E-Paper
Advertisement

Bangkok Pilla: వామ్మో.. బ్యాంక్ పిల్ల ఇంట్లో పేలిన ఇండక్షన్ స్టవ్.. అక్కడ గ్యాస్ వాడరా?

Bangkok Pilla: వామ్మో.. బ్యాంక్ పిల్ల ఇంట్లో పేలిన ఇండక్షన్ స్టవ్.. అక్కడ గ్యాస్ వాడరా?
Advertisement

Bangkok Pilla: ఇటీవల కాలంలో యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్ ద్వారా ఎంతో మంది సెలబ్రిటీ హోదా అనుభవిస్తూ ఉన్నారు. ఇలా యూట్యూబ్ ద్వారా సెలబ్రిటీ రేంజ్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకున్న వారిలో శ్రావణి ఒకరు. శ్రావణి అంటే బహుశా ఈమెను గుర్తుపట్టకపోవచ్చు కానీ బ్యాంకాక్ పిల్ల(Bangkok Pilla) అంటే మాత్రం టక్కున అందరికీ గుర్తుకు వస్తుంది. బ్యాంకాక్ పిల్ల అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్న శ్రావణి నిత్యం తనకు సంబంధించిన అన్ని విషయాలను యూట్యూబ్ ఛానల్, ఇంస్టాగ్రామ్ ద్వారా అభిమానులతో పంచుకుంటున్నారు.

ఇండియాలో గ్యాస్ సిలిండర్ కొరత..

ఇకపోతే తాజాగా ఈమె ఇంస్టాగ్రా వేదికగా తన ఇంట్లో ఇండక్షన్ స్టవ్(Induction stove) పేలినటువంటి ఒక వీడియోని షేర్ చేయడంతో ఇది కాస్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది . యుద్ధం నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా గ్యాస్ కొరత ఏర్పడిన సంగతి తెలిసిందే. ఇండియాలో కూడా ఎంతోమంది గ్యాస్ కొరత కారణంగా ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఇలాంటి నేపథ్యంలోనే ఎంతోమంది గ్యాస్ సిలిండర్ దొరకని నేపథ్యంలో ఇండక్షన్ స్టవ్స్ కొనుగోలు చేస్తున్న సంగతి తెలిసిందే.

బ్యాంకాక్ లో గ్యాస్ వాడరా?

Advertisement

ఇలా పెద్ద ఎత్తున ఇండక్షన్ స్టవ్ కొంటున్న తరుణంలో బ్యాంకాక్ పిల్ల ఇంట్లో ఇండక్షన్ స్టవ్ పేలడంతో ఇది కాస్త సంచలనంగా మారింది. ఈమె బ్యాంకాక్ లో నివసిస్తున్న సంగతి తెలిసిందే. బ్యాంకాక్ లో గ్యాస్ వాడటానికి వీలు ఉండదు. అక్కడ ఎత్తయిన భవనాలలో నివసిస్తున్న నేపథ్యంలో గ్యాస్ సిలిండర్లను ఉపయోగించడానికి అనుమతి తెలిపారు. అందుకే ఇండక్షన్ స్టవ్ ద్వారా వంట చేస్తూ ఉంటారు.  ఈ నేపథ్యంలోనే బ్యాంకాక్ పిల్ల సైతం గ్లాస్ తో తయారు చేసిన ఇండక్షన్ స్టవ్ ఉపయోగించేవారని అయితే ఒక్కసారిగా తన ఇంట్లో పెద్ద శబ్దం రావడంతో భయపడిపోయామని తెలిపారు.

?igsh=d2ZreXlzMHM4Z2Q1

Advertisement

ఉన్నఫలంగా తన ఇంట్లో ఇండక్షన్ స్టవ్ పేలడంతో భయపడ్డామని పెద్ద ప్రమాదం నుంచి తప్పించుకున్నామని తెలిపారు. బ్యాంకాక్ లో గ్యాస్ వాడటానికి వీలులేక ఇండక్షన్ వాడుతున్న తరుణంలోనే తన పొయ్యి పేలి పోయిందని తెలిపారు. అయితే ఈ ఘటన కారణంగా ఎవరికి ఎలాంటి ప్రమాదం కలగలేదని తెలిపారు. ప్రస్తుతం ఇండియాలో ఎక్కువగా ఇండక్షన్ స్టవ్ ఉపయోగిస్తున్న తరుణంలో బ్యాంకాక్ పిల్ల తన స్టవ్ పేలి పోయిందని చెప్పడంతో ఈ వీడియో వైరల్ అవ్వడమే కాకుండా అందరికీ ఒక హెచ్చరిక లాగా కూడా మారింది. ఇక ఈమె యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్ ద్వారా భారీ స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకున్నారు. ప్రస్తుత పలు ప్రమోషన్లలో కూడా ఎంతో బిజీగా ఉన్నారు. ఒకానొక సమయంలో బ్యాంకాక్ పిల్ల బిగ్ బాస్ కంటెస్టెంట్ గా కూడా పాల్గొనబోతున్నారంటూ వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.

Also Read: Pawan Kalyan: రాజకీయాలలోకి రావచ్చు కదా..ఆ హీరోయిన్ కు పవన్ ఆఫర్.. ఎవరా బ్యూటీ?

Related News

కరువు పరిస్థితులపై సినీ ఇండస్ట్రీ సహకారం కోరిన సీఎం రేవంత్.. వెంటనే స్పందించిన నాగ్!

సాయికృష్ణ మిస్టరీ కేసు సంఘటన.. మళయాల క్రైం థ్రిల్లర్‌ మూవీలో ప్రధాన కథనం..! ఇన్విస్టిగేషన్‌ ఆఫీసర్‌ని బురిడీ కొట్టించే సీన్లు..!

వికెట్ పడిన ఆనందంలో జుట్టు పట్టుకున్నా, కానీ ఆ బౌలర్ విగ్గే ఊడిపోయింది

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Big Stories

Advertisement
×