Big Stories

Mass Sick Leave : మూకుమ్మడి సెలవు.. 70కి పైగా ఎయిర్ ఇండియా విమానాలు క్యాన్సిల్

Over 70 Flights Cancelled due to Sick Leave : ఎయిర్ ఇండియా.. తమ సిబ్బంది మూకుమ్మడి సెలవులు పెట్టడంతో 70కి పైగా ఎక్స్ ప్రెస్ సర్వీసులను క్యాన్సిల్ చేసింది. చివరి క్షణంలో సిబ్బంది సిక్ అయ్యామంటూ మూకుమ్మడిగా లీవ్స్ తీసుకోవడంతో విమాన సర్వీసులను క్యాన్సిల్ చేయక తప్పలేదని తెలిపింది. మంగళవారం రాత్రి నుంచి బుధవారం ఉదయం వరకూ దాదాపు 78 విమానాలను రద్దు చేయాల్సి వచ్చిందని చెప్పింది. ఫలితంగా అప్పటికే ఎయిర్ పోర్టులకు చేరుకున్న ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు.

- Advertisement -

ఉద్యోగులంతా చివరిక్షణంలో విధులు హాజరు కాకపోవడంతో సర్వీసులను నిలిపివేయడం తప్ప మరో ప్రత్యామ్నాయం కనిపించలేదని చెప్పింది. సెలవు పెట్టిన ఉద్యోగులను సంప్రదించేందుకు ప్రయత్నించినా ఫలితం లేదని చెప్పింది. సిబ్బంది మూకుమ్మడి సెలవుల వెనుక ఉన్న కారణమేంటో తెలుసుకునేందుకు ఏవియేషన్ అథారిటీ విచారణ చేస్తుందని ఎయిర్ ఇండియా వెల్లడించింది. చివరి నిమిషంలో ఉద్యోగులంతా అస్వస్థతకు గురయ్యామని పేర్కొంటూ లీవ్ తీసుకున్నారని ఎయిర్ ఇండియా వివరించింది.

- Advertisement -

Also Read : ప్రయాణికులకు చుక్కలు చూపించిన ఇండిగో విమానం.. ఏమైందంటే..?

ఉద్యోగుల ఆకస్మిక సెలవుల కారణంగా.. విదేశాలకు వెళ్లాల్సిన విమానాలు కూడా ఆగిపోయినట్లు సమాచారం. విమానాల రద్దు కారణంగా ఇబ్బంది పడిన ప్రయాణికులకు వారి టికెట్ ధరను పూర్తిగా చెల్లించడమో లేదా.. వారు కోరితే మరొక తేదీకి ప్రయాణాన్ని రీ షెడ్యూల్ చేయడమో చేస్తామని తెలిపింది.

కాగా.. ఎయిర్ ఇండియా సంస్థ ఇటీవలే టాటా సంస్థ చేతిలోకి వెళ్లింది. కానీ.. ఉద్యోగులకు యాజమాన్యానికి మధ్య వివిధ అంశాలపై వివాదం జరుగుతున్నట్లు తెలుస్తోంది. లేఓవర్‌ల సమయంలో రూమ్ షేరింగ్‌ చేసుకోవాలని యాజమాన్యం చెప్పగా.. ఆ నిర్ణయంపై క్యాబిన్ సిబ్బంది ఆందోళన లేవనెత్తింది. దానితోపాటు ఇతర సమస్యలను కూడా వివరిస్తూ AIXEU కేంద్ర విమానయాన మంత్రి జ్యోతిరాదిత్య సింధియాకు లేఖ రాయగా.. నెలరోజుల తర్వాత యాజమాన్యానికి షోకాజు నోటీసు ఇచ్చింది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News