E-Paper
Advertisement

Kanguva : సూర్యకు షాక్… మరో హీరో కారణంగా “కంగువ”కు తక్కువ స్క్రీన్లు

Kanguva : సూర్యకు షాక్… మరో హీరో కారణంగా “కంగువ”కు తక్కువ స్క్రీన్లు
Advertisement

Kanguva : కోలీవుడ్ స్టార్ సూర్య (Suriya)కు సొంత గడ్డపైనే ఎదురుదెబ్బ తగిలినట్టుగా ప్రచారం జరుగుతోంది. ‘కంగువ’ (Kanguva) సినిమాకు మరో హీరో కారణంగా అనుకున్నన్ని థియేటర్లు దక్కలేదు అన్నది ఆ ప్రచారంలో విన్పిస్తున్న కథ. మరి ఆ హీరో ఎవరు? ఆ హీరో వల్ల సినిమాపై ఎలాంటి ఎఫెక్ట్ పడింది? అనే వివరాల్లోకి వెళ్తే..

సూర్య హీరోగా నటిస్తున్న భారీ పాన్ ఇండియా ప్రాజెక్టు ‘కంగువ’ (Kanguva). భారీ అంచనాల నడుమ మోస్ట్ అవైటింగ్ మూవీ ‘కంగువ’ ఈ ఏడాది నవంబర్ 14 న విడుదల కానుంది. అయితే మూవీ రిలీజ్ కు ముందే ఇబ్బందులు ఎదుర్కొంటోంది. ‘కంగువ’ బాక్సాఫీస్ వసూళ్లను ప్రభావితం చేసే సవాళ్లను ఎదుర్కొంటోంది. తాజా సమాచారం ప్రకారం “అమరన్’ (Amaran) సక్సెస్ ఫుల్ గా ఇంకా థియేటర్లలో దూసుకెళ్తున్న కారణంగా, “కంగువ”కు అందుబాటులో ఉన్న స్క్రీన్లలