BigTV English
Advertisement

Netizens Trolling: రూ. 250 కోట్లతో ఇల్లు కడుతున్న ఆలియా, మరీ అంత చెత్తగా ఉందేంటని ట్రోల్స్!

Netizens Trolling:  రూ. 250 కోట్లతో ఇల్లు కడుతున్న ఆలియా, మరీ అంత చెత్తగా ఉందేంటని ట్రోల్స్!

Ranbir Kapoor- Alia Bhatts Bandra Home: బాలీవుడ్ స్టార్ కఫుల్స్ గురించి రణబీర్ కపూర్, ఆలియా గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు. బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాలతో సక్సెస్ ఫుల్ గా కెరీర్ కొనసాగిస్తున్నారు. తాజాగా ఈ జంట ముంబైలో ఓ ఇంటిని నిర్మించుకుంటున్నారు. బాంద్రాలోని ప్రైమ్ ఏరియాలో ఈ ఇంటి నిర్మాణం కొసాగుతోంది. మరి కొద్ది రోజుల్లోనే పూర్తి కానుంది. త్వరలో తమ ముద్దుల కూతురు రాహాతో కలిసి ఈ ఇంట్లోకి అడుగు పెట్టబోతున్నారు. ఈ ఇంటికి రణబీర్ తన బామ్మ కృష్ణ రాజ్ కుమార్ పేరు పెట్టారు.


రూ. 250 కోట్ల విలువైన బంగళా

తాజాగా ఈ ఇంటికి సంబంధించి వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఆరు అంతస్తులుగా ఈ బంగళాను నిర్మించారు. బూడిద, లేత నీలం రంగులు వేశారు. గ్లాస్ తో ఏర్పాటు చేసి బాల్కనీలు, పెద్ద కిటికీలు ఆకట్టుకుంటున్నాయి. అత్యధునిక ఇంటీరియర్ డిజైన్ ఏర్పాటు చేశారు. ఇంపోర్టెడ్ మార్బుల్స్, కిచెన్ వేర్ తో అద్భుతంగా తయారు చేశారు. ఈ బంగళాలో స్విమ్మింగ్ ఫూల్, మినీ థియేటర్, ఓ ఆఫీస్ సహా బోలెడు విశేషాలు ఉన్నట్లు తెలుస్తోంది. బాలీవుడ్ లైఫ్ రిపోర్ట్ ప్రకారం రణబీర్ దంపతుల బంగ్లా విలువ రూ.250 కోట్లు. షారూఖ్ ఖాన్ నివాసం మన్నత్, అమితాబ్ బచ్చన్ బంగళా జల్సాతో పోల్చితే ఈ బంగళా అత్యంత ఖరీదైనది.


ఆలియా ఇంటిపై నెటిజన్ల ట్రోలింగ్

ఆలియా, రణబీర్ ఇష్టపడి కట్టించుకుంటున్న బంగళా వీడియో తాజాగా సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. చాలా మంది ఇంటి డిజైన్ ను హేళన చేస్తున్నారు. ఇదేం ఇళ్లు అంటూ ట్రోల్ చేస్తున్నారు. ‘ఇది ఇల్లులా లేదు, ఆఫీస్’లా ఉందని ఒకరు అనగా, ‘చాలా చీప్ సెలెక్షన్. గార్డెన్ కనిపించడం లేదు, సహజ అందం లేదు’ అంటూ మరో నెటిజన్ కామెంట్ చేశాడు. మరికొంత మంది ఈ ఇల్లు అచ్చం యూట్యూబర్ ఎల్విష్ యాదవ్ ఇంటిలా ఉందని ట్రోల్ చేస్తున్నారు. “ఇది ఎల్విష్ యాదవ్ కొత్త ఇల్లు అనుకున్నాను. ఈ డిజైన్ ఆయన ఇంటిని చూసి కాపీ కొట్టినట్లు అనిపిస్తోంది” అని ఓ నెటిజన్ కామెంట్ పెట్టాడు. మరికొంత మంది నెటిజన్లు మాత్రం ఇల్లు చాలా బాగుందని అభినందిస్తున్నారు. ప్రశాతంమైన ప్రదేశంలో చక్కగా ఉందంటున్నారు. త్వరలోనే రణబీర్ దంపతులు గృహ ప్రవేశం చేయనున్నారు.

?utm_source=ig_embed&utm_campaign=loading" data-instgrm-version="14">

 

View this post on Instagram

 

?utm_source=ig_embed&utm_campaign=loading" target="_blank" rel="noopener">A post shared by Viral Bhayani (@viralbhayani)

2022లో రణబీర్, ఆలియా వివాహం

బాలీవుడ్ హీరో, హీరోయిన్ గా మంచి గుర్తింపు పొందిన ఆలియా భట్, రణబీర్ కపూర్ ఏప్రిల్ 14, 2022లో పెళ్లి చేసుకున్నారు. కొంత కాలం పాటు ఇద్దరూ డేటింగ్ చేశారు. ఆ తర్వాత ఇరు కుటుంబ సభ్యుల అంగీకారంతో పెళ్లి చేసుకున్నారు. కరోనా టైమ్ కావడంతో ఈ పెళ్లికి ఇరు కుటుంబ సభ్యులు, కొద్ది మంది బంధు మిత్రులు హాజరయ్యారు. ప్రస్తుతం వీరికి ఓ పాప పుట్టింది. ఆమెకు రాహా అని పేరు పెట్టారు. ప్రస్తుతం రణబీర్, ఆలియా బాలీవుడ్ లో హీరో, హీరోయిన్లుగా రాణిస్తున్నారు. వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు.

Read Also: ఇండియాలో రిచెస్ట్ స్టార్ కిడ్.. ఎన్ని వేల కోట్ల ఆస్తులు ఉన్నాయంటే ?

Related News

Tejaswini Nandamuri: నందమూరి వారసురాలు వైరల్ యాడ్ డైరెక్టర్ ఎవరో తెలుసా? ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందా?

Film industry: ఘనంగా సినిమాటిక్ ఎక్స్ పో 3వ ఎడిషన్!

CM Revanth on Movie Tickets: సినిమా టికెట్ డబ్బుల్లో సినీ కార్మికులకు వాటా… సీఎం సంచలన ప్రకటన

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇల్లు చూడండి.. ఎంత అద్భుతంగా ఉందో!

Telugu Heroes : సినిమాలతో పాటు హోటల్స్… లగ్జరీ రెస్టారెంట్స్ ఉన్న హీరోలు వీళ్లే

Salman Khan: పాక్ ను కెలికిన సల్లు భాయ్.. తెలుగు సినిమాలు బాగా చూస్తారంటూ..

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Big Stories

×