BigTV English

Indian Student dies at London: భర్తకు కొద్దిదూరంలో.. లండన్‌లో భారతీయురాలు మృతి!

Indian Student dies at London: భర్తకు కొద్దిదూరంలో.. లండన్‌లో భారతీయురాలు మృతి!
India PhD student dies after being run over by truck in London
India PhD student dies after being run over by truck in London

Indian Student dies at London: లండన్‌లో దారుణమైన యాక్సిడెంట్ చోటు చేసుకుంది. ఈ ఘటనలో భారత్‌కు చెందిన చేష్టా‌కొచ్చర్ మృతి చెందారు. మార్చి 19న సైకిల్ తొక్కుతూ సెంట్రల్ లండన్ నుంచి ఇంటికి వస్తుండగా మధ్యలో ఓ ట్రక్కు ఢీ కొట్టింది. తీవ్రగాయాలపాలైన చేష్టా అక్కడికక్కడే చనిపోయారు. ప్రమాదానికి కూతవేటు దూరంలో చేష్టా భర్త ప్రశాంత్ ఉన్నారు. వెంటనే వచ్చి ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేసినప్పటికీ ఫలితం లేకపోయింది.


చేష్టాకొచ్చర్ సొంతూరు హర్యానాలోని గురుగ్రామ్. సెప్టెంబర్‌‌‌లో పీహెచ్‌డీ కోసం లండన్‌కు వెళ్లారు. లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్‌లో ప్రస్తుతం పీహెచ్‌డీ చేస్తున్నారు. గతంలో ఆమె ఢిల్లీ యూనివర్సిటీ, అశోక యూనివర్సిటీ, పెన్సిల్వేనియా, షికాగో యూనివర్సిటీలో చదువుకున్నారు. 2021 నుంచి 23 మధ్యకాలం నీతి అయోగ్‌లోని నేషనల్ బహేవియరల్ ఇన్‌సైట్స్ యూనిట్‌లో సలహాదారుగా పని చేసిన అనుభవం ఆమె సొంతం.

చేష్టా‌కొచ్చర్ మృతిపై ఆమె తండ్రి రిటైర్డ్ లెఫ్ట్‌నెంట్ జనరల్ ఎస్పీ కొచ్చర్ సోషల్ మీడియా వేదికగా ఈ విషయాన్ని వెల్లడించారు. ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదం చేష్టా కుటుంబసభ్యుల్లో విషాదం నింపిందని రాసుకొచ్చారు. ఇలా చాలా బాధాకరమని, ప్రస్తుతం తానింకా లండన్‌లో ఉన్నానని తెలిపారు.


Also Read: Gaza Updates: రంజాన్ వేళ ఐరాస భద్రత మండలి తీర్మానం.. గాజాలో కాల్పుల విరమణకు ఆదేశం

మరోవైపు చేష్టా మృతిపై నీతి ఆయోగ్ మాజీ సీఈఓ అమితాబ్‌కాంత్ స్పందించారు. ఆమె మృతికి సంతాపం వ్యక్తం చేస్తూనే.. ఆమె ఎంటో దైర్యవంతురాలని నాతో కలిసి చేశారని చెప్పుకొచ్చారు. ఇంత త్వరగా ఆమె మన నుంచి దూరంకావడం బాధాకరమన్నారు.

Tags

Related News

California: చెట్టును తాకి లైవ్‌లో కుప్పకూలిన హెలికాప్టర్

Americal News: అమెరికాలో మళ్లీ.. ఓ పాఠశాల కాల్పుల కలకలం, ఆరుగురు మృతి

Japan Flu Outbreak: జపాన్ లో విజృంభిస్తోన్న ఫ్లూ మహమ్మారి.. 4 వేలకు పైగా కేసులు, స్కూళ్లు మూసివేత

Australia Plane Crash: ఆస్ట్రేలియాలో రన్ వే పై కుప్పకూలిన విమానం.. ముగ్గురు మృతి

US Tariffs on China: మరో బాంబు పేల్చిన ట్రంప్.. చైనాపై 100 శాతం సుంకాల ప్రకటన

America: అమెరికాలో ఘోర ప్రమాదం.. 19 మంది మృతి!

Nobel Peace Prize 2025: నోబెల్ శాంతి బహుమతి ట్రంప్ నకు అంకితం.. మరియా కొరీనా కీలక ప్రకటన

Worlds Largest Cargo Plane: శంషాబాద్‌లో ప్రపంచంలోనే.. అతిపెద్ద కార్గో విమానం

Big Stories

×