BigTV English
Advertisement

Barrelakka: పండంటి బిడ్డకు జన్మనిచ్చిన బర్రెలక్క.. బేబీ ఎంత క్యూట్ గా ఉందో?

Barrelakka: పండంటి బిడ్డకు జన్మనిచ్చిన బర్రెలక్క.. బేబీ ఎంత క్యూట్ గా ఉందో?

Barrelakka:సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత చాలామంది పాపులారిటీని దక్కించుకునే ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగానే చిన్న చిన్న విషయాలతోనే వైరల్ అయ్యి.. ఊహించని ఇమేజ్ ను అందుకుంటున్నారు. ముఖ్యంగా ఈ సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్ వేదికగా తమ టాలెంటెడ్ నిరూపించుకొని.. పెద్ద ఎత్తున క్రేజ్ సొంతం చేసుకుంటున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే బర్రెలు కాచుకుంటూ ఒక చిన్న రీల్ తో ఊహించని ఇమేజ్ సొంతం చేసుకుంది బర్రెలక్క అలియాస్ శిరీష.


ఒక్క రీల్ తో భారీ పాపులారిటీ..

బర్రెలక్క శిరీష గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. ” ఉద్యోగం లేదని. నాలుగు బర్రెలు కొనుక్కోవడం బెటర్” అనే రీల్ తో రెండు తెలుగు రాష్ట్రాలలో భారీ పాపులారిటీ సొంతం చేసుకుంది. ఒక్క రీల్ తో ఊహించని ఇమేజ్ అందుకున్న ఈమె.. ఆ తర్వాత ఎమ్మెల్యేగా, ఎంపీగా కూడా పోటీ చేసింది. కానీ ఈమెకు ప్రజల ఆదరణ లభించలేదు. ఫలితంగా ఓడిపోయింది. ఆ తర్వాత అన్నింటినీ వదిలేసిన బర్రెలక్క వైవాహిక బంధంలోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే.

పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన బర్రెలక్క శిరీష..


ఇక భార్యగా బాధ్యతలు చేపట్టి.. ఇంటికే పరిమితమైన ఈమె తాజాగా పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఇందుకు సంబంధించిన వార్త సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో బర్రెలక్కకు అభిమానులు, ప్రేక్షకులు, నటిజన్లు శుభాకాంక్షలు చెబుతున్నారు. ఇక తల్లి బిడ్డ ఇద్దరు క్షేమంగా ఉన్నారని కుటుంబ సభ్యులు కూడా తెలియజేశారు. ఇకపోతే తాజాగా ఆసుపత్రి డెలివరీ కి సంబంధించిన వీడియోని తన యూట్యూబ్ ఛానల్ లో అప్లోడ్ చేసింది. అందులో భాగంగానే తాజాగా తాను నార్మల్ డెలివరీ కోసం ఎంత కష్టపడింది అనే విషయాన్ని కూడా యూట్యూబ్ ద్వారా తెలియజేసింది బర్రెలక్క. ప్రస్తుతం బర్రెలక్క కూతురు ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో చిన్నారి ఎంత క్యూట్ గా ఉందో అంటూ నెటిజన్స్ కామెంట్లు చేస్తున్నారు.

బర్రెలక్క కెరియర్..

బర్రెలక్క కెరియర్ విషయానికి వస్తే.. సాధారణ రైతు కుటుంబంలో పుట్టిన ఈమె.. అతి కష్టం మీదే తన చదువును పూర్తి చేసింది. అయితే ఎంత చదువుకున్న ఉద్యోగం మాత్రం రాకపోయేసరికి చదువుకొని డబ్బులు ఖర్చు పెట్టడం కంటే.. బర్రెలు కాచుకుంటూ డబ్బులు సంపాదించుకోవడం బెటర్ అంటే చాలామందికి కనెక్ట్ అయ్యింది. అలా తన వీడియోలతో ఎప్పటికప్పుడు ప్రేక్షకులను అలరించిన ఈమె.. అదే జోష్లో బిగ్ బాస్ హౌస్ లోకి కూడా వెళ్తుందని అందరూ అనుకున్నారు. కానీ అది జరగలేదు. ఇక ఇప్పుడు పెళ్లి చేసుకొని పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. ఇకనైనా పాపతో సంతోషంగా జీవించాలని అభిమానులు కోరుకుంటున్నారు. మొత్తానికైతే బర్రెలక్క పండంటి బిడ్డకు జన్మనివ్వడంతో అభిమానుల ఆనందానికి అవధులు లేవని చెప్పవచ్చు.

ALSO READ:Mirai: మిరాయ్ మూవీ కోసం ప్రభాస్ రెమ్యూనరేషన్ ఎంతంటే?

Related News

Film industry: ఘనంగా సినిమాటిక్ ఎక్స్ పో 3వ ఎడిషన్!

CM Revanth on Movie Tickets: సినిమా టికెట్ డబ్బుల్లో సినీ కార్మికులకు వాటా… సీఎం సంచలన ప్రకటన

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇల్లు చూడండి.. ఎంత అద్భుతంగా ఉందో!

Telugu Heroes : సినిమాలతో పాటు హోటల్స్… లగ్జరీ రెస్టారెంట్స్ ఉన్న హీరోలు వీళ్లే

Salman Khan: పాక్ ను కెలికిన సల్లు భాయ్.. తెలుగు సినిమాలు బాగా చూస్తారంటూ..

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Mouli: పోలీస్ గెటప్ లో అదరగొట్టేసిన లిటిల్ హార్ట్స్ హీరో.. ఇదిగో వీడియో!

Big Stories

×