BigTV English

John Cena @ Oscar Awards 2024: అందర్నీ ఫూల్స్ చేసిన జాన్‌సీనా.. ఆస్కార్ వేదికపైకి నగ్నంగా రాలేదు.. ఇదిగో ప్రూఫ్

John Cena @ Oscar Awards 2024: అందర్నీ ఫూల్స్ చేసిన జాన్‌సీనా.. ఆస్కార్ వేదికపైకి నగ్నంగా రాలేదు.. ఇదిగో ప్రూఫ్

oscar awards 2024 john cena


Fact on John Sena Naked Entry on Oscar Awards Stage 2024 : సోమవారం జరిగిన 96వ ఆస్కార్ అవార్డుల వేడుక ఎంతో గ్రాండ్‌గా జరిగింది. ప్రముఖ సినీ సెలబ్రెటీలు ఈ వేడుకలో సందడి చేశాడు. అమెరికాలోని లాస్ ఏంజిల్స్‌లో డాల్బీ థియేటర్లో జరిగిన ఈ వేడుకకు ఎంతో మంది హాజరయ్యారు.

కాగా ఈ వేడుకలో పలు సినిమాలు, డాక్యుమెంటరీలకు గానూ వివిధ విభాగాల్లో అవార్డులు అందుకున్నారు. అయితే ప్రతి ఏడాది నిర్వహించే ఈ వేడుకలో ఏదో ఒక హైలెట్ ఉంటూనే ఉంటుంది. ఈ వేడుకలో పాల్గొన్న వారిని కడుపుబ్బా నవ్వించేందుకు ఏదో ఒక రూపంలో కొందరు దర్శనమిస్తుంటారు.


అయితే అలాంటిదే ఈ ఏడాది ఆస్కార్ వేడుకలో కూడా జరిగింది. ప్రముఖ హాలీవుడ్ హీరో, WWW షోలతో ఫుల్ పాపులారిటీ తెచ్చుకున్న జాన్‌సీనా ఈ ఆస్కార్ వేడుకల్లో తన రూపంతో అందరినీ షాక్‌కి గురిచేశాడు. కాగా జాన్‌సీనాకు ఇండియన్ సినీ ప్రియుల్లో కూడా ఫుల్ క్రేజ్ ఉంది. అతడి సినిమాలు వస్తున్నాయంటే ప్రేక్షకాభిమానులు థియేటర్లకు పరుగులు తీస్తుంటారు.

Also Read: ఆస్కార్ వేదికపైకి నగ్నంగా జాన్‌సీనా.. వీడియో వైరల్..

అలాంటి హీరో కమ్ రెజ్లర్ ఆస్కార్ వేడుకల్లో తన రూపంతో అందరినీ ఆశ్చర్యపరిచాడు. 2024 ఆస్కార్ అవార్డుల వేడుకల్లో పాల్గొన్న అతడు ఒంటిమీద నూలుపోగులేకుండా దర్శనమిచ్చి అందరూ అవాక్కయ్యేలా చేశాడు. కాగా బెస్ట్ కాస్ట్యూమ్ డిజైనర్ అవార్డుని ప్రకటించడానికి జాన్‌సీనాను వేదికపైకి ఆహ్వానించారు.

ఆ సమయంలో అతడు వేదిక వెనుకనుంచి తన ప్రైవేట్ పార్ట్‌ను ఒక అట్టముక్కతో కప్పుకుని వచ్చాడు. దీంతో అక్కడున్నవారంతా షాక్ అయ్యారు. మరికొందరెమో నవ్వుకున్నారు. అయితే వేదికపైకి వచ్చిన జాన్‌సీనా మాట్లాడుతూ.. అందుకే కాస్ట్యూమ్‌ ఇంపార్టెంట్ అని తెలిపాడు.

