Big Stories

Rahul Gandhi: బీజేపీ మిమ్మల్ని ఎదగనివ్వదు: రాహుల్

Rahul Gandhi Comments: రాజ్యాంగంతోపాటు పేదలు, గిరిజనులు, బీసీలను రక్షించేందుకు ప్రాణత్యాగాలకు కూడా సిద్ధం అంటూ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. ఝార్ఖండ్ లోని గుమ్లా, చాయిబాసాలలో నిర్వహించిన ప్రచార సభలలో పాల్గొన్న ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. బీజేపీపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.

- Advertisement -

పార్లమెంటు ఎన్నికల్లో ఇండియా కూటమి అధికారంలోకి వస్తే జీఎస్టీని సవరిస్తామన్నారు. అదేవిధంగా అగ్నివీర్ పథకాన్ని రద్ధు చేస్తామంటూ ఆయన ప్రకటించారు. ప్రధాని మోదీ కొద్దిమంది కోటీశ్వరుల కోసమే పని చేస్తున్నారని.. కానీ, ఇండియా కూటమి అధికారంలోకి వస్తే కోట్లాదిమంది పేదలను లక్షాదికారులను చేస్తుందని రాహుల్ అన్నారు.

- Advertisement -

గిరిజనులను బీజేపీ ఎదగనివ్వదన్నారు. అడవులు, జలాలు, భూములను పారిశ్రామిక వేత్తలకు ధారాదత్తం చేసేందుకు ప్రధాని ప్రయత్నిస్తున్నారన్నారు. గిరిజనులను ఇండ్లల్లో పనివారి పాత్రకు మాత్రమే గిరిజనుల్ని పరిమితం చేయాలని బీజేపీ చూస్తుందన్నారు. దేశంలో ఉన్న గిరిజన ఐఏఎస్ అధికారి పట్ల బీజేపీ ప్రభుత్వం చిన్నచూపు చూస్తోందని.. ఉన్నఒకే ఒక ఐఏఎస్ అధికారిని అప్రాధాన్యత పోస్ట్ ఇచ్చారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధాని మోదీ అంబానీ, అదానీల కోసమే పనిచేస్తున్నారన్నారు.

అదేవిధంగా తెలంగాణలో పలుమార్లు పర్యటించి ఎన్నికల సభలలో ప్రసంగించిన రాహుల్ గాంధీ.. ప్రధాని మోదీ, బీజేపీ నేతలు తీవ్ర స్థాయిలో మండిపడిన విషయం విధితమే. రిజర్వేషన్లు తీసేస్తామని, రాజ్యాంగాన్ని రద్దు చేస్తామని బీజేపీ నేతలే అంటున్నారని, బీజేపీ నేతల ఆటలు ఎట్టి పరిస్థితుల్లో సాగనివ్వబోమన్నారు. పార్లమెంటు ఎన్నికల్లో ఇండియా కూటమి అధికారంలోకి వస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.

అదేవిధంగా ఇటు గుజరాత్ లో పర్యటించి పలు సభలలో పాల్గొన్న ప్రియాంకాగాంధీ కూడా మోదీకి కౌంటర్ ఇచ్చిన విషయం తెలిసిందే. రాహుల్ గాంధీని ప్రధాని మోదీ యువరాజు అంటూ ఎద్దేవా చేస్తున్నారని.. రాహుల్ గాంధీ జనం కోసం పాదయాత్రలు చేస్తూ ప్రజల సమస్యల పరిష్కారం కోసం పనిచేస్తున్నారని.. కానీ, మోదీ మాత్రం కోట నుంచి బయటకు రావట్లేదు.. ప్రజల సమస్యలు పట్టించుకోవట్లేదు.. వీటిని బట్టి చూస్తేనే ప్రజలకు అర్థమైపోతుంది ఎవరు రాజు.. ఎవరు ప్రజా నాయకుడు అనేది అని ఆమె పేర్కొన్న విషయం తెలిసిందే. అంతేకాదు.. ప్రధాని ఏనాడు కూడా పేద ప్రజల కోసం ఆలోచించరని.. కోటీశ్వరుల కోసం తాపత్రయపడుతుంటారని ఆమె పేర్కొన్న విషయం విధితమే.

ఇండియా కూటమి నేతలు కూడా మాట్లాడుతూ.. తమ పదేళ్ల కాలంలో ఏం చేశారు.. జరిగిన అభివృద్ధిపైన ప్రజలకు తెలియజేయాలి తప్ప రెచ్చగొట్టే విధంగా మోదీ ప్రధాని, బీజేపీ నేతలు మాట్లాడుతున్నారంటూ కూటమి నేతలు పేర్కొన్న విషయం తెలిసిందే. బీజేపీ అధికారంలో ఉన్న పదేళ్లలో దేశంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని వారు పేర్కొన్న విషయం విధితమే.

Also Read: ఇందుకోసమేనా తన మేనల్లుడిని మాయావతి ఆ పదవి నుంచి తొలిగించింది?

ఇదిలా ఉంటే… ఇండియా కూటమి నేతల వ్యాఖ్యలను ప్రధాని మోదీ, కేంద్రమంత్రి అమిత్ తోపాటు బీజేపీ నేతలు ఖండిస్తున్న విషయం తెలిసిందే. ఇండియా కూటమి నేతలు కావాలనే తప్పుడు ప్రచారం చేస్తున్నారని, బీజేపీ మూడోసారి అధికారంలోకి రాబోతుందన్న ఉద్దేశంతోనే వారు అలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారన్నారు. ఎట్టి పరిస్థితుల్లో రిజర్వేషన్లను తొలగించం.. రాజ్యాంగం మార్చబోమంటూ పేర్కొన్న విషయం విధితమే. అదేవిధంగా ప్రధాని కూడా మాట్లాడుతూ.. రాజ్యాంగాన్ని రాసిన అంబేద్కర్ వచ్చి మార్చుమన్నా అది పాజిబుల్ కాదని చెప్పిన విషయం తెలిసిందే.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News