BigTV English
Advertisement

Indraja: నేను సీఎం పెళ్ళాం అంటున్న ఇంద్రజ.. హీరోయిన్ గా రీఎంట్రీ

Indraja: నేను సీఎం పెళ్ళాం అంటున్న ఇంద్రజ.. హీరోయిన్ గా రీఎంట్రీ

Actor Ajay: నటుడు అజయ్ గురించి తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు.  విలన్ గా, సపోర్టివ్ రోల్స్ లో ఎన్నో మంచి సినిమాలలో నటించి మెప్పించాడు. విక్రమార్కుడు సినిమాలో  రవితేజకు ధీటైన విలనిజాన్ని చూపించి  ప్రేక్షకులను సైతం భయపెట్టాడు అజయ్.   ఇక ఎన్నో సినిమాల్లో నటించి మెప్పించిన అజయ్.. తాజాగా హీరోగా మారాడు. అజయ్,జయసుధ, సుమన్, ఇంద్రజ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి గడ్డం వెంకట రమణరెడ్డి దర్శకత్వ వహించగా.. ఆర్.కే సినిమాస్ బ్యానర్ పై బొల్లా రామకృష్ణ నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన  పోస్టర్స్  ఆకట్టుకున్నాయి . తాజాగా  ఈ సినిమా టీజర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు.  టీజర్ ఆద్యంతం ఆకట్టుకుంటుంది. ఇక ఈ టీజర్ లాంచ్ ఈవెంట్ ను  మేకర్స్ ఘనంగా నిర్వహించారు.


నటుడు సుమన్ మాట్లాడుతూ..  “సీఎం పెళ్లాం సినిమాలో నేను పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ చేశాను. రొటీన్ కు భిన్నమైన పాత్రలో కనిపిస్తా. చాలా మంచి స్క్రిప్ట్ ఇది. డైరెక్టర్ వెంకటరమణారెడ్డి పూర్తి స్క్రిప్ట్ తో ప్రతి డీటెయిల్ తో రెడీ అయ్యి సినిమా చేశారు. ఆయన డెడికేషన్ నాకు నచ్చింది. నాతో పాటు ఇంద్రజ, అజయ్ ప్రధాన పాత్రలు చేశారు. అజయ్ మంచి నటుడు, అతను ఇంకా గొప్ప పేరు తెచ్చుకోవాలని కోరుకుంటున్నా. ఇంద్రజ గతంలో నాతో పాటు హీరోయిన్ గా నటించింది. ఆమెతో మళ్లీ మూవీ చేయడం హ్యాపీగా ఉంది. చాలా మంచి ఆర్టిస్టులు ఈ సినిమాకు కుదిరారు. మన రాజకీయ, బ్యూరోక్రాట్ వ్యవస్థను ప్రశ్నిస్తూ ఒక మంచి మూవీ చేశారు దర్శకుడు గడ్డం వెంకటరమణ రెడ్డి. ఈ సినిమాకు మీ సపోర్ట్ అందిస్తారని ఆశిస్తున్నాని చెప్పాడు.

నటుడు అజయ్ మాట్లాడుతూ  .. ” సుమన్ గారు నా గురించి ఎంతో గొప్పగా చెప్పారు. ఆయనకు థ్యాంక్స్ చెబుతున్నా. సీఎం పెళ్లాం సినిమాలో నేను లీడ్ రోల్ చేశాను. ఇది మెసేజ్ ఓరియెంటెడ్ మూవీ. పాలిటిక్స్ ఇలా ఉంటే బాగుంటుంది, ఇలా ఉంటే సమాజానికి మంచి జరుగుతుంది అని చెప్పే చిత్రమిది. అలాగే మహిళా సాధికారత గురించి కూడా మా డైరెక్టర్ చూపించారు. మా డైరెక్టర్ గడ్డం వెంకటరమణ రెడ్డి గారి మంచితనం నన్ను ఆకట్టుకుంది. ఆయన నాకు క్లోజ్ ఫ్రెండ్ అయ్యారు. ఇంద్రజ గారు ఈ సినిమాలో హీరో అని చెప్పాలి. ఒక మంచి మూవీ చేశాం. మీరంతా ఆదరిస్తారని కోరుకుంటున్నా” అంటూ చెప్పుకొచ్చాడు.


నటి ఇంద్రజ మాట్లాడుతూ .. “సుమన్ గారితో ఎన్నో మూవీస్ చేశాను. ఆయన మంచి మనసు అప్పుడు ఇప్పుడూ ఒకేలా ఉంది. ఆయన అప్పటికే స్టార్ హీరో అయినా కొత్త హీరోయిన్ గా వచ్చిన నాతో ఎంతో గౌరవంగా మాట్లాడేవారు. సీఎం పెళ్లాం క్యారెక్టర్ లో సీఎం భార్య పాత్రలో నటించాను. ఈ పాత్రను నేను చేయగలను అని నాకు అవకాశం ఇచ్చిన దర్శకుడు గడ్డం వెంకటరమణరెడ్డికి థ్యాంక్స్ చెబుతున్నా. ఇదొక ప్రత్యేకమైన సినిమా. మంచి సందేశాన్ని ఇస్తుంది. దర్శకుడు బౌండెడ్ స్క్రిప్ట్ తో రూపొందించారు. ఈ సినిమాలో అజయ్ గారితో కలిసి నటించడం సంతోషంగా ఉంది. ఈ టీజర్ లాంఛ్ కు వచ్చి సపోర్ట్ చేస్తున్న అలీ గారికి థ్యాంక్స్. అలాగే ఈ సినిమా టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్ చెబుతున్నా” అని తెలిపింది.  త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.

Related News

Tejaswini Nandamuri: నందమూరి వారసురాలు వైరల్ యాడ్ డైరెక్టర్ ఎవరో తెలుసా? ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందా?

Film industry: ఘనంగా సినిమాటిక్ ఎక్స్ పో 3వ ఎడిషన్!

CM Revanth on Movie Tickets: సినిమా టికెట్ డబ్బుల్లో సినీ కార్మికులకు వాటా… సీఎం సంచలన ప్రకటన

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇల్లు చూడండి.. ఎంత అద్భుతంగా ఉందో!

Telugu Heroes : సినిమాలతో పాటు హోటల్స్… లగ్జరీ రెస్టారెంట్స్ ఉన్న హీరోలు వీళ్లే

Salman Khan: పాక్ ను కెలికిన సల్లు భాయ్.. తెలుగు సినిమాలు బాగా చూస్తారంటూ..

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Big Stories

×