E-Paper
Advertisement

Indra Movie: రికార్డు స్థాయిలో ఇంద్ర రీ-రిలీజ్ టికెట్‌ బుకింగ్స్‌

Indra Movie: రికార్డు స్థాయిలో ఇంద్ర రీ-రిలీజ్ టికెట్‌ బుకింగ్స్‌
Advertisement

Indra Movie Re Release Ticket Bookings At A Record Level: టాలీవుడ్‌ మెగాస్టార్ చిరంజీవి హీరోగా యాక్ట్ చేసిన బీ గోపాల్ డైరెక్షన్‌లో తెరకెక్కిన యాక్షన్ డ్రామా మూవీ ఇంద్ర. 22 ఏళ్ల క్రితం రిలీజైన ఈ మూవీ థియేటర్‌లలో తన సత్తాని చాటింది. అంతేకాదు ఈ మూవీ ఆడియెన్స్‌ను, ఫ్యాన్స్‌ని బాగా ఆకట్టుకుంది. బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచి, ఎన్నో రికార్డులను క్రియేట్ చేసింది. ఇక ఈ మూవీ మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఆగస్టు 22న రీ-రిలీజ్ కి రెడీ అయిపోయింది. ఇప్పటికే ఈ మూవీ రీ రిలీజ్‌కి భారీగా ప్లాన్ చేశారు. ఇక ఈ మూవీకోసం టికెట్‌ బుకింగ్స్ హాట్ కేకుల్లా అమ్ముడవుతున్నాయి. తెలుగు సినీ పరిశ్రమలో రీ-రిలీజ్ ట్రెండ్ కొనసాగుతుంది.

గతంలో మంచి విజయాలు సాధించిన సినిమాలు మళ్ళీ రిలీజ్ అవుతుండటంతో మెగా ఫ్యాన్స్ అంతా థియేటర్లకి భారీగా వస్తున్నారు. ఇప్పుడు ఇంద్ర మూవీ మళ్ళీ థియేటర్లలోకి రావడం కన్ఫర్మ్ కావడంతో, మేకర్స్ కూడా అడ్వాన్స్ బుకింగ్స్ ను ప్రారంభించారు. బుకింగ్స్ కి సూపర్ రెస్పాన్స్ వస్తోంది. చాలా చోట్ల షోలు పూర్తిగా అమ్ముడయిపోయాయి. కొన్ని షోలు వేగంగా ఫిల్ అవుతున్నాయి. మెగాస్టార్ చిరంజీవి బర్త్ డేను గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకోవాలని ఫ్యాన్స్ కూడా గట్టిగా ఫిక్స్ అయిపోయారు. ఇక ఈ మూవీ వైజయంతి మూవీస్ బ్యానర్ పై అశ్వనీ దత్ నిర్మితమైంది.

Advertisement

Also Read: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ చేతిలో బ్యాక్ టు బ్యాక్‌ అరడజన్‌ చిత్రాలు

నటి ఆర్తి అగర్వాల్, సోనాలి బింద్రే, ప్రకాష్ రాజ్, ముఖేష్ రిషి, శివాజీ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. మెలోడీ బ్రహ్మ మణిశర్మ అధ్బుతమైన బాణీలు, బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్‌ ఈ మూవీకి ఇంకో హైలైట్ అనే చెప్పాలి. అంతేకాదు ఈ మూవీలో మెగాస్టార్ చిరంజీవి మాస్‌ లుక్‌లో ఆడియెన్స్‌ని ఆధ్యంతం ఆకట్టుకున్నాడు. అందుకే ఫ్యాన్స్‌ మరోసారి ఇంద్ర మూవీని చూసేందుకు ఉవ్విళ్లూరుతున్నారు. అంతేకాదు ఈ మూవీ 2002లో రిలీజై ఆ ఏడాదిలో బిగ్గెస్ట్ హిట్‌గా రికార్డులను తిరగరాసి మెగాస్టార్ కెరీర్‌లో ఒక సూపర్ హిట్ మూవీగా నిలిచింది.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×