BigTV English

Bharateeyudu 2: థియేటర్ లోనే కాదు ఓటీటీలో కూడా భారతీయుడు ఓడిపోయాడే..

Bharateeyudu 2: థియేటర్ లోనే కాదు ఓటీటీలో కూడా భారతీయుడు ఓడిపోయాడే..

Bharateeyudu 2: కొన్ని సినిమాలు థియేటర్ లో ప్లాప్ అయినా.. ఓటీటీలో హిట్ అవుతూ ఉంటాయి. అలా కాకపోయినా స్టార్ హీరో సినిమాలు థియేటర్ లో నెగెటివ్ టాక్ తెచ్చుకున్నా.. ఓటీటీలో వచ్చాక కనీసం సినిమా చూసి అయినా ఓకే పర్లేదు అని చెప్పుకొచ్చిన రోజులు కూడా లేకపోలేదు. ఇక ఇంకొన్ని సినిమాలు థియేటర్ లోనే కాదు ఓటీటీలో కూడా ప్లాప్ అవుతాయి. ఇప్పుడు ఇండియన్ 2 వీటికి మించి డిఫరెంట్ గా మారింది. థియేటర్ లో ఎలా అయితే ట్రోల్స్ బారిన పడిందో.. ఓటీటీలో అంతకుమించి ట్రోల్స్ ను ఎదుర్కొంటుంది.


కమల్ హాసన్ హీరోగా శంకర్ దర్శకత్వం వహించిన ఇండియన్ 2.. గత నెల జూలై 12 న ప్రేక్షకుల ముందుకు వచ్చి నెగెటివ్ టాక్ ను అందుకుంది. వీరి కాంబోలో వచ్చిన ఇండియన్ సినిమా ఏ రేంజ్ లో హిట్ అందుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక ఆ సినిమాకు సీక్వెల్ ప్రకటించగానే అభిమానులు ఎన్నో అంచనాలను పెట్టుకున్నారు. ఆ అంచనాలకు తగ్గట్టుగానే ట్రైలర్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. దీంతో సినిమా ఏ రేంజ్ లో ఉంటుందో అనుకోని థియేటర్ కు వెళ్లిన ఫ్యాన్స్ కు నిరాశ ఎదురయ్యింది.

అసలు ఇది శంకర్ సినిమానా..? అని తలలు కొట్టుకొని బయటకు వచ్చారు. కథలో బలం లేదు, లెంత్ ఎక్కువ అని పెదవి విరిచారు. ఇక కొంతవరకు ట్రిమ్ చేసి వదిలినా కూడా ఫ్యాన్స్ కొంచెం కూడా కనికరించలేదు. ఇక దీంతో నెల తిరక్కుండానే భారతీయుడు ఓటీటీలో సందడి చేశాడు.


నిన్నటి నుంచి భారతీయుడు నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతుంది. థియేటర్ లో రిలీజ్ అయినప్పుడు చూడని అభిమానులు ఓటీటీలో రిలీజ్ అయ్యాక చూసి మరింత దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. ఇది అసలు శంకర్ సినిమానా..? అసలు ఇది ఇండియన్ 2 కు సీక్వెల్ లా ఉందా..? ఆ మ్యూజిక్ ఏంటి..? అంటూ తమిళ్ అభిమానులే ట్రోల్ చేయడం విశేషం. మరి ముందు ముందు ఈ సినిమా ఇంకెన్ని ట్రోల్స్ బారిన పడుతుందో చూడాలి.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×