BigTV English

Naga Chaitanya: సమంత – శోభిత కాంబోలో మూవీ.. తప్పుకున్న శోభిత.. అసలేమైందంటే..?

Naga Chaitanya: సమంత – శోభిత కాంబోలో మూవీ.. తప్పుకున్న శోభిత.. అసలేమైందంటే..?

Naga Chaitanya:టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో గత ఏడాదిగా ప్రథమంగా వినిపిస్తున్న పేర్లు నాగచైతన్య (Naga Chaitanya) , సమంత (Samantha),శోభిత(Shobhita Dhulipala). నాగచైతన్య.. శోభితను రెండో వివాహం చేసుకోబోతున్నారు అని తెలిసినప్పటి నుంచి పెద్ద ఎత్తున వీరి పేర్లు వైరల్ అయ్యాయి. దీనికి తోడు అటు సమంతా కూడా ఇంకో వివాహం చేసుకోబోతోంది అంటూ వార్తలు వచ్చాయి.కానీ అందులో నిజం లేదు. ఇదిలా ఉండగా నాగచైతన్య మాజీ భార్య అలాగే ప్రస్తుత భార్యలైన సమంత ,శోభిత గురించి ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. అదేమిటంటే నాగచైతన్య – సమంత – శోభిత కాంబినేషన్లో ఒక సినిమా రావాల్సిందట. కొంత సినిమా షూటింగ్ కూడా జరిగిన తర్వాత.. శోభిత తప్పుకుందట. అప్పుడే శోభితతో నాగచైతన్యకు పరిచయం ఏర్పడి ఉంటుందనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి.


సమంతతో నాగచైతన్య ప్రేమ, పెళ్లి, విడాకులు..

అసలు విషయంలోకి వెళితే.. తనకు మొదటి విజయాన్ని అందించిన సమంతతోనే నాగచైతన్య ఏడడుగులు వేశారు. సమంతకు తొలి చిత్రం ‘ఏ మాయ చేసావే’ అయినా నాగచైతన్యకు మాత్రం రెండవ చిత్రం. ‘జోష్’ అనే సినిమాతో వెండితెరకు పరిచయమయ్యారు. కానీ ‘ఏ మాయ చేసావే’ సినిమాతో మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు. అలా ఈ సినిమా తర్వాత వీరిద్దరూ చాలా ఏళ్లపాటు రహస్యంగా ప్రేమించుకున్నారు. ఇక పెళ్లికి కొన్ని రోజుల ముందే వీరు రిలేషన్ లో ఉన్నారనే విషయం వెలుగులోకి వచ్చింది. ఇక దాంతో 2017లో నాగచైతన్య, సమంత గోవా వేదికగా హిందూ, క్రిస్టియన్ సాంప్రదాయాలలో వివాహం చేసుకున్నారు. పెళ్లి తర్వాత నాగచైతన్య, సమంత సిల్వర్ స్క్రీన్ పై రొమాన్స్ కూడా చేసిన విషయం తెలిసిందే. అదే మజిలీ. ముఖ్యంగా వీరిద్దరి కాంబినేషన్లో ఎన్నో సినిమాలు వచ్చాయి. ”, ‘ఓ బేబీ’ చిత్రాలలో నాగచైతన్య గెస్ట్ రోల్ కూడా చేశారు.


సమంత – శోభిత – నాగచైతన్య కాంబోలో మూవీ..

ఇకపోతే నాగచైతన్య ,సమంతల పెళ్లి తర్వాత నటించిన చిత్రాలలో ‘మజిలీ’ సినిమా కూడా ఒకటి. ఈ సినిమాకి ప్రముఖ డైరెక్టర్ శివ నిర్వాణ (Shiva Nirvana) దర్శకత్వం వహించారు. ఎమోషనల్ లవ్ డ్రామాగా తెరకెక్కిన మజిలీ సినిమాలో సమంత,నాగచైతన్య పోటీ పడి మరీ నటించారు. ఇద్దరి పాత్రలలో కూడా బాగా డెప్త్ కనిపించింది. దాంతో సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకొని, ఈ జంటకు మంచి గుర్తింపును అందించింది ఇకపోతే ఈ సినిమాలో సెకండ్ హీరోయిన్ గా దివ్యాన్ష కౌశిక్ నటించారు. అయితే ఈ పాత్ర కోసం ముందుగా శోభితను అనుకున్నారట చిత్ర బృందం. అందులో భాగంగానే కొద్ది రోజులు ఆమెపై సన్నివేశాలు కూడా చిత్రీకరించారట. కానీ అనుకోని కారణాలవల్ల శోభిత ఈ ప్రాజెక్టు నుంచి దూరమైందని, ఈ క్రమంలోనే దివ్యాన్ష కౌశిక్ ని సెకండ్ హీరోయిన్గా తీసుకున్నారని సమాచారం. ఇక అప్పుడే నాగచైతన్య శోభితలకు పరిచయం ఏర్పడిందని కూడా వార్తలు వినిపిస్తున్నాయి. ఆ పరిచయమే సమంతా నుంచి విడాకులు తీసుకున్న తర్వాత శోభిత చైతూకి దగ్గర అవడంతో, ఆమె ప్రేమకు పొంగిపోయిన చైతు.. ఆమెను వివాహం చేసుకున్నారని కొంతమంది నెటిజన్స్ కామెంట్లు చేస్తున్నారు.

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×