E-Paper
Advertisement

Chicken Pizza: చికెన్ కర్రీ మిగిలిపోయిందా? ఇలా చికెన్ పిజ్జా సులువుగా చేసేయండి

Chicken Pizza: చికెన్ కర్రీ మిగిలిపోయిందా? ఇలా చికెన్ పిజ్జా సులువుగా చేసేయండి
Advertisement

ఇంట్లో చికెన్ కర్రీ వారానికి ఒక్కసారైనా కచ్చితంగా వండుతారు. అలాంటప్పుడు కూర మిగిలిపోతూ ఉంటుంది. అలా చికెన్ మిగిలిపోయినప్పుడు ఇండియన్ ఫ్లేవర్ తో ఇటాలియన్ స్టైల్ పిజ్జా చేసేయండి. ఇది పిల్లలకు పెద్దలకు ఎంతో నచ్చుతుంది. చాలా తక్కువ సమయంలోనే ఈ పిజ్జాను తయారు చేయవచ్చు.

చికెన్ పిజ్జా రెసిపీకి కావలసిన పదార్థాలు
చికెన్ కర్రీలోని పీసెస్ – ఒక కప్పు
పిజ్జా బేస్ – ఒకటి
పిజ్జా సాస్ – రెండు స్పూన్లు
మోజరెల్లా చీజ్ తురుము – ఒక కప్పు
ఉల్లిపాయ – ఒకటి
టమోటా – ఒకటి
ఒరిగానో – ఒక స్పూను
చిల్లీ ఫ్లేక్స్ – అర స్పూను
మిరియాల పొడి – చిటికెడు
ఉప్పు – రుచికి సరిపడా
కొత్తిమీర తరుగు – రెండు స్పూన్లు

Advertisement

Also read: Spinach Fry: పాలకూర నువ్వుల వేపుడు రెసిపీ, తింటే ఎంతో ఆరోగ్యం పైగా రుచికి రుచి

చికెన్ పిజ్జా రెసిపీ
1. మిగిలిన చికెన్ కర్రీ లోంచి ముక్కలను వేరు చేయండి. ఆ ముక్కలను చిన్నగా తురుముకోండి.
2. ఇప్పుడు ఒక పిజ్జా బేస్ తీసుకొని ఆ పిజ్జా బేస్ పై పిజ్జా సాస్ ను సమానంగా రాయండి.
3. సాస్ మీద కొద్దిగా మిరియాల పొడి చల్లండి. అలాగే చిటికెడు ఉప్పును కూడా చల్లండి.
4. ఇప్పుడు పిజ్జా బేస్ పై సన్నగా తరిగిన ఉల్లిపాయలు, టమోటా ముక్కలు చల్లండి.
5. ఇప్పుడు కోసి పెట్టుకున్న చికెన్ ముక్కలను కూడా సమానంగా సర్దండి. కావాలంటే గ్రేవీ ని కూడా అక్కడక్కడ చల్లవచ్చు.
6. ఇప్పుడు తురిమిన మోజరెల్లా చీజ్ ను పైన పూర్తిగా చల్లండి.
7. చికెన్ మొత్తం కనిపించకుండా ఉండేలా చీజ్ జల్లేయాలి.
8. ఇప్పుడు ఆ చీజ్ మీద ఒరిగానో, చిల్లీ ఫ్లాక్స్ చల్లండి. ఇప్పుడు పిజ్జాను ఓవెన్లో పెట్టి బేక్ చేయండి.
9. ఓవెన్ ను 180 డిగ్రీల వద్ద ఉంచి పావుగంట సేపు బేక్ చేస్తే సరిపోతుంది. చీజ్ పూర్తిగా కరిగి బేస్ క్రిస్పీగా మారుతుంది.
10. ఓవెన్ లేకపోతే మీరు నాన్ స్టిక్ పాన్ పై కూడా దీన్ని తయారు చేయవచ్చు.
11. నాన్ స్టిక్ పాన్ కాస్త వేడెక్కాక పిజ్జా అని పెట్టి పైన మూత పెట్టేయాలి.
12. ఒక పావుగంట పాటు అలా వదిలేస్తే పిజ్జా రెడీ అయిపోతుంది

Advertisement

Also read: Hyderabad Crime: ఆఫీస్ ట్రిప్‌లో అరాచకం.. ఆపై వేధింపులు.. మహిళా ఉద్యోగి ఫిర్యాదుతో హెచ్ఆర్ అరెస్ట్

ఈ చికెన్ పిజ్జా వేడివేడిగా తింటే ఎంతో రుచిగా ఉంటుంది. ఒక్కసారి ఇక్కడ మేము చెప్పిన పద్ధతిలో వండి చూడండి ఇది మీకు కచ్చితంగా నచ్చుతుంది.

Related News

కొబ్బరి మసాలాతో కోస్తా స్టైల్ ఎండుచేపల పులుసు.. ఒక్కసారి తింటే లైఫ్‌లో టేస్ట్ మర్చిపోరు!

పిల్లలు ఇష్టంగా తినే ఈజీ బ్రేక్‌ఫాస్ట్.. బియ్యం లేకుండానే కరకరలాడే సాఫ్ట్ దోశ!

టేస్ట్ అట్లాస్ టాప్ లిస్ట్‌లో ఇండియన్ ఐస్‌క్రీమ్స్.. వీటిని హైదరాబాద్‌లోనే తినేయొచ్చని మీకు తెలుసా?

సమ్మర్ స్పెషల్.. శరీరానికి చలువ చేసే బెస్ట్ రైస్ డిషెస్ ఇవే!

తక్కువ వంట గ్యాస్‌తో రుచికరమైన భోజనం.. ఈ 7 వంటకాలను ట్రై చేయండి!

క్విక్ అండ్ ఈజీ.. 10 నిమిషాల్లో సిద్ధమయ్యే 7 సమ్మర్ నో-కుక్ మీల్స్

బెంగాల్ స్పెషల్.. జాల్ముడిని ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు, జస్ట్ ఇవి ఉంటే చాలు!

ఒక్కసారి ఇలా సాంబార్ ట్రై చేసి చూడండి.. మళ్లీ మళ్లీ ఇదే కావాలంటారు!

Big Stories

Advertisement
×