ఆ తర్వాత వేదికపై ఉన్న లైట్లు ఆఫ్ చేశాక.. కొందరు జాన్‌సీనాకు ఒక చీరలాంటి క్లాత్‌ను చుట్టారు. అనంతరం బెస్ట్ కాస్ట్యూమ్ డిజైనర్ అవార్డుని జాన్‌సీనా ప్రకటించాడు. ఈ సారి బెస్ట్ కాస్ట్యూమ్ డిజైన్ అవార్డును పూర్ థింగ్స్ మూవీ దక్కించుకుంది. ఈ అవార్డును హోలి వెడ్డింగ్‌టన్ సొంతం చేసుకున్నారు.

అయితే అందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. తాజాగా ఇదంతా నిజమేనని అందరూ అనుకున్నారు. జాన్‌సీనా నిజంగానే ఒంటిపై నూలు పోగు లేకుండా స్టేజీపైకి వచ్చాడని అందరూ అనుకున్నారు. నిజానికి జాన్‌సీనా స్టేజీ పైకి నగ్నంగా రాలేదు.

Also Read: ఈ రోజు టీవీల్లో మాస్ యాక్షన్ అండ్ క్లాస్ బ్లాక్ బస్టర్ సినిమాలు.. 

తన ప్రైవేట్ పార్ట్‌ని ఓ క్లాత్‌తో కప్పుకున్నాడు. స్టేజిపైకి వచ్చినపుడు ఆ క్లాత్‌ను ఒక అట్టముక్కతో కప్పుకున్నాడు. కానీ ఈ విషయం తెలియక.. అందరూ జాన్‌సీనా ఒంటిపై గుడ్డముక్క లేకుండానే నగ్నంగా వచ్చాడని అనుకున్నారు.

John Cena
John Cena

అయితే అతడు అర్థనగ్నంగా వచ్చాడని బ్యాక్ స్టేజి ఫోటో విడుదలైతే గానీ తెలియలేదు. ప్రస్తుతం అతడు తన ప్రైవేట్ పార్ట్‌ని ఒక క్లాత్‌తో కవర్ చేసిన ఫొటో ఇప్పుడు వైరల్‌గా మారుతుంది. ఈ ఫోటో చూసిన నెటిజన్లు రక రకాలుగా కామెంట్లు చేస్తున్నారు. జాన్ సీనా అందర్నీ ఫూల్స్ చేశాడని కామెంట్లు చేస్తున్నారు.

Tags

Related News

Alekhya sisters: ఇదేంట్రా బాబూ.. కుక్కలకు, నక్కలకు జీవితం అంకితం అంటోంది?

Movie Tickets : బుక్ మై షోలో లేని టికెట్స్ డిస్ట్రిక్ట్ యాప్‌లో ఎలా వస్తున్నాయి ?

Save the Tigers 3 : ‘సేవ్ ది టైగర్స్’ మళ్లీ వచ్చేస్తుంది.. ఎమ్మెల్యే గా ఘంటా రవి..

BIG TV Kissik talk Show: ఆ డైరెక్టర్ వల్లే నా కెరీర్ మొత్తం నాశనం.. మండిపడ్డ నటి రాశి

BIG TV Kissik talk Show : పదేళ్లుగా పిల్లలు పుట్టలేదు, చివరికి నా ప్రాణాలు ఫణంగా పెట్టి.. రాశి భావోద్వేగం

Sydney Sweeney: సిడ్నీ స్వీని బాలీవుడ్ ఎంట్రీ.. ఏకంగా రూ.530 కోట్లు ఆఫర్.. కళ్లు తేలేసిన నటి!

BIG TV Kissik talk Show : అతడితో పెళ్లి.. ఇంట్లో చాలా పెద్ద గొడవలు అయ్యాయి – కిస్సిక్ టాక్‌లో రాశి కామెంట్స్

Priyanka Jain: ప్రియాంకకు హ్యాండిచ్చి.. శోభశెట్టితో పులిహోర కలిపిన శివ్, అడ్డంగా బుక్కయ్యాడుగా!

Big Stories

×