BigTV English
Advertisement

Hit 3 : ‘హిట్ 3’ మూవీ న్యూయర్ స్పెషల్.. పోస్టర్ తో అదరగొట్టిన నాని..

Hit 3 : ‘హిట్ 3’ మూవీ న్యూయర్ స్పెషల్.. పోస్టర్ తో అదరగొట్టిన నాని..

Hit 3 : న్యాచురల్ స్టార్ నానికి గత ఏడాది బాగా కలిసి వచ్చింది. వరుస హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకున్నాడు. చివరగా సరిపోదా శనివారం మూవీతో ప్రేక్షకులను పలకరించాడు. ఆ మూవీ సూపర్ హిట్ అయ్యింది. ఇప్పుడు మరో మూవీతో ప్రేక్షకులను అలరించేందుకు రెడీ అవుతున్నాడు.. దర్శకుడు శైలేష్ కొలను తెరకెక్కిస్తున్న సాలిడ్ క్రైమ్ థ్రిల్లర్ చిత్రం “హిట్ 3” లో నాని నటిస్తున్న విషయం తెలిసిందే.. ఈ మూవీ ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. తాజాగా న్యూయర్ స్పెషల్ సర్ ప్రైజ్ ను ఇచ్చారు. ఈ మూవీ నుంచి న్యూయర్ విషెస్ చెబుతూ పోస్టర్ ను రిలీజ్ చేశారు. ప్రస్తుతం ఆ పోస్టర్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.


ఆ పోస్టర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ పోస్టర్ లో నాని అర్జున్ సర్కార్ గా కనిపించనున్న సంగతి తెలిసిందే. అయితే తాను ఈ కొత్త సంవత్సరం కానుకగా సాలిడ్ పోస్టర్ తో అందరికీ విషెస్ ని తెలిపాడు.. నాని ఇంటెన్స్ లుక్ లో కనిపిస్తూ మీసాలు దువ్వుతున్న అర్జున్ సర్కార్ లా నాని ఇందులో అదరగొట్టాడు అని చెప్పాలి. దీనితో ఈ పోస్టర్ చూసిన తన ఫ్యాన్స్ మరింత ఎగ్జైట్ అవుతున్నారు. ఇక ఈ అవైటెడ్ చిత్రాన్ని మేకర్స్ త్వరలోనే రిలీజ్ చెయ్యనున్నారు..

ఇక ఈ మూవీ నుంచి ఇప్పటివరకు రిలీజ్ చేసిన పోస్టర్స్, అప్డేట్స్ అన్నీ సినిమాపై ఆసక్తిని పెంచేస్తున్నాయి. గతంలో వచ్చిన హిట్ మూవీ మంచి సక్సెస్ టాక్ ను అందుకుంది. ఆ మూవీకి సీక్వెల్ గా వచ్చిన హిట్ 2 మూవీ కూడా భారీ విజయాన్ని అందుకుంది. ఇప్పుడు ఆ మూవీకి సీక్వెల్ గా హిట్ 3 మూవీ రాబోతుంది. ఈ మూవీలో నాని హీరోగా నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం రాజస్థాన్ అరుణాచల్ ప్రదేశ్లలో షెడ్యూల్స్ తర్వాత జమ్మూకాశ్మీర్లో షూటింగ్ కోసమని చిత్ర బృందం అక్కడికి వెళ్ళింది.. ఇక నిన్న ఈ మూవీ సెట్ లో కృష్ణ అస్వస్థకు గురైంది. ప్రాణాలు విడిచిన సంగతి తెలిసిందే.. ఈ మూవీ షూటింగ్ త్వరగా పూర్తి చేసి రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఈ మూవీ హిట్ అయితే నానికి ఇక తిరుగులేదు.. దీని తర్వాత ఫ్యారడైజ్ మూవీ చేస్తున్నాడు. ఆ మూవీ దసరా మూవీకి సీక్వెల్ గా రాబోతుంది.


 

Tags

Related News

Tejaswini Nandamuri: నందమూరి వారసురాలు వైరల్ యాడ్ డైరెక్టర్ ఎవరో తెలుసా? ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందా?

Film industry: ఘనంగా సినిమాటిక్ ఎక్స్ పో 3వ ఎడిషన్!

CM Revanth on Movie Tickets: సినిమా టికెట్ డబ్బుల్లో సినీ కార్మికులకు వాటా… సీఎం సంచలన ప్రకటన

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇల్లు చూడండి.. ఎంత అద్భుతంగా ఉందో!

Telugu Heroes : సినిమాలతో పాటు హోటల్స్… లగ్జరీ రెస్టారెంట్స్ ఉన్న హీరోలు వీళ్లే

Salman Khan: పాక్ ను కెలికిన సల్లు భాయ్.. తెలుగు సినిమాలు బాగా చూస్తారంటూ..

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Big Stories

×