E-Paper
Advertisement

Bigg Boss 9 Telugu : తనూజా కెప్టెన్సీ వెనుక ఎవ్వరికీ తెలీని సెంటిమెంట్… భరణి జిత్తులమారి ఆట ఎక్స్పోజ్

Bigg Boss 9 Telugu : తనూజా కెప్టెన్సీ వెనుక ఎవ్వరికీ తెలీని సెంటిమెంట్… భరణి జిత్తులమారి ఆట ఎక్స్పోజ్
Advertisement

Bigg Boss 9 Telugu : బిగ్ బాస్ సీజన్ 9లో ప్రతీ ఎపిసోడ్ లోనూ ఏదో ఒక రకంగా తనూజా సెంటరాఫ్ ది అట్రాక్షన్ అవుతోంది. తాజా ఎమోషనల్ ఎపిసోడ్ లో కూడా తన సీక్రెట్ సెంటిమెంట్ తో పాటు ఫ్యామిలీ స్టోరీని బయట పెట్టింది. అలాగే కెప్టెన్సీ రాగానే ఆమె చేసిన పని కళ్యాణ్ ను కంగారు పెట్టింది. ఇంతకీ తనూజా సెంటిమెంట్ ఏంటి? కళ్యాణ్ ఎందుకు కంగారు పడ్డాడు? భరణి స్టోరీ ఏంటి ? అనేది ఇప్పుడు తెలుసుకుందాం.

తనూజా సీక్రెట్ సెంటిమెంట్ 

తనూజ ఈ వారం ఎట్టకేలకు కెప్టెన్సీ టాస్క్ గెలిచి, మహారాణిగా క్రౌన్ ధరించింది. 10వ వారం కెప్టెన్ గా సింహాసనాన్ని అధిష్టించింది. దీంతో ఆమె సంతోషానికి హద్దే లేకుండా పోయింది. భరణితో తన సంతోషాన్ని పంచుకుంటూ తాను 9వ వారమే ఎందుకు కెప్టెన్ కావాలనున్నదో వివరిస్తూ సీక్రెట్ సెంటిమెంట్ ను బయట పెట్టింది. ‘నేను బిగ్ బాస్ కు వెళ్తాను అని ఎప్పుడు అడిగినా నా ఫ్యామిలీ ఒప్పుకునేది కాదు. నువ్వు ఆడలేవు, 2 వారాల కంటే ఎక్కువ అక్కడ ఉండలేవు అంటూ ఛాలెంజ్ కూడా చేశారు. ఎట్టకేలకు 9వ సీజన్ లో బిగ్ బాస్ లోకి అడుగు పెట్టాను. అలాగే 9వ వారమే ఎందుకు కెప్టెన్ అవ్వాలి అనుకున్నా అంటే… ఇది ఫ్యామిలీ వీక్. అసలు ఇక్కడ ఉండలేవు అన్న నా కుటుంబానికి ఫ్యామిలీ వీక్ లో ఇన్ని రోజులు ఉన్నాను అని కెప్టెన్ గా చూపించాలి అనుకున్నా. కానీ ఇంకా కెప్టెన్ కాకపోవడంతో టెన్షన్ పడ్డా. చివరికి సాధించాను. 9 నా లక్కీ నెంబర్” అంటూ ఇంట్రెస్టింగ్ విషయాలను బయట పెట్టింది.

ఓవైపు ప్రేమ, మరోవైపు ఇదేంటి? 

Advertisement

ఇదంతా అయ్యాక తనూజా – కళ్యాణ్ మధ్య జరిగిన డిస్కషన్ ఆసక్తికరం. కళ్యాణ్ “అదేంటి మనం సాధించాము అని అందరి ముందు అలా అన్నావు? అందరూ నన్ను అదోలా చూస్తున్నారు. నేను ఒక్కడినే ఉన్నప్పుడు చెప్పొచ్చు కదా” అని కంగారుగా అడిగాడు. కానీ తనూజా అదేం పెద్ద మ్యాటరే కాదని లైట్ తీసుకుంది. ఆ తరువాత భరణి నిఖిల్ తో మాట్లాడుతూ తన కన్నింగ్ గేమ్ ను బయట పెట్టాడు. నేను బిగ్ బాస్ హౌస్ లోకి మళ్ళీ అడుగు పెట్టినప్పుడు స్ట్రెయిట్ గా తనూజా, దివ్యాలనే నామినేట్ చేయాలని వచ్చాను. కానీ ఒక్కరిని మాత్రమే నామినేట్ చేసే ఛాన్స్ వచ్చింది అంటూ చెప్పుకొచ్చాడు. మరి నామినేట్ చేయాలని మనసులో అంత పెట్టుకుని, ఆమె కెప్టెన్ కాగానే ఏమీ ఎరగనట్టు ఆ ఎత్తుకుని తిప్పడం ఏంటో ! ఈ ఒక్క ఎపిసోడ్ తో హౌస్ లో వీళ్లిద్దరి రిలేషన్ ఫేక్ అని తేలిపోయింది.

Read Also : ‘కాంత’ ఓటీటీ స్ట్రీమింగ్ డేట్… ఏ ఓటీటీలో ఎప్పుడు చూడొచ్చంటే ?

Related News

బిగ్ బాస్ 10 కంటెస్టెంట్ గా సుధీర్ రెడ్డి కన్ఫర్మ్…పోస్ట్ వైరల్!

బిగ్ బాస్ 10 ఫైనల్ కంటెస్టెంట్స్ లిస్ట్ లీక్..హౌస్ లోకి వెళ్లేది వీళ్ళే!

Bigg Boss 10 Telugu : బిగ్ బాస్ 10లోకి స్టార్ యాంకర్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Bigg Boss: విడాకులు ప్రకటించిన బిగ్ బాస్ విన్నర్ భార్య!

BiggBoss 10 : బిగ్ బాస్ లోకి క్రేజీ హీరోయిన్ ఎంట్రీ.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Ariana Glory : వామ్మో.. అరియనా నెలకు అన్ని లక్షలు సంపాదిస్తుందా..?

త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్న బిగ్ బాస్ బ్యూటీ.. వరుడు ఎవరంటే..?

Siri Hanumanth : యాంకర్ సిరి హనుమంత్ నెలకు ఎంత సంపాదిస్తుందో తెలుసా..?

Big Stories

Advertisement
×