BigTV English
Advertisement

K. Viswanath: కె.విశ్వనాథ్ బాల్య స్మృతులు ఇవే.. ఆయన మాటల్లోనే..

K. Viswanath: కె.విశ్వనాథ్ బాల్య స్మృతులు ఇవే.. ఆయన మాటల్లోనే..

K. Viswanath: దిగ్గజ దర్శకుడు, కళాతపస్వి కె. విశ్వనాథ్ అంటే తెలియని వారుండరు. తన సినిమాలతో తెలుగువారి గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్నారు.. విశ్వనాథ్. తెలుగు చిత్ర పరిశ్రమకు ఆయన చేసిన సేవ అంతా ఇంతా కాదు. చిన్నప్పటి నుంచే ఆయన అన్ని రంగాల్లో ముందుండేవారు. తన చురుకుతనాన్ని చూసి ఉపాధ్యాయులు ఒకటో తరగతి నుంచి మూడో తరగతికి ప్రమోట్ చేశారట.


‘‘నేను చిన్నప్పటి నుంచే చాలా చురుకుగా ఉండేవాడిని. ఉపాధ్యాయులు నన్ను ఒకటో తరగతి నుంచి మూడో తరగతికి ప్రమోట్ చేశారు. అప్పట్లో మా నాన్న నాకు ఓ సైకిల్ కొనిచ్చాడు. దానిపై తిరగడం అంటే.. ఇప్పుడు రోల్ రైడ్‌పై తిరిగినట్టే. అప్పుడప్పుడు స్నేహితులతో కలిసి పావురాలను పట్టడానికి వెళ్లేవాడిని. అప్పుడు మా నాన్న తిట్టేవాడు. ఇక ఇంటర్మీడియట్ గుంటూరులోని హిందూ కాలేజీలో చదివాను.

చదువు పూర్తయ్యాక ఏం చేయాలో తెలియని సమయంలో.. మాకు తెలిసిన వ్యక్తి అప్పుడే కొత్తగా వాహిని స్టూడియోను ప్రారంభించారు. మా నాన్న అందులో జాయిన్ చేశాడు. నా జీవితంలో ఏదీ ప్రణాళిక ప్రకారం జరగలేదు. అక్కినేని నాగేశ్వరరావు గారు ఒకసారి వాళ్ల కంపెనీకి రమ్మని పిలిచారు. వెల్లాలా వద్దా అని సందేహంలో ఉన్న సమయంలో చక్రపాణి గారు వెళ్లమని సలహా ఇచ్చారు. దర్శకత్వం అంటే కెమెరా ఎక్కడ పెట్టాలో కాదు.. కథను అరటిపండు ఒలిచి అందించినంత సులువగా చెప్పాలి అని చెప్పారు’’ అంటూ విశ్వనాథ్ ఓ సందర్భంలో చెప్పుకొచ్చారు.


కె. విశ్వనాథ్ 5దశాబ్దాల పాటు తెలుగు చిత్రసీమకు సేవలు అందించారు. ఆయన స్వస్థలం బాపట్ల జిల్లా రేపల్లెలోని పెద పులివర్రు గ్రామం. 1930 ఫిబ్రవరి 19న కాశీనాథుని సుబ్రహ్మణ్యం, సరస్వతమ్మ దంపతులకు విశ్వనాథ్‌ జన్మించారు. గుంటూరు హిందూ కళాశాలలో ఇంటర్ చదివారు. ఆంధ్రా క్రిస్టియన్‌ కళాశాలలో బీఎస్సీ పూర్తి చేశారు. ఆయన తండ్రి చెన్నైలోని విజయవాహినీ స్టూడియోలో పనిచేసేవారు. దీంతో విశ్వనాథ్‌ డిగ్రీ పూర్తవగానే అదే స్టూడియోలో సౌండ్‌ రికార్డిస్ట్‌గా సినీజీవితాన్ని ప్రారంభించారు. తొలిసారి పాతాళభైరవి సినిమాకు అసిస్టెంట్‌ రికార్డిస్ట్‌గా పనిచేశారు.

1965లో ‘ఆత్మగౌరవం’ సినిమాతో సినిమా ప్రస్థానాన్ని కె. విశ్వనాథ్ ప్రారంభించారు. ఆయన 50కి పైగా చిత్రాలకు దర్శకత్వం వహించారు. బాలీవుడ్‌లోనూ 9 చిత్రాలను తెరకెక్కించారు. నటుడిగానూ కె. విశ్వనాథ్ మెప్పించారు. ఎన్నో చిత్రాల్లో కీలక పాత్రలు పోషించారు. సాగర సంగమం, స్వాతిముత్యం, సిరిసిరిమువ్వ, శ్రుతిలయలు, సిరివెన్నెల, ఆపద్బాంధవుడు, శంకరాభరణం లాంటి సినిమాలు ఆయన ఎనలేని కీర్తిని సంపాదించిపెట్టాయి. ఎన్నో అవార్డులు, పురస్కారాలు కళాతపస్వి అందుకున్నారు.

Tags

Related News

Tejaswini Nandamuri: నందమూరి వారసురాలు వైరల్ యాడ్ డైరెక్టర్ ఎవరో తెలుసా? ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందా?

Film industry: ఘనంగా సినిమాటిక్ ఎక్స్ పో 3వ ఎడిషన్!

CM Revanth on Movie Tickets: సినిమా టికెట్ డబ్బుల్లో సినీ కార్మికులకు వాటా… సీఎం సంచలన ప్రకటన

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇల్లు చూడండి.. ఎంత అద్భుతంగా ఉందో!

Telugu Heroes : సినిమాలతో పాటు హోటల్స్… లగ్జరీ రెస్టారెంట్స్ ఉన్న హీరోలు వీళ్లే

Salman Khan: పాక్ ను కెలికిన సల్లు భాయ్.. తెలుగు సినిమాలు బాగా చూస్తారంటూ..

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Big Stories

×