BigTV English

Krishna Vamsi Tweet Got Viral: నేను చేసిన అతి పెద్ద తప్పు అదే.. ఇప్పటికీ బాధపడుతున్నాను: క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ

Krishna Vamsi Tweet Got Viral: నేను చేసిన అతి పెద్ద తప్పు అదే.. ఇప్పటికీ బాధపడుతున్నాను: క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ

Krishna Vamsi Tweet on Sri Anjaneyam Movie: ఇప్పుడంటే హనుమాన్ గురించి గొప్పగా మాట్లాడుకుంటున్నాం కానీ, ఇదే సినిమాను కృష్ణవంశీ ఎప్పుడో శ్రీ ఆంజనేయం పేరుతో తీశాడు. కాకపోతే అది హిట్ కాకపోవడంతో దాని గురించి ఎవరు మాట్లాడుకోవడం లేదు. క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ తీసిన అద్భుతాల్లో శ్రీ ఆంజనేయం ఒకటి. నితిన్, ఛార్మీ జంటగా నటించిన ఈ చిత్రంలో అర్జున్ సర్జా హనుమంతుడిగా కనిపించాడు. ఈ సినిమా ప్రేక్షకులకు బాగా నచ్చింది కానీ, చిన్న చిన్న లోపల వలన ఇప్పటికీ కృష్ణవంశీని తిట్టేవారు లేకపోలేదు. ఇక అందులో బిగ్గెస్ట్ మిస్టేక్ అంటే ఛార్మీ అనే చెప్పాలి. ఒక భక్తి సినిమాలో రొమాన్స్ ఒక మోతాదు వరకు ఉంటే ఓకే. కానీ, ఈ చిత్రంలో మోతాదును మించి పెట్టారు.


ముఖ్యంగా పూల ఘుమఘుమ సాంగ్ అయితే వరస్ట్ అనే చెప్పాలి. ఛార్మీ మితిమీరిన అందాలు చూపించడం, ఎక్స్ ప్రెషన్స్.. నితిన్ తో రొమాన్స్ మరీ దారుణంగా చూపించారు. శ్రీ ఆంజనేయం అనే పేరు ఉండడంతో.. అప్పట్లో జనాలు అందరూ ఈ సినిమా భక్తికి సంబంధించిందేమో అనుకోని థియేటర్ కు కుటుంబాలతో సహా వెళితే.. ఛార్మీ సాంగ్ చూసి కంగుతిన్నారు. ఇదేం సినిమారా బాబు.. హనుమంతున్నీ చూద్దామని వస్తే.. ఈ చెండాలం ఏంటి అనుకున్నవారు కూడా లేకపోలేదు. అలా  శ్రీ ఆంజనేయం ప్లాప్ అవ్వడానికి పెద్ద కారణం ఛార్మీ అని చెప్పాలి. ఈ విషయాన్ని కృష్ణవంశీ సైతం ఒప్పుకున్నాడు.

Also Read: Comedian Seshu Passed Away: బ్రేకింగ్.. ఇండస్ట్రీలో విషాదం.. ప్రముఖ కమెడియన్ శేషు మృతి


ఇక ఈ మధ్యకాలంలో ఈ డైరెక్టర్.. సోషల్ మీడియాలో అభిమానులకు దగ్గరగానే ఉంటున్నాడు. అభిమానులు అడిగిన ప్రశ్నలకు  ఓపిగ్గా సమాధానాలు ఇస్తూనే ఉన్నాడు. ఇక తాజాగా కృష్ణవంశీకి శ్రీ ఆంజనేయం సినిమాపై ఒక ప్రశ్న ఎదురయ్యింది. ” నాకు ఇప్పటికీ అర్ధం కావడం లేదు సర్.. శ్రీ ఆంజనేయం సినిమాలో పూల ఘుమగుమ సాంగ్ కావాలనే పెట్టారా.. ?సినిమా చాలా బావుంటుంది. మొత్తం కథ అంత అద్భుతం.. ఆ ఒక్క సాంగ్ చాలా డిస్టర్బ్ చేస్తుంది” అని రాసుకొచ్చాడు. ఇక దీనికి సమాధానంగా కృషవంశీ.. ” నేను చేసిన పెద్ద తప్పుడు అదే సర్.. దానికి మొత్తం కారణం నేనే.. ఇప్పటికీ నేను బాధపడుతున్నాను.. క్షమించండి” అంటూ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరల్ గా మారింది. ఇకపోతే ప్రస్తుతం సినిమాలకు కొద్దిగా గ్యాప్  ఇచ్చిన కృష్ణవంశీ.. త్వరలోనే మళ్లీ కమ్ బ్యాక్ గట్టిగా ఇవ్వాలని అభిమానులు కోరుకుంటున్నారు.

Related News

Free Pickle Offer: ఈ ఛాలెంజ్ క్లియర్ చేస్తే పికిల్ ప్యాకెట్ ఫ్రీ… పచ్చళ్ళ అక్క బంపర్ ఆఫర్?

Deepthi Sunaina: బిజినెస్ రంగంలోకి అడుగుపెట్టిన షణ్ముఖ్ మాజీ లవర్.. సక్సెస్ రేటెంత?

YouTuber Armaan Malik: ఇద్దరు భార్యలు.. నలుగురు పిల్లలు.. ఆ యూట్యూబర్‌కు కోర్టు నోటీసులు

Kissik talks show : యాంకర్ సౌమ్య జీవితంలో అన్నీ కష్టాలే.. ఆ హీరో టార్చర్ తో కన్నీళ్లు..

Big TV Kissik Talks : ఇండస్ట్రీలో హార్డ్ వర్క్ పనికిరాదు, చాలామంది ఆ పని చేసి వచ్చారు

Big TV Kissik Talks : ఆ హీరోయిన్ కారుతో గుద్దింది, నేను చాలా పోగొట్టుకున్నాను 

Big Stories

×