BigTV English

IIFA 2024 : అవార్డు ఇస్తామని పిలిచి అవమానించారు… ఐఫా నిర్వాహకులపై కన్నడ డైరెక్టర్ ఫైర్

IIFA 2024 : అవార్డు ఇస్తామని పిలిచి అవమానించారు… ఐఫా నిర్వాహకులపై కన్నడ డైరెక్టర్ ఫైర్

IIFA 2024 : ప్రతి ఏటా సినీ రంగం సాధించిన విజయాలను పలు అవార్డుల వేదికపై సెలబ్రేట్ చేసుకుంటున్నారు సినీ ప్రముఖులు. అందులో ముఖ్యంగా సౌత్ అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే అవార్డుల వేడుక ఐఫా. తాజాగా IIFA-2024 పలువురు సినీ ప్రముఖులకు అవార్డుల ప్రదానం, సత్కారాలతో ఘనంగా జరిగింది. కానీ ఓ దర్శకుడు మాత్రం తనను అవార్డు పేరుతో పిలిచి అవమానించారు అంటూ ఐఫా కార్యక్రమ నిర్వాహకులపై ఫైర్ అయ్యారు. సోషల్ మీడియా వేదికగా ఈ విషయాన్ని వెల్లడిస్తూ ఆవేదనను వ్యక్తం చేశారు.


ఐఫా వేడుకలో డైరెక్టర్ కు అవమానం 

2024 IIFA అవార్డులు ఈ వీకెండ్ అబుదాబిలో జరిగాయి. బాలీవుడ్ తో పాటు నాలుగు దక్షిణాది సినీ పరిశ్రమలు – తమిళం, తెలుగు, కన్నడ, మలయాళం సినిమా ఇండస్ట్రీలలో బెస్ట్ చిత్రాలకు అవార్డులు అందజేశారు. కానీ కన్నడ దర్శకుడు హేమంత్ రావు తనను ఈవెంట్ కు పిలిచి అవార్డు ఇవ్వకుండా అవమానించారు అంటూ తాజాగా ఆగ్రహం వ్యక్తం చేశారు. మీ సినిమాకి అవార్డు వచ్చిందని పిలిచి, అవార్డు ఇవ్వకుండానే ప్రోగ్రామ్ ముగించారని చెప్తూ అసహనం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన సోషల్ మీడియాలో సుధీర్ఘ పోస్ట్ ను చేశారు. అందులో “‘ఐఫా అవార్డ్స్ నిర్వాహకులు మాకు ఫోన్ చేసి మీ సినిమాకు అవార్డు ఇస్తున్నాము అని చెప్పారు. మీ సినిమా సంగీత దర్శకుడు చరణ్‌రాజ్‌తో కలిసి అబుదాబి వచ్చేందుకు ఫ్లైట్‌ ఏర్పాటు చేశామంటూ ఫోన్‌ చేశారు. కానీ టీవీలో చూపించినంత అద్భుతంగా అవార్డు కార్యక్రమం జరగలేదు.


ఈ IIFA అవార్డు నిర్వాహకులు ముందుగా హిందీ, తెలుగు, తమిళ మలయాళ చిత్ర పరిశ్రమకు అవార్డులు ఇచ్చి, ఆ తర్వాత మన కన్నడ చిత్రాలకు అవార్డులు ఇస్తారు. తెల్లవారుజామున 3 గంటలకు కార్యక్రమం పూర్తయింది. కన్నడ విషయానికి వస్తే ‘కాటేరా’ సినిమాకు అవార్డు వచ్చింది. దీని తర్వాత మా సినిమా ఎప్పుడు ఎనౌన్స్ అవుతుందా అని నేనూ, మా సంగీత దర్శకుడు చరణ్ రాజ్ కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నాం. కానీ కార్యక్రమం పూర్తయింది. అవార్డు ఇవ్వకుండానే కార్యక్రమం ముగించడంతో నేను చాలా ఆశ్చర్యపోయాను. అయినా కూడా శని, ఆదివారాలు దుబాయ్ లోనే ఉండిపోయాం. ఐఫా అవార్డ్స్ నిర్వాహకులు కానీ, కార్యక్రమ బాధ్యులు కానీ మా వద్దకు వచ్చి తప్పు జరిగిందనే ప్రస్తావన కూడా తీసుకురాలేదు. బహుశా ఆ విషయాన్ని గ్రహించడానికి వాళ్ళకు టైమ్ పట్టిందేమో. మా సినిమాకు అవార్డు రాలేదనే బాధ పడలేదు మేము. నేనెప్పుడూ అవార్డుల కోసం సినిమా చేయలేదు. సినిమా ప్రేక్షకుల స్పందనే నాకు పెద్ద అవార్డు. కానీ నా సమయాన్ని వృధా చేశారనేదే మరింత బాధిస్తోంది” అని రాసుకొచ్చారు.

ఆ డైరెక్టర్ పై కోపం లేదు 

సప్త దాగరాలు దాటి సైడ్ ఏ, బి అనే సినిమాలతో మంచి డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న డైరెక్టర్ హేమంత్ తన తోటి కన్నడ దర్శకుడు అరుణ్ సుధీర్ అవార్డును అందుకోవడంపై తనకు కోపం లేదని స్పష్టం చేశాడు. కానీ అవార్డులను పారదర్శకంగా ఇవ్వలేదని ఫైర్ అయ్యారు.

Related News

Barrelakka: పండంటి బిడ్డకు జన్మనిచ్చిన బర్రెలక్క.. బేబీ ఎంత క్యూట్ గా ఉందో?

Heroes Remuneration : హైయెస్ట్ పెయిడ్ హీరోలు… మన తెలుగు హీరోలు ఎంత మంది ఉన్నారో చూడండి

Nainika Anasuru : మా నాన్న అలాంటివాడు, అందుకే ఎక్కువ చెప్పను

Nainika Anasuru : నా ఫోటో పెట్టి రేట్ చెప్పే వాళ్ళు, నాకు కూతురు ఉంటే ఇండస్ట్రీకి పంపను

Nainika Anasuru : చచ్చి పోదాం అనుకున్నాను, కన్నీళ్లు పెట్టుకున్న నైనిక

Ester Valerie Noronha : రెండో పెళ్లి చేసుకుంటున్న నోయల్ మాజీ భార్య ఎస్తేర్.. ఇతడితో ఎన్ని రోజులుంటుందో..?

Divvala Madhuri: ఆ రికార్డింగ్ డ్యాన్స్ వీడియోపై స్పందించిన దివ్వెల మాధురి.. రూ.కోటి మీదే!

Venuswamy : అమ్మ బాబోయ్.. వేణు స్వామి దగ్గరకు అమ్మాయిలు అందుకోసమే వస్తారా..?

Big Stories

×