IFFI 2024 – Teja Sajja: చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరియర్ మొదలుపెట్టి ఆ తర్వాత పలు చిత్రాలతో ప్రేక్షకులను మెప్పించిన తేజా సజ్జ (Teja sajja) ‘హనుమాన్’ సినిమాతో ఓవర్ నైట్ స్టార్ గా మారిపోయారు. ప్రముఖ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ (Prashanth Varma)దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ఊహించని విజయాన్ని అందుకుంది. చిన్న సినిమాగా వచ్చి పాన్ ఇండియా లెవెల్లో మెప్పించింది. అంతేకాదు రూ.100 కోట్ల క్లబ్లో చేరి రికార్డు కూడా సృష్టించింది. ఇదిలా ఉండగా తాజాగా గోవాలో జరుగుతున్న ఫిలిం ఫెస్టివల్ లో తేజాకు ఊహించని ఘటన ఎదురయ్యింది. దీంతో ఆయన ఒక్కసారిగా ఆశ్చర్యంతో పాటు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మరి అసలు విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం.
సినిమాలోని క్యారెక్టర్లకు కనెక్ట్ అయిన ఆడియన్స్..
సాధారణంగా సినిమాలను ప్రేక్షకులు బాగా ఓన్ చేసుకుంటున్నారు. అంతేకాదు చాలా సందర్భాలలో స్టోరీకి కనెక్ట్ అయిపోయిన కొంతమంది బయట విచిత్రంగా ప్రవర్తిస్తున్నారు కూడా. గతంలో ‘మాతృదేవోభవ’ సినిమాలోని తనికెళ్ల భరణి (Tanikella bharani) విలన్ క్యారెక్టర్ కి బాగా కనెక్ట్ అయిన మహిళలు ఆయన బయట కనిపించేసరికి ఆయనే నిజమైన విలన్ అనుకొని, ఆయనను కొట్టబోయారు. అంతటితో ఆగారా ప్రాణాలు తీస్తామని, ఇకపై అలాంటి పాత్రలు చేయకండి అంటూ బెదిరించారట కూడా.. ఇదే కాదు సీనియర్ ఎన్టీఆర్(Sr.NTR) ఎన్టీఆర్ రాముడిగా, అంజలీదేవి(Anjali Devi)సీతగా నటించిన చిత్రం ‘లవకుశ’. ఈ సినిమాలో సీతగా అంజలీదేవి లీనమైపోయి మరీ నటించారు. ఒకసారి ఆమె ఏదో పని నిమిత్తం బయటకు వచ్చినప్పుడు.. నిజంగా సీతాదేవి వచ్చిందని ఒక గ్రామం ఆడవారు ఆమె పాదాలకు పాదాభివందనం చేశారట. దీన్నిబట్టి చూస్తే సినిమాలోని క్యారక్టర్లకు, కథలకు ప్రజలు ఎలా కనెక్ట్ అవుతున్నారో అర్థం చేసుకోవచ్చు.
తేజ కాళ్లకు మొక్కిన పెద్దమనిషి..
ఇప్పుడు హనుమాన్ సినిమాలోని తేజ క్యారెక్టర్ కు కూడా కనెక్ట్ అయిన ఒక పెద్దాయన, తేజ కాళ్లు మొక్కబోయాడు. తాజాగా గోవాలో జరుగుతున్న ఐఎఫ్ఎఫ్ఐ ఫిలిం ఫెస్టివల్ కు అతిథిగా వెళ్లిన తేజ, స్టేజి మీదకు వచ్చి ప్రేక్షకులకు అభివాదం చేస్తున్న సమయంలో.. తెల్లని గడ్డంతో ఉన్న ఒక పెద్ద మనిషి స్టేజ్ ఎక్కి, తేజ కాళ్ళకు దండం పెట్టుకున్నారు. సడన్ గా ఇలాంటి ఘటన తనకు ఎదురయ్యే సరికి ఆయన ఆశ్చర్యపోయారు. అంతేకాదు ఊహించని పరిణామం ఎదురవడంతో ఇలా చేయొద్దని ఆ పెద్దాయన తో వారించాడు కూడా. ఇక ఈ ఘటన చూసి అక్కడికి వచ్చిన సెలబ్రిటీలు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
ఇకనైనా దర్శకనిర్మాతలు ఆలోచిస్తారా..?
ఇకపోతే ఈ సినిమాలో ఆంజనేయ స్వామి అనుగ్రహం పొందిన పాత్రలో తేజాను చూసి, ఓ డివైన్ ఫీలింగ్ పొందినందు వల్లే ఆ పెద్దమనిషి అలా ప్రవర్తించారు. వీటిని బట్టి చూస్తే ప్రేక్షకులపై సినిమాల ప్రభావం ఏ విధంగా ఉందో మనకు అర్థమవుతుంది. ముఖ్యంగా సినిమాలు మనిషిని మంచి వైపు లేదా చెడు వైపు రెండింటి వైపు ప్రభావితం చేస్తాయి. కాబట్టి దర్శక నిర్మాతలు, హీరోలు ప్రజలను, వారి మనోభావాలను దృష్టిలో పెట్టుకొని మంచి కంటెంట్ ఉన్న సినిమా తీస్తే బాగుంటుందని నెటిజన్స్ కూడా అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.
Super Hero @tejasajja123 received a memorable felicitation at @IFFIGoa after the screening of the Historic Blockbuster #HanuMan !#TejaSajja #IFFI2024 pic.twitter.com/QBHFwiVD3j
— Rajesh Manne (@rajeshmanne1) November 23, 2024