Boycott Netflix: ప్రస్తుతం డిజిటల్ రంగంలో నెంబర్ 1 ప్లేస్ లో దూసుకుపోతుంది నెట్ ఫ్లిక్స్. అడల్ట్ కంటెంట్ ఎక్కువ ఉన్న ఓటిటీగా నెట్ ఫ్లిక్స్ గుర్తింపు తెచ్చుకుంది. ఇక నెట్ ఫ్లిక్స్ కు వివాదాలేమి కొత్త కాదు. ముఖ్యంగా హిందూ, సనాతన ధర్మాల విషయంలో ఎన్నోసార్లు నెట్ ఫ్లిక్స్ విమర్శలకు గురైంది. ఇప్పుడు మరోసారి నెట్ ఫ్లిక్స్ పై నెటిజన్స్ మండిపడుతున్నారు. అందుకు కారణం.. మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ కొడుకు జునైద్ ఖాన్. అమీర్‌ఖాన్, రీనాదత్తా ల ముద్దుల తనయుడు జునైద్ గురించి అభిమానులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
పీకే సినిమాతో పాటు తండ్రి అమీర్ ఖాన్ నటించిన బాలీవుడ్ సినిమాలకు జునైద్‌ఖాన్ అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేశాడు. అనంతరం మహారాజ్ అనే సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వనున్నాడు. ఈ సినిమా రిలీజ్‌కు ముందే మరో రెండు సినిమాల్లో అతడు హీరోగా నటించబోతున్నాడు. కానీ, మొదటి సినిమా ఇంకా రిలీజ్ కాకముందే వివాదాల్లో ఇరుక్కుంది. జునైద్ హీరోగా సిద్దార్థ్ పి మల్హోత్రా దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం మహారాజ్. నెట్‌ఫ్లిక్స్‌లో జూన్ 14 నుంచి స్ట్రీమింగ్ కానుంది.
ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్, టీజర్ వివాదాలను తీసుకొచ్చి పెట్టింది. ఈ సినిమాలో నైద్ హిందు మతాన్ని, ఆచారాలు, సంస్కృతలను మహారాజ్ మూవీతో వక్రీకరించే ప్రయత్నం చేసినట్లు చెప్తున్నారు. హిందూ సాధువులను, సన్యాసులను కామంధులుగా చిత్రీకరిస్తూ వారిని మహారాజ్ మూవీతో అవమానించాలని చూస్తున్నట్లు నెటిజన్స్ చెప్పుకొస్తున్నారు. అందుకే ఈ సినిమాను అడ్డుకోవాలని హిందూ పెద్దలు కోర్టును ఆశ్రయించారు.
ఈరోజు ఉదయం కోర్టు ఈ సినిమాను జూన్ 18 కి వాయిదా వేసింది. ఈలోపు విచారణ చేపట్టాలని కోరింది. ఇక అంతేకాకుండా ఇంకోపక్క నెట్ ఫ్లిక్స్ మీద కూడా నెటిజన్స్ ఫైర్ అవుతున్నారు. ఛీఛీ.. నెట్ ఫ్లిక్స్ ఇక మారదు అని, నెట్ ఫ్లిక్స్ ను బ్యాన్ చేయాలనీ డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం బాయ్ కాట్ నెట్ ఫ్లిక్స్ ట్రెండింగ్ లో ఉండడం విశేషం. మరి ఈ వివాదంపై అమీర్ ఎలా స్పందిస్తాడో చూడాలి.