BigTV English

Animal Fame Siddhant Karnick: ‘త్రిప్తితో డేటింగ్ చేయాలని ఉంది’.. యానిమల్ ఫేమ్ సిద్ధాంత్ కర్ణిక్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!

Animal Fame Siddhant Karnick: ‘త్రిప్తితో డేటింగ్ చేయాలని ఉంది’.. యానిమల్ ఫేమ్ సిద్ధాంత్ కర్ణిక్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!
Animal Movie Fame
Animal Movie Fame

Animal Movie Fame Siddhant Karnick Ready to Date with Tripti Dimri: తెలుగులో అర్జున్ రెడ్డి, హిందీలో కబీర్ సింగ్ సినిమాలతో డైరెక్టర్ సందీప్ వంగ స్టార్ డైరెక్టర్ గా పేరు సంపాదించుకున్నారు. ఆయన తీసిన ఈ రెండు సినిమాల తర్వాత ఇటీవల వచ్చిన యానిమల్ సినిమాతో ప్రపంచవ్యాప్తంగా భారీ హిట్ కొట్టి మరో మెట్టు ఎక్కేశారు. రిలీజ్ అయిన మొదటి రోజు నుంచే హిట్ టాక్ ఉన్న యానిమల్ సినిమా బాక్సాఫీస్ రికార్డులు బద్దలు కొట్టింది.


తెలుగు డైరెక్టర్ సందీప్ వంగ దర్శకత్వంలో తెరకెక్కిన యానిమల్ సినిమాలో బాలీవుడ్ హీరో రణ్ బీర్ కపూర్, టాలీవుడ్ హీరోయిన్ రష్మిక మందన్నాలు జోడిగా నటించారు. అంతేకాదు ఇందులో రణ్ బీర్ కపూర్ తండ్రిగా అనిల్ కపూర్, విలన్ పాత్రలో బాబీ డియోల్, మిగిలిన ముఖ్య పాత్రదారులు సిద్ధాంత్ కర్ణిక్, త్రిప్తి డిమ్రి నటించిన విషయం తెలిసిందే. అయితే ఈ సినిమాలో చూపించిన యాక్షన్ సీన్లకు దేశ వ్యాప్తంగా విమర్శలు కూడా వచ్చాయి. ఎంత నెగిటివిటీ వచ్చినా కూడా సినిమా మాత్రం కలెక్షన్లలో దూసుకుపోయింది.

ఒక్క సినిమాతో బాలీవుడ్ నటి త్రిప్తి డిమ్రి తెలుగు కుర్రాళ్ల గుండెలను కొట్టగొట్టారు. యానిమల్ లో హీరోయిన్ రష్మిక కంటే సినిమాలో జోయా పాత్రలో రణ్‌బీర్‌తో రొమాన్స్ చేసిన త్రిప్తి డిమ్రి గ్లామర్ కు సినిమా ప్రియులు ఫిదా అయిపోయారు. ఈ క్రమంలోనే తాజాగా యానిమల్ నటుడు కూడా త్రిప్తిపై మనసు పారేసుకున్నాడు.


Also Read:Krishna Vamsi: నేను చేసిన అతి పెద్ద తప్పు అదే.. ఇప్పటికీ బాధపడుతున్నాను

యానిమల్ సినిమాలో వరుణ్ ప్రతాప్ (రణ్ బీర్ కపూర్) బావగా నటించిన ప్రతాప్ మల్హోత్రా (సిద్ధాంత్ కర్ణిక్) త్రిప్తిపై మనసు పారేసుకున్నట్లు తెలిపారు. ఈ మేరకు తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆయన ఈ కామెంట్స్ చేశారు. త్రిప్తితో డేటింగ్ చేయాలని ఉందని నిర్మోహమాటంగా తెలిపారు. అంతేకాదు దీనిపై కామెంట్స్ చేయొద్దని అన్నారు. సిద్ధాంత్ మాట్లాడుతూ..‘ నా అభిప్రాయాన్ని బహిరంగంగానే చెబుతున్నాను. నాకు త్రిప్తితో డేటింగ్ చేయాలని ఉంది. దానికి కారణం కూడా ఉంది. త్రిప్తిని కాఫీకి బయటకు తీసుకెళ్లి.. తన కోసం నేనే హ్యాపీగా బిల్ పే చేస్తారు. రీల్ లైఫ్ నుంచి రియల్ లైఫ్ ను వేరుగా చూడాల్సి ఉంది. నా మాటలను వివాదం చేయోద్దు’ అని సిద్ధాంత్ కామెంట్స్ చేశారు.

Related News

Dharsha Guptha: ఇంస్టాగ్రామ్ ద్వారా నెలకు లక్షల్లో ఆదాయం..ఈ ముద్దుగుమ్మ పనే బాగుందే!

Vithika sheru: మట్టి వినాయకుడిని చేసిన హీరోయిన్.. వామ్మో ఈ టాలెంట్ కూడా ఉందా?

Dethadi Alekhya Harika: మన క్యారెక్టర్ ని డిసైడ్ చేసేది అదే.. బుల్లి కథతో హారిక పోస్ట్!

Big TV kissik talks : స్టేజ్ పై అమ్మాయిలతో పండు అలా.. అడ్డంగా పరువుతీసేసిన వర్ష…

Big TV kissik talks : శేఖర్ మాస్టర్ అలాంటి వాడే.. షాకింగ్ విషయాలను బయట పెట్టిన పండు..!

The Big Folk Night 2025 : జానపదంతో దద్దరిల్లిన ఎల్బీ స్టేడియం.. ఘనంగా బిగ్ టీవీ ఫోక్ నైట్

Big Stories

×