BigTV English

Allu Arjun : అల్లు అర్జున్ కు జన్మలో తీరని కోరిక.. కన్నీళ్లు పెట్టుకున్న ఫ్యాన్స్..!

Allu Arjun : అల్లు అర్జున్ కు జన్మలో తీరని కోరిక.. కన్నీళ్లు పెట్టుకున్న ఫ్యాన్స్..!

Allu Arjun : ఐకాన్ స్టార్ హీరో అల్లు అర్జున్ ఫ్యాన్ ఫాలోయింగ్ సినిమాల గురించి ఎంత చెప్పినా తక్కువే. అలా వైకుంఠపురంలో తర్వాత పుష్ప సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. నేషనల్ వైడ్ గా రిలీజ్ అయిన ఈ మూవీ బ్లాక్ బాస్టర్ హిట్ టాక్ ను సొంతం చేసుకోవడంతో బన్నీ ఐకాన్ స్టార్ అయ్యాడు. ఇక ఈ సినిమాకు సీక్వెల్ పుష్ప 2 సినిమాతో ప్రేక్షకులను పలకరించేందుకు రెడీ అవుతున్నాడు. ఆ సినిమా డిసెంబర్ 5 న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల కాబోతుంది. ప్రస్తుతం అల్లు అర్జున్, రష్మిక మందన్న ఈ సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారు. రీసెంట్ గా ఈ సినిమా నుంచి విడుదలైన కిస్సిక్ ఐటమ్ సాంగ్ యూట్యూబ్ లో ట్రెండ్ అవుతుంది. ఇలాంటి టైమ్ లో అల్లు అర్జున్ గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.. అల్లు అర్జున్ కు తీరని కోరిక ఒకటి ఉందట అదేంటో తెలుసుకుందాం..


ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వడానికి బ్యాగ్రౌండ్ ఉంటే సరిపోదు.. టాలెంట్ కూడా ఉండాలి. అల్లు అర్జున్ సినీ బ్యాగ్రౌండ్ గురించి తెలిసిందే. ఆయన టాలెంట్ గురించి కూడా అందరికి తెలుసు. తన నటన, డ్యాన్స్ తో అభిమానుల మనసు దోచుకున్నాడు. ఒక్కో సినిమాతో తన సత్తాను నిరూపించుకుంటూ ఇప్పుడు ఐకాన్ స్టార్ అయ్యాడు. పుష్ప సినిమా ద్వారా పాన్ ఇండియా స్థాయిలో ఎంతటి గుర్తింపు సాధించారో మనందరికీ తెలుసు. ప్రస్తుతం దానికి సీక్వెల్ గా పుష్ప2 రాబోతోంది. ఈ సినిమా కోసం దేశవ్యాప్తంగా ఫ్యాన్స్ వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నారు. ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా బన్నీ పలు ఇంటర్వ్యూలకు హాజరు అవుతున్నారు. తాజాగా ఈయన ఆహా లోని సక్సెస్ ఫుల్ టాక్ షో ‘అన్ స్టాపబుల్ విత్ ఎన్బీకే ‘ షోకు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు..

అల్లు అర్జున్ ఎపిసోడ్ లను రెండు పార్టులుగా స్ట్రీమింగ్ చేస్తున్నారు. ఇప్పటికే ఒక ఎపిసోడ్ స్ట్రీమింగ్ అయి ఓటీటీలో మంచి వ్యూస్ తో దూసుకుపోతోంది. అయితే ఈ షోలో బాలకృష్ణ అల్లు అర్జున్ ను ఒక క్యూస్షన్ అడిగారు. జీవితంలో తీరని కోరిక ఏదైనా ఉందా అని అడిగాగానే అల్లు అర్జున్ టక్కున ఒక కోరిక ఉంది, అది ఇక తీరనిది అంటూ కాస్త ఎమోషనల్ అయ్యారు. ఆ కోరిక ఏంటయ్యా అంటే వారికి సినీ లైఫ్ అందించినటువంటి తన తాత అల్లు రామలింగయ్యతో స్క్రీన్ షేర్ చేసుకోవాలనే కోరిక అలానే మిగిలిపోయిందని చెప్పాడు. గంగోత్రి తర్వాత సినిమా చెయ్యాలని అనుకున్నా అది తీరలేదట.. ఆ తర్వాత ఆ ఛాన్స్ రాలేదని చెప్పి ఫీల్ అల్లు అర్జున్. ఆ వీడియో కాస్త వైరల్ అవ్వడంతో వీడియోను చూసిన బన్నీ ఫ్యాన్స్ తెగ ఫీల్ అవుతున్నారు. మీరు గొప్ప స్థానంలో ఉంటే ఆయన ఆత్మ శాంతిస్తుంది అని కామెంట్స్ చేస్తున్నారు. మొత్తానికి ఈ వీడియో మరోసారి వైరల్ గా మారింది.


Tags

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×