Nainika Anasuru : జీవితమే ఒక చిన్న మజిలీ. వెళ్ళిపోమా లోకాన్ని వదిలి. మళ్లీ మళ్లీ చూడగలమా ఈ కళల్ని ఈ కథల్ని.? జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు వస్తూ ఉంటాయి. వాటిని జయిస్తూ ముందుకెళ్లడమే అసలైన జీవితం. ఈరోజు తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న చాలా మంది సెలబ్రిటీస్ ని మనం చూస్తూనే ఉండడం. వాళ్ల క్రేజ్ వెనక కనిపించని కన్నీటి కథలు బోలెడు ఉంటాయి. ఆ కథలు వింటుంటే మన కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. మనం చూసే సెలబ్రిటీస్ జీవితం వెనక ఇంతటి బాధలు ఉన్నాయా అనిపిస్తుంది.
డి షో తో మంచి గుర్తింపు తెచ్చుకుంది నైనిక. ఆ షో చాలామందికి విపరీతమైన పేరును తీసుకొచ్చింది. ఆ షో లో నైనుక మరియు సాయి మధ్య కొంత కెమిస్ట్రీ కూడా జరిగింది. అయితే అది కేవలం టిఆర్పి రేటింగ్ కోసం జరిగినవి కావచ్చు. ఎప్పుడు నవ్వుతూ కనిపించే నైనిక జీవితంలో కూడా ఎన్నో వ్యక్తిగత ఒత్తిడిలు సమస్యలు ఉన్నాయి. ఒక తరుణంలో నైనిక చచ్చిపోవాలి అని నిర్ణయం తీసుకుందట. ఇంక నావల్ల కావట్లేదు, ఎవరు నా మాట వినట్లేదు అనే పొజిషన్ కి వచ్చేసిందట. సొంత కుటుంబం కూడా సపోర్ట్ చేయలేదు. అప్పుడు సూసైడ్ చేసుకుందాం అని అనుకొని అటెంప్ట్ కూడా చేసిందట. ఈ విషయాలన్నీ కూడా బిగ్ టీవీ కిస్సిక్ టాక్ షో స్వయంగా నైనిక తెలిపారు.
Also Read : Kishkindhapuri : హరిహర వీరమల్లు కంటే ఆ విషయంలో బెల్లం అన్న సినిమానే టాప్
ఫిలిం ఇండస్ట్రీలో చాలామంది సూసైడ్ చేసుకున్న సెలబ్రిటీలు ఉన్నారు. కేవలం తెలుగులో మాత్రమే కాదు మిగతా ఇండస్ట్రీలో కూడా ఇలాంటి వార్తలు మనం వింటూనే ఉంటాం. సుశాంత్ సింగ్ రాజ్పుత్ చనిపోయినప్పుడు అసలు ఆయనకి ఏం తక్కువ అని చాలామంది ఆశ్చర్య పోయారు. ఉదయ్ కిరణ్ చనిపోయినప్పుడు కూడా చాలామంది కదిలిపోయారు. జీవితంలో ఇటువంటి నిర్ణయాలు కరెక్ట్ కాదు అని పదిమంది పది రకాలుగా చెప్తారు.
కానీ ఒక వ్యక్తి చనిపోవడానికి అంటే ముందు ఎన్నోసార్లు ఆలోచించి ఉంటాడు. చుట్టూ ఎవరు లేరు అని అని తెలుసుకున్న తర్వాతనే సూసైడ్ ప్రయత్నాలు చేస్తుంటారు. అందుకే మన చుట్టూ ఉన్న వాళ్ళతో వీలైనంత మృదువుగా మాట్లాడి సమాజంలో ఇంకా మనుషులు ఉన్నారు అని గుర్తు చేస్తే ఇలాంటి ఆలోచనలు తగ్గుతాయి.