BigTV English

Jitendra Ev JMT 1000 HS: ఆగండి ఆగండి.. ఎలక్ట్రిక్‌ స్కూటర్ కొంటున్నారా.. దీనిపై వేలల్లో తగ్గింపు పొందొచ్చు..!

Jitendra Ev JMT 1000 HS: ఆగండి ఆగండి.. ఎలక్ట్రిక్‌ స్కూటర్ కొంటున్నారా.. దీనిపై వేలల్లో తగ్గింపు పొందొచ్చు..!

Jitendra ev august bonanza offers: దేశీయ ఆటో మొబైల్ మార్కెట్‌లో టూ వీలర్స్‌కు ప్రత్యేక డిమాండ్ ఉంది. ముఖ్యంగా పట్టణాల ప్రజలు స్కూటర్లపై ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. చిన్న చిన్న ఉద్యోగాలు చేసేవారు, పిల్లలను స్కూల్‌కు డ్రాప్ చేసేవారు, ఇంటిపనుల కోసం ఇలా ప్రతి విషయంలో స్కూటర్ నిత్యవసర వస్తువుగా మారిపోయింది. ఎక్కువగా మహిళలు, వృద్ధులు స్కూటర్‌నే ఎంచుకుంటున్నారు. అందువల్లనే ప్రముఖ కంపెనీలు సైతం తరచూ ఏదో ఒక స్కూటర్‌ను లాంచ్ చేస్తూ ఆకట్టుకుంటున్నాయి.


అయితే మరికొన్ని కంపెనీలు తమ స్కూటర్లను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కొత్త కొత్త ఆఫర్లను ప్రకటిస్తూ మంచి గుర్తింపు సంపాదించుకుంటున్నాయి. ఇప్పటికే చాలా కంపెనీలు తమ స్కూటర్లపై భారీ డిస్కౌంట్ ఆఫర్లను ప్రకటించాయి. అదీగాక ఇప్పుడంతా పండుగ సీజన్ వస్తుండటంతో చాలా మంది వాహనాలను కొనాలని ప్లాన్ చేస్తుంటారు. అలాంటి వారికోసం మరింత ఎక్కువ మొత్తంలో ఆఫర్లు అందించి తమ సేల్స్‌ మరింత పెంచుకుంటున్నాయి కంపెనీలు. ఇప్పటికే స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా గతనెల నుంచి ఇప్పటి వరకు చాలా ఆఫర్లు ప్రటించాయి.

పెట్రోల్, ఎలక్ట్రిక్ వంటి విభాగాల్లో తమ స్కూటర్లపై ఊహించని డిస్కౌంట్లు ప్రకటించి ఆకట్టుకున్నాయి. అయితే ఇప్పుడు మరొక స్కూటర్ తయారీ కంపెనీ తన వెహికల్‌పై అదిరిపోయే డిస్కౌంట్ ఆఫర్ ప్రకటించింది. భారీ డిస్కౌంట్లు, ఇతర ప్రయోజనాలతో మరింత ఎక్కువ మంది కస్టమర్లను ఆకట్టుకునేందుకు లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలుస్తోంది. నాసిక్‌కు చెందిన ప్రముఖ ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ జితేంద్ర ఈవీ తాజాగా తన లైనప్‌లో ఉన్న స్కూటర్‌పై ఆఫర్లు ప్రకటించింది.


Also Read: రాయల్ ఎన్‌ఫీల్డ్ లుక్‌తో ‘బిఎస్‌ఏ గోల్డ్‌స్టర్ 650’.. ధర, ఫీచర్లు ఇవే..!

ఆగస్టు బొనాంజా పేరుతో తాజాగా కొత్త ఆఫర్‌ని తీసుకొచ్చింది. ఇందులో క్యాష్‌బ్యాక్‌తో సహా మరిన్ని ఆఫర్లు పొందవచ్చు. ఇక ఆఫర్ వివరాల విషయానికొస్తే.. కంపెనీ తాజాగా తన ఈవీ JMT 1000 HS కొనుగోలుపై రూ.10,000 డిస్కౌంట్, అలాగే JMT 1000 3K కొనుగోలుపై రూ.20,000 ఇన్‌స్టంట్ క్యాష్‌బ్యాక్ అందిస్తున్నట్లు తెలిపింది. ఇదే కాకుండా పై రెండు మోడళ్లపై కాంప్లిమెంటరీ ఇన్సూరెన్స్‌ని కూడా అందిస్తున్నట్లు తెలిపింది. అలాగే కంపెనీ లాయల్టీ కస్టమర్ల కోసం ప్రత్యేక డిస్కౌంట్ అందిస్తుంది.

ఈ మోడళ్లను కొనుక్కున్న పాత కస్టమర్లు రూ.5000 అదనపు లాయల్టీ బోనస్ పొందొచ్చు. ఈ కంపెనీకి చెందిన లో స్పీడ్, హైస్పీడ్ ఎలక్ట్రిక్ వాహనాలను కొనుగోలు చేసిన వారికి ఇది లభిస్తుంది. ఇతర వివరాల కోసం సమీపంలోని డీలర్‌షిప్‌ను సంప్రదించాల్సి ఉంటుంది. అయితే కొత్తగా కొనుగోలు చేసే వారు క్యాష్‌బ్యాక్ ఆఫర్లు, ఫ్రీ ఇన్స్‌రెన్సూ పొందొచ్చు. కాగా ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే.. ఈ ఆఫర్ కేవలం ఆగస్టు 10 నుంచి ఆగస్టు 26 వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. అందువల్ల తక్కువ ధరలో మంచి స్కూటర్‌ను కొనుక్కోవాలని ప్లాన్ చేస్తుంటే ఇదే సరైన సమయం. JMT 1000 HS స్కూటర్ రూ.92,910 ఎక్స్ షోరూమ్ ధరతో అందుబాటులో ఉండగా.. ఇప్పుడు దీనిని రూ.82,910కి కొనుక్కోవచ్చు.

Related News

Digital Rent Agreement: ఈ రూల్ తెలియకుండా ఇల్లు అద్దెకు ఇస్తే రూ. 5000 జరిమానా కట్టక తప్పదు..

Real Estate: ఈ విషయాలు తెలియకుండా ‌ఫార్మ్ లాండ్స్ కొంటే భారీ నష్టం తప్పుదు..అడ్వర్టయిజ్‌మెంట్స్ చూసి మోసపోకండి..

Gold Particles: మురుగునీటి నుంచి భారీగా బంగారం ఉత్పత్తి.. లక్షల్లో సంపాదన..? ఎక్కడో తెలుసా?

Free Tempered Glass: టెంపర్డ్ గ్లాస్ డబ్బులు పెట్టి కొంటున్నారా? ఇకపై ఫ్రీగా పొందండిలా!

Jio Cheapest Plan: జియో చీపెస్ట్ ప్రీపెయిడ్ ప్లాన్, దీనితో లాభమేంటో తెలుసా?

Jio Offers: జియో నుంచి అదిరిపోయే ఆఫర్, 11 నెలలకు జస్ట్ ఇంతేనా?

Big Stories

×