషనల్ డ్రామా.. ట్విట్టర్ రివ్యూ..

Hi Nanna Twitter Review

- Advertisement -

Hi Nanna Twitter Review : వైరా ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌ పై..నాని, మృణాల్ ఠాకూర్ కాంబోలో పెరకెక్కిన బ్యూటిఫుల్ ఎమోషనల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ లవ్ స్టోరీ హాయ్ నాన్న. డిసెంబర్ 7న ప్రపంచవ్యాప్తంగా ఈ మూవీ రిలీజ్ అయింది. ఇక ప్రస్తుతం ట్రెండును బట్టి ఒక రోజుకు ముందే స్పెషల్ ప్రీమియంస్ ప్రదర్శించారు. ఈ సినిమాకు సంబంధించిన ట్విట్టర్ రివ్యూ ఎలా ఉందో చూద్దాం..

- Advertisement -

హాయ్ నాన్న మూవీలో విరాజ్ పాత్రలో నాని యాక్షన్ ఎన్నో సన్నివేశాలలో మనసుకు హత్తుకునే విధంగా ఉంది.యష్ణ గా పరిచయమైన మృణాల్.. ఫ్లాష్ ప్యాక్ లో వర్ష క్యారెక్టర్ లో ఊహించుకున్నప్పుడు అద్భుతంగా సెట్ అయింది.బేబీ కియారా నటన చాలా నేచురల్ గా.. ఎంతో రియలిస్టిక్ గా ఉంది. ఆ పాప ఎమోషన్స్ తో ప్రేక్షకులు ఇట్టే కనెక్ట్ అయిపోతున్నారు. సింగిల్ ఫాదర్ గా బిడ్డను పెంచే ప్రతి తండ్రి.. విరాజ్ పాత్రకు ఈజీగా సింక్ అవుతారు.

ఈ సినిమా చూసిన చాలా మంది ఇందులో నాని, మృణాల్ కెమిస్ట్రీ అద్భుతంగా ఉంది అంటూ సర్టిఫికెట్ ఇస్తున్నారు. మ్యూజిక్ అయితే నెక్స్ట్ లెవెల్ లో ఉంది అంటున్నారు. ఇది ఒక ఎమోషనల్ రోలర్ కోస్టర్ .. ఒకసారి సినిమా స్టార్ట్ అయితే మెల్లిగా అందులో మిమ్మల్ని మీరు మర్చిపోతారు అని మరి కొంతమంది అంటున్నారు. మొత్తానికి పాజిటివ్ బజ్ అయితే మూవీ పై బాగా నెలకొంది. నాని నుంచి మరొక మంచి సాలిడ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీ వచ్చిందని అనుకోవాలి.

హాయ్ నాన్న మూవీ కచ్చితంగా హృదయాన్ని కూడా కదిలించే బ్యూటిఫుల్ మూవీ అనడంలో ఎటువంటి డౌటు లేదు. ఈ మూవీ నాని కెరీర్‌లో లో ఒక మైలురాయిగా నిలిచిపోతుంది. ఒక తండ్రిగా నాని పడే తపన.. తల్లి కోసం కూతురు పడే ఆరాటం.. ఎమోషన్స్ ఎంత హెవీగా చూపిస్తారో ..ఫన్ కూడా అంతే హెవీగా ఎస్టాబ్లిష్ చేశారు. దీంతో సినిమా పెద్దగా ఫోన్ అనిపించదు. ఫస్ట్ అఫ్ బాగుంది..కానీ సెకండ్ హాఫ్ మొదలయ్యాక మెల్లిగా మనం కూడా కథలోకి ఇన్వాల్వ్ అయిపోయినట్టు అనిపిస్తుంది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News