BigTV English
Advertisement

Heroes Remuneration : హైయెస్ట్ పెయిడ్ హీరోలు… మన తెలుగు హీరోలు ఎంత మంది ఉన్నారో చూడండి

Heroes Remuneration : హైయెస్ట్ పెయిడ్ హీరోలు… మన తెలుగు హీరోలు ఎంత మంది ఉన్నారో చూడండి

Heroes Remuneration : సినిమాకు వచ్చే కలెక్షన్ల గురించే కాదు.. హీరోలు తీసుకునే రెమ్యునరేషన్ విషయాలు కూడా ఎప్పుడూ టాక్ ఆఫ్ ది టౌన్‌గానే ఉంటాయి. తమ హీరో ఇన్ని కోట్లు తీసుకున్నాడు అంటూ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో చేసే రచ్చ మనం రెగ్యూలర్‌గా చూస్తూనే ఉన్నాం. అయితే ఇప్పుడు ఉన్న టైంలో ఇండియన్ సినీ ఇండస్ట్రీలో అత్యధికంగా పారితోషికం తీసుకున్న నటులు ఎవరో… ఏయే సినిమాలకు ఎక్కువగా తీసుకున్నారో ఇప్పుడు ఓ లుక్ వేద్దాం పదండి.


టాప్ ప్లేస్‌లో పుష్ప రాజ్

పుష్ప సినిమాతో అల్లు అర్జున్ గ్లోబల్ వైడ్ సెన్సేషన్ అయ్యాడు. పుష్ప 2 సినిమాకు బన్నీ దాదాపు 280 కోట్ల వరకు రెమ్యూనరేషన్‌గా తీసుకున్నాడట. దీని తర్వాత చేసే సినిమాలకు కూడా ఇంచు మించుగా ఇదే రేంజ్‌లో ఉండచ్చు. అట్లీతో తీస్తున్న AA22 సినిమాను సన్ పిక్చర్స్ దాదాపు 800 కోట్ల బడ్జెట్‌తో నిర్మిస్తుంది. దీనికి అల్లు అర్జున్ 250 కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్టు టాక్ ఉంది.

సెకండ్ ప్లేస్‌లో దళపతి

తమిళ్ సూపర్ స్టార్ దలపతి విజయ్‌కి సౌత్ స్టేట్స్‌లో మంచి ఫ్యాన్ బేస్ ఉంది. అతని సినిమాకు ఫస్ట్ డే రోజు మినిమమ్ కలెక్షన్స్ గ్యారంటీ. ప్రస్తుతం విజయ్ దళపతి ఒక్కో సినిమాకు 200 కోట్ల నుంచి 250 కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్టు తమిళ మీడియా చెబుతుంది. విజయ్ లాస్ట్ మూవీ రాబోయే సంక్రాంతికి వస్తున్న “జన నయగాన్” సినిమాకు 275 కోట్లు తీసుకున్నాడు అని వార్తలు వచ్చాయి.


3వ ప్లేస్‌లో బాలీవుడ్ బాద్‌ షా

బాలీవుడ్ బాద్‌ షా షారుఖ్ ఖాన్‌కి 2024లో 1000 కోట్లు కలెక్ట్ చేసిన సినిమాలు రెండు ఉన్నాయి. పఠాన్, జవాన్ రెండు సినిమాలు బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్ అయ్యాయి. జవాన్ సినిమాకు షారుఖ్ 250 కోట్లు రెమ్యూనరేషన్ తీసుకున్నారని బీ టౌన్‌లో వార్తలు వచ్చాయి. తర్వాత సినిమాలకు కూడా దాదాపు అంతే మొత్తం తీసుకుంటున్నట్టు తెలుస్తుంది.

4వ స్థానంలో రజనీకాంత్

నాలుగోవ స్థానంలో తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ ఉన్నాడు. ఈ సూపర్ స్టార్ గురించి ఎంత చెప్పిన తక్కువే. ఆయన సినిమా రిలీజ్ అవుతుంది అంటే ఒక తమిళనాడు లోనే కాదు.. వేరే దేశాల్లో కూడా ఆఫీస్‌లకు హాలీడేస్ ఇచ్చిన రోజులు ఉన్నాయి. ఇలాంటి స్టార్ ఎంత రెమ్యూనరేషన్ తీసుకుంటాడో మీకు తెలుసా..? రజనీకాంత్… సినిమాను బట్టి, నిర్మాతను బట్టి, సినిమా స్కేల్‌ను బట్టి రెమ్యూనరేషన్ తీసుకుంటాడు. ఆయన ఒక్కో సినిమాకు 200 కోట్ల నుంచి 260 కోట్లు తీసుకుంటారట.

5వ ప్లేస్‌లో అమీర్ ఖాన్

అమీర్ ఖాన్.. యాక్టర్ హోదా, క్రేజ్ అని కాకుండా కంటెంట్‌ను నమ్మే ఏకైక యాక్టర్ అని చెప్పొచ్చు. అతను ఒక సినిమా ఓకే చేసాడు అంటే, అది ఎలా చూసే ఆడియన్స్ సంఖ్య చాలా పెద్దగా ఉంటుంది. ఇలాంటి మిస్టర్ పర్ఫెక్ట్ ఇమేజ్ ఉన్న ఆమిర్ ఒక్కో సినిమాకు 150 కోట్ల దగ్గర నుంచి 275 కోట్ల వరకు తీసుకుంటారట.

విల్లే కాకుండా రెబెల్ స్టార్ ప్రభాస్, అజిత్ కుమార్, సల్మాన్ ఖాన్ కూడా ఒక్క సినిమాకు 100 కోట్లకు పైగా రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు.

Related News

CM Revanth on Movie Tickets: సినిమా టికెట్ డబ్బుల్లో సినీ కార్మికులకు వాటా… సీఎం సంచలన ప్రకటన

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇల్లు చూడండి.. ఎంత అద్భుతంగా ఉందో!

Telugu Heroes : సినిమాలతో పాటు హోటల్స్… లగ్జరీ రెస్టారెంట్స్ ఉన్న హీరోలు వీళ్లే

Salman Khan: పాక్ ను కెలికిన సల్లు భాయ్.. తెలుగు సినిమాలు బాగా చూస్తారంటూ..

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Mouli: పోలీస్ గెటప్ లో అదరగొట్టేసిన లిటిల్ హార్ట్స్ హీరో.. ఇదిగో వీడియో!

Sree Leela: శ్రీలీల 150 కోట్ల యాడ్ ఫిలిం టీజర్ చూశారా..ఏంటి స్వామీ ఈ అరాచకం!

Big Stories

×