Rakul Preet Singh : దక్షిణాది ప్రేక్షకులతో పాటు ఉత్తరాది ప్రేక్షకులను మెప్పించి నటిగా తనదైన స్థానాన్ని దక్కించుంది రకుల్ ప్రీత్ సింగ్. ప్రస్తుతానికైతే ఆమె వరుసగా బాలీవుడ్ సినిమాల్లోనే నటిస్తోంది. ఈమె 2011లో మిస్ ఇండియా పోటీల్లోనూ పాల్గొంది. ఆ సందర్భంలో ఆమెను అక్కడున్న జడ్జిలు వేసిన ప్రశ్న, దానికి ఆమె చెప్పిన సమాధానంకు సంబంధించిన వీడియో వైరల్ అవుతుంది. ఇంతకీ ఆమె సదరు వీడియో ఏం చెప్పిందనే వివరాల్లోకి వెళితే, ఒకవేళ మీకు పుట్టిన కొడుకు గే అని తెలిస్తే మీరేం చేస్తారు? అని ప్రశ్నిస్తే.. దానికి రకుల్ మాట్లాడుతూ నాకు ఎలాంటి సమస్యా లేదు. అయితే విషయం తెలియగానే షాకవుతాను. చెంప దెబ్బ కొడతాను. తర్వాత తన నిర్ణయాన్ని గౌరవిస్తాను. నాకు ముక్కు సూటిగా ఉండటం అంటే చాలా ఇష్టం అని తెలియజేసింది.
సినిమాలతో పాటు ఫిట్‌నెస్ విషయంలోనూ రకుల్ చాలా కేర్ ఫుల్‌గా ఉంటుంది. బాలీవుడ్ నటుడు, నిర్మాత అయిన జాకీ భగ్నానీతో రకుల్ ప్రీత్ ప్రస్తుతం ప్రేమలో ఉంది. త్వరలోనే వీరిద్దరూ పెళ్లి పీటలెక్కుతారనే వార్తలు నెట్టింట వినిపిస్తున్నాయి. కానీ ఇటు రకుల్, అటు జాకీ భగ్నాని పెళ్లి గురించి నోరు మెదపటం లేదు. రీసెంట్‌గానే ప్రేక్షకులను డాక్టర్ జీ అనే చిత్రం ద్వారా రకుల్ అలరించింది.