E-Paper
Advertisement

Karthika deepam: కార్తీకదీపంలో నటిస్తున్నందుకు నిరుపమ్ పరిటాల తీసుకునే రెమ్యునరేషన్ ఎంత?

Karthika deepam: కార్తీకదీపంలో నటిస్తున్నందుకు నిరుపమ్ పరిటాల తీసుకునే రెమ్యునరేషన్ ఎంత?
Advertisement

తెలుగు బుల్లితెరపై ఎక్కువ మంది ప్రేక్షకులకు ఇష్టమైన సీరియల్ కార్తీకదీపం. ఆ సీరియల్ తోనే టాప్ హీరోగా మారిపోయాడు నిరుపమ్ పరిటాల. ఇప్పుడు కార్తీకదీపం 2 లో కూడా అతడే హీరోగా నటిస్తున్నాడు. మహిళా ప్రేక్షకులకే కాదు కుటుంబం మొత్తానికి అతడు అభిమానం బుల్లితెర నాయకుడు. సీరియల్ కు వస్తున్న టిఆర్పి రేటింగ్ కూడా అధికంగానే ఉంటుంది. అయితే అందరికీ వచ్చే డౌట్ నిరూపమ్ పరిటాల ఒకరోజు సీరియల్ లో నటించినందుకు ఎంత తీసుకుంటాడు? అని. అందరికంటే ఎక్కువ శాలరీ తీసుకుని బుల్లితెర హీరో ఈయనే.

రోజుకు ఎంత?
బుల్లితెరలో పనిచేస్తున్న నటులకు ఎపిసోడ్ కు లేదా రోజువారీ షూటింగ్ ఆధారంగా పారితోషికం మాట్లాడుకుంటారు. నిరుపమ్ పరిటాల విషయానికి వస్తే అతడు ఒకరోజు షూటింగ్ కు గాను ముందుగానే పారితోషికం మాట్లాడుకున్నాడు. తెలిసిన సమాచారం ప్రకారం ఒకరోజు షూటింగ్ కు హాజరైతే అతడు తీసుకునేది 50వేల రూపాయలు. సాధారణ సీరియల్ నటులతో పోలిస్తే ఇది చాలా ఎక్కువ అని చెప్పుకోవాలి. డైలీ సీరియల్స్ లో పనిచేసే నటులకు ఇంత రెమ్యూనరేషన్ రావడం చాలా తక్కువ. కానీ కార్తీకదీపం సీరియల్, నిరుపమ్ పరిటాలకు ఉన్న క్రేజ్ వల్లే ఇంత రెమ్యురేషన్ ఇస్తున్నారు.

Advertisement

Also read: Chicken Pizza: చికెన్ కర్రీ మిగిలిపోయిందా? ఇలా చికెన్ పిజ్జా సులువుగా చేసేయండి

నెలకు పదిలక్షల జీతం
మిగతా బుల్లితెర హీరో, హీరోయిన్లకు రోజుకు పదివేల నుంచి 20 వేల రూపాయల మధ్య పారితోషకం ఉంటుంది. నిరుపమ్ పరిటాల నెలలో 20 రోజులు షూటింగ్ కి వెళ్లినా చాలు నెలకు పది లక్షల రూపాయలు జీతంగా అందుకుంటాడు. ఇతని కెరీర్ చూస్తే ఈ స్థాయికి రావడానికి ఎంతో కష్టపడ్డాడని అర్థమవుతుంది. మొదట చిన్న పాత్రలే చేసేవాడు. తర్వాత కార్తీకదీపం సీరియల్ ఆయనకు మంచి టర్నింగ్ పాయింట్ గా మారిపోయింది. ప్రేక్షకులు అతని పాత్రతో పూర్తిగా కనెక్ట్ అయిపోవడంతో గుర్తింపుతో పాటు ఆదాయము పెరిగింది. నిర్మాతలు కూడా ఆయనకు భారీ పారితోషకం ఇచ్చేందుకు ముందుకు వస్తున్నారు. అంతేకాదు సోషల్ మీడియాలో కూడా నిరూపం పరిటాల చాలా యాక్టివ్ గా ఉంటాడు. తన భార్య మంజులతో కలిసి యూట్యూబ్ ఛానల్ కూడా నడుపుతున్నాడు. ఆ ఛానల్ నుంచి కూడా భారీగానే డబ్బులు సంపాదిస్తున్నాడు. అలాగే మంచి క్రేజ్ ఉండడం వల్ల బ్రాండ్ ప్రమోషన్లు కూడా చేస్తున్నాడు. ఇవన్నీ కలుపుకుంటే ఆయన నెలకు సంపాదించేది ఇంకా అధికంగానే ఉంటుంది. బుల్లితెర హీరోల్లో ఎక్కువ సంపాదించే ధనిక హీరోగా నిరుపమ్ పరిటాలనే చెప్పుకోవాలి. ఇతనికి భార్య, ఒక కొడుకు ఉన్నారు.

Advertisement

Also read: Carrot Bobbatlu: క్యారెట్ హల్వా స్టఫ్ చేసిన బొబ్బట్లు రెసిపీ.. చూస్తేనే నోరూరిపోతుంది

Related News

కరువు పరిస్థితులపై సినీ ఇండస్ట్రీ సహకారం కోరిన సీఎం రేవంత్.. వెంటనే స్పందించిన నాగ్!

సాయికృష్ణ మిస్టరీ కేసు సంఘటన.. మళయాల క్రైం థ్రిల్లర్‌ మూవీలో ప్రధాన కథనం..! ఇన్విస్టిగేషన్‌ ఆఫీసర్‌ని బురిడీ కొట్టించే సీన్లు..!

వికెట్ పడిన ఆనందంలో జుట్టు పట్టుకున్నా, కానీ ఆ బౌలర్ విగ్గే ఊడిపోయింది

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Big Stories

Advertisement
×