BigTV English

జస్ట్ రూ.10 రెమ్యునరేషన్ తీసుకుని.. స్టార్ హీరోయిన్‌గా ఎదిగిన నటి, ఇప్పుడు రాజకీయాల్లోనూ స్టారే!

జస్ట్ రూ.10 రెమ్యునరేషన్ తీసుకుని.. స్టార్ హీరోయిన్‌గా ఎదిగిన నటి, ఇప్పుడు రాజకీయాల్లోనూ స్టారే!

Meet Actress Who Wanted To Become A Doctor: చాలా మంది నటీమణులు ఇంటర్వ్యూలలో తరచుగా ఓ మాట చెప్తుంటారు. డాక్టర్ కావాలనుకుని యాక్టర్ గా మారాం అంటుంటారు. ఇప్పుడు మనం చెప్పుకోబోయే హీరోయిన్ కూడా సేమ్ టూ సేమ్. డాక్టర్ కావాలని కలగని, చివరకు యాక్టర్ గా మారింది. 13 ఏళ్ల వయసులో నటిగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. తొలి సినిమాలో నటనకు గాను కేవలం రూ. 10 రెమ్యునరేషన్ తీసుకుంది. తెలుగు చిత్రంతో వెండితెరకు పరిచయమైన ఈ ముద్దుగుమ్మ, ఆ తర్వాత హిందీ పరిశ్రమలోకి అడుగు పెట్టింది. బాలీవుడ్ లో తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. అంతేకాదు, అత్యధిక రెమ్యునరేషన్ తీసుకునే హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది. 80వ దశకంలో బాలీవుడ్ ను షేక్ చేసి ఆమె, మూడు దశాబ్దాల పాటు హిందీ, తెలుగు, కన్నడ, బెంగాలీ, తమిళం, మలయాళం, మరాఠీతో సహా ఏడు భాషల్లో 300 సినిమాలు చేసింది.  సినిమా ఇండస్ట్రీలో రాణించడంతో పాటు రాజకీయాల్లోనూ అడుగు పెట్టింది. పలుమార్లు పార్లమెంట్ సభ్యురాలిగా ఎన్నికైంది. ఇంతకీ  ఆ నటీమణి ఎవరంటే..


ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్  గుర్తింపు..

తెలుగు సినిమాతో వెండితెరకు పరిచయమై.. ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా మారిన ఆ నటీమణి మరెవరో కాదు జయప్రద (Jaya Pradha). అమితాబ్ బచ్చన్, జితేంద్ర, వినోద్ ఖన్నా, ఎన్టీఆర్ లాంటి  అగ్రహీరోలతో కలిసి వందల సినిమాల్లో నటించింది. నిర్మాతలకు తొలి ఛాయిస్ గా మారడంతో పాటు, ఇండస్ట్రీలో అత్యధిక రెమ్యునరేషన్ తీసుకున్న నటిగా గుర్తింపు తెచ్చుకుంది. అలాంటి జయప్రద తన తొలి సినిమాకు కేవలం రూ. 10 రెమ్యునరేషన్ తీసుకున్నది. ఇండస్ట్రీలోకి రావడానికి మందు ఆమెకు డాక్టర్ కావాలనే కోరిక ఉండేది. బాగా చదివేది కూడా. కానీ, అనుకోకుండా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది.


ఆమె పెళ్లి కూడా సంచలనమే..

జయప్రద ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత చాలా మంది ఆమెను ఇష్టపడ్డారు. కానీ, స్టార్ హీరోయిన్ ఎదిగిన తర్వాత.. ఫిల్మ్ మేకర్ శ్రీకాంత్ నహతాను వివాహం చేసుకుంది. అప్పటికే నహతాకు పెళ్లై ముగ్గురు పిల్లలు ఉన్నారు. తొలి భార్యకు విడాకులు ఇవ్వకుండానే జయప్రదను రెండో పెళ్లి చేసుకున్నారు. అప్పట్లో ఈ వివాహం సినీ పరిశ్రమలో తీవ్ర వివాదానికి కారణం అయ్యింది. ఇండస్ట్రీ పెద్దలతో పాటు, సినీ అభిమానులు సైతం జయప్రద తీరుపై తీవ్ర విమర్శలు చేశారు.

Also Read: ఈ వారం సందడే సందడి.. థియేటర్ /ఓటీటీలో మొత్తం ఎన్ని సినిమాలు, సిరీస్‌లంటే?

శ్రీదేవితో జయప్రదకు గట్టి పోటీ

80వ దశకంలో జయప్రద, శ్రీదేవి మధ్యన ఇండస్ట్రీలో గట్టిపోటీ ఉండేది. సినిమాల పరంగానే కాదు, వ్యక్తి గతంగానూ ఇద్దరి మధ్య పచ్చిగడ్డి వేస్తే భగ్గున మండేది. కనీసం, సినిమా వేడుకల్లో ఎదురుపడినా పక్కకు వెళ్లిపోయేవాళ్లు. వారి శత్రుత్వం అప్పట్లో టాక్ ఆఫ్ ది టౌన్ గా ఉండేది. ‘మక్సాద్’ మూవీ షూటింగ్ టైమ్ లో రాజేష్ ఖన్నా, జితేంద్ర.. ఇద్దరు హీరోయిన్లను మేకప్ రూమ్‌ లో బంధించి వారు మాట్లాడుకునేలా చేశారు. కానీ, మేకప్ రూమ్ తలుపులు తీసే సమయానికి ఇద్దరూ, వెనుక తిరిగి కూర్చోవడంతో.. ఇక వీరిని కలపడం సాధ్యం కాదనుకున్నారు.  ఇక అద్భుత నటనతో సినీ పరిశ్రమలో జయప్రద మంచి గుర్తింపు తెచ్చుకున్నా, రాజకీయాల్లో తరచుగా పార్టీలు మారి విమర్శలకు గురైంది. వ్యక్తిగత జీవితంలో పెళ్లి విషయంలో పెద్ద ఎత్తున విమర్శల పాలైంది.

Related News

Film industry: కన్న తండ్రే కసాయి.. కొట్టి ఆ గాయాలపై కారం పూసేవాడు.. హీరోయిన్ ఆవేదన!

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Big Stories

×