E-Paper
Advertisement

Bujji Thalli song : బుజ్జి తల్లి సైలెంట్ గా సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది

Bujji Thalli song : బుజ్జి తల్లి సైలెంట్ గా సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది
Advertisement

Bujji Thalli song: నాగచైతన్య కెరియర్ లో అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న సినిమా తండేల్. ఈ సినిమాకు చందు మొండేటి దర్శకత్వం వహిస్తున్నాడు. కార్తికేయ సినిమాతో తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి దర్శకుడుగా ఎంట్రీ ఇచ్చిన చందు, కార్తికేయ 2 సినిమాతో పాన్ ఇండియా డైరెక్టర్ అయిపోయాడు. ఇప్పుడు నాగచైతన్య హీరోగా మరో పాన్ ఇండియా సినిమాను సిద్ధం చేస్తున్నాడు. ఈ సినిమాను బన్నీ వాసు నిర్మిస్తున్నారు. గీత ఆర్ట్స్ బ్యానర్ పై ఈ సినిమాను అల్లు అరవింద్ ప్రజెంట్ చేస్తున్నారు. ఈ సినిమాకి దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా నుంచి ఐదు రోజుల క్రితం బుజ్జి తల్లి అని ఒక పాటను రిలీజ్ చేశారు. ఈ పాట ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటుంది.

ఈ సినిమాను ఒక యదార్థ సంఘటనను ఆధారంగా చేసుకుని తీస్తున్నట్లు తెలుస్తోంది. ఇదివరకే ఈ సినిమా నుంచి రిలీజ్ అయినా టీజర్ కూడా మంచి అంచనాలను పెంచింది. ముఖ్యంగా ఈ టీజర్ లో ఎమోషన్స్ బాగా బాగా వర్కౌట్ అయ్యాయి. ఇదివరకే సాయి పల్లవి, నాగచైతన్య జంటగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన సినిమా లవ్ స్టోరీ. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతమైన ఘనవిజయం సాధించింది. ఈ సినిమాకు మంచి ప్రశంసలతో పాటు కలెక్షన్స్ కూడా వచ్చాయి. మళ్లీ వీరిద్దరూ కలిసి ఈ సినిమాలో కనిపిస్తుండడంతో చాలామందికి ఈ సినిమా మీద క్యూరియాసిటీ మరింత ఎక్కువైంది. ఈ సినిమా ఉత్తరాంధ్ర బ్యాక్ డ్రాప్ జరుగుతుంది. ఈ సినిమాలో నాగచైతన్య ఉత్తరాంధ్ర యాసను మాట్లాడబోతున్నాడు. చైతు మొదటిసారి ఇటువంటి క్యారెక్టర్ లో కనిపించబోతున్నాడు. ఈ సినిమా వర్కౌట్ అయితే చైతు కెరీర్ కి బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ అవుతుంది.

Advertisement

ఒక సినిమాకి సంగీతం అనేది ఎంత పెద్ద ప్లస్ అవుతుంది అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ఈ సినిమాకి సంబంధించి బుజ్జి తల్లి అనే పాట ఒక స్లో పాయిజన్ లా ప్రేక్షకులకు ఎక్కుతుంది అని చెప్పాలి. దేవిశ్రీప్రసాద్ సంగీతం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మాస్ బీట్స్ ఎలా ఇస్తాడో, క్లాస్ వచ్చిన సాంగ్స్ ని కూడా అంతే అద్భుతంగా కంపోజింగ్ చేస్తాడు. దేవి శ్రీ ప్రసాద్ కెరియర్ లో ఎన్నో మెలోడీ సాంగ్స్ ఉన్నాయి. ఆ సాంగ్స్ లిస్టులోకి ఇప్పుడు ఈ సాంగ్ కూడా యాడ్ అవుతుంది. ఒకవైపు దేవిశ్రీ అందించిన పుష్ప మ్యూజిక్ సెన్సేషన్ క్రియేట్ చేస్తుంటే, ఈ బుజ్జి తల్లి పాట కూడా అలానే సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది. ఇప్పటికే 10 మిలియన్స్ పైగా వ్యూస్ ఈ పాటకు వచ్చాయి. అంతేకాకుండా ఇప్పటికీ యూట్యూబ్ ట్రెండ్ లో, ఇంస్టాగ్రామ్ రీల్స్ లో ఎక్కడబడితే అక్కడ దర్శనమిస్తున్నాయి. సినిమాను ఫిబ్రవరి 7వ తారీఖున రిలీజ్ చేయబోతున్నట్లు అధికారికంగా చిత్ర యూనిట్ ఇదివరకే ప్రకటించింది.

Also Read : Pradeep Machiraju : టైటిల్ పవన్ కళ్యాణ్ ది, లాంచింగ్ మహేష్ బాబు తో

Related News

కరువు పరిస్థితులపై సినీ ఇండస్ట్రీ సహకారం కోరిన సీఎం రేవంత్.. వెంటనే స్పందించిన నాగ్!

సాయికృష్ణ మిస్టరీ కేసు సంఘటన.. మళయాల క్రైం థ్రిల్లర్‌ మూవీలో ప్రధాన కథనం..! ఇన్విస్టిగేషన్‌ ఆఫీసర్‌ని బురిడీ కొట్టించే సీన్లు..!

వికెట్ పడిన ఆనందంలో జుట్టు పట్టుకున్నా, కానీ ఆ బౌలర్ విగ్గే ఊడిపోయింది

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Big Stories

Advertisement
×