BigTV English
Advertisement

Hit 3: సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ గా హిట్ 3.. కాశ్మీర్లో షూటింగ్..ఆ రోజు నుంచే..!

Hit 3: సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ గా హిట్ 3.. కాశ్మీర్లో షూటింగ్..ఆ రోజు నుంచే..!

Hit 3: ప్రముఖ డైరెక్టర్ శైలేష్ కొలను (Sailesh koalnu) యూనివర్స్ లో భాగంగా విశ్వక్ సేన్ (Vishwak sen)హీరోగా వచ్చిన చిత్రం హిట్(Hit). సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ మూవీగా వచ్చిన ఈ సినిమా విపరీతమైన విజయాన్ని సొంతం చేసుకోవడంతో వరుసగా ఫ్రాంచైజీ చిత్రాలు చేస్తున్నట్లు డైరెక్టర్ ప్రకటించారు.. అన్నట్లుగానే ఇప్పటికే అడివి శేష్ (Adivi shesh)హీరోగా హిట్ -2 (Hit -2) సినిమా వచ్చి మరో విజయాన్ని అందుకుంది. ఇప్పుడు మూడో సినిమా అంతకుమించి ఉండాలనే ఉద్దేశ్యం తో నాచురల్ స్టార్ నాని (Nani) డైరెక్టర్ శైలేష్ కొలనుతో ప్రత్యేకంగా చర్చలు చేపట్టినట్లు తెలుస్తోంది. ఇటీవలే సరిపోదా శనివారం సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న నాని ఇప్పుడు హిట్ 3 తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.


అర్జున్ సర్కార్ గా నాని బాధ్యత..

ఈ మేరకు గత నెల ఈ సినిమా నుంచి గ్లింప్ విడుదల చేయగా.. విశేష స్పందన సొంతం చేసుకుంది. ఇందులో నాని అర్జున్ సర్కార్ గా ఛార్జ్ తీసుకోబోతున్నట్లు అధికారిక ప్రకటన వెలువడింది. పోలీసుకు తక్కువ.. క్రిమినల్ కి ఎక్కువ అంటూ అర్జున్ సర్కార్ చార్జ్ తీసుకోబోతున్నాడు అనే డైలాగుతో ఈ గ్లింప్ బాగా ఆకట్టుకుంది. ఇక ఈ సినిమా మే ఒకటి 2025న రాబోతోంది అంటూ ట్వీట్ కూడా చేశారు. ఇప్పటికే హీరోయిన్ తో పాటు ఇతర తారాగణం విషయంలో కూడా చర్చలు జరుగుతున్నాయట.


వచ్చే యేడాది జనవరిలో షూటింగ్ మొదలు..

ఇదిలా ఉండగా తాజాగా ఈ సినిమాకు సంబంధించి మరో అప్డేట్ తెరపైకి వచ్చింది. ఈ సినిమా షూటింగ్ వచ్చేనెల అనగా నవంబర్ లో హైదరాబాదులో ఆరు రోజులు షూటింగ్ జరగనుందని, ఆ తర్వాత కాశ్మీర్లో జరగబోతోందని , అది కూడా వచ్చే ఏడాది జనవరి నుంచి ప్రారంభం కాబోతున్నట్లు సమాచారం. మొత్తానికైతే హిట్ 3 తో భారీ విజయాన్ని సొంతం చేసుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నారు నాని. ఇక్కడ మరో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే హిట్ ఫ్రాంచైజీల నిర్మాణంలో నాని భాగం పంచుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఈ సినిమాతో మరో విజయాన్ని అందుకోవడానికి పలు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమా తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ భాషలలో పాన్ ఇండియా వైడ్ గా విడుదల కానుండగా ఈ సినిమా నుంచి ఒక్కో భాషలో ఒక్కో రకమైన గ్లింప్ రిలీజ్ చేశారు. ఇందులో నాని పవర్ ఫుల్ క్యారెక్టర్ లో ఇక భారీ అంజనాల మధ్య సమ్మర్ సెలవులను క్యాష్ చేసుకోవడానికి వస్తున్న ఈ సినిమా నానికి ఎలాంటి విజయాన్ని అందిస్తుందో చూడాలి.

హిట్ -3 తారాగణం..

ఇకపోతే నాని నటిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ సెలబ్రిటీలను కూడా భాగం చేసినట్లు తెలుస్తోంది. ఇందులో నానికి జోడిగా శ్రీనిధి శెట్టి నటిస్తూ ఉండగా ఇందులో ప్రధాన విలన్ గా ఎవరు నటిస్తారు అనే అంశం తెర పైకి రాగా బాలీవుడ్ నటుడు అలీ ఫైజల్ (Ali Faisal) ను ఇందులో తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఈయన ఇందులో విలన్ క్యారెక్టర్ చేస్తున్నారా లేక ఏదైనా పవర్ ఫుల్ పాత్ర పోషిస్తున్నారా అనేది తెలియాల్సి ఉంది. మొత్తానికి అయితే పగడ్బందీగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నట్లు సమాచారం.

Tags

Related News

Tejaswini Nandamuri: నందమూరి వారసురాలు వైరల్ యాడ్ డైరెక్టర్ ఎవరో తెలుసా? ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందా?

Film industry: ఘనంగా సినిమాటిక్ ఎక్స్ పో 3వ ఎడిషన్!

CM Revanth on Movie Tickets: సినిమా టికెట్ డబ్బుల్లో సినీ కార్మికులకు వాటా… సీఎం సంచలన ప్రకటన

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇల్లు చూడండి.. ఎంత అద్భుతంగా ఉందో!

Telugu Heroes : సినిమాలతో పాటు హోటల్స్… లగ్జరీ రెస్టారెంట్స్ ఉన్న హీరోలు వీళ్లే

Salman Khan: పాక్ ను కెలికిన సల్లు భాయ్.. తెలుగు సినిమాలు బాగా చూస్తారంటూ..

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Big Stories

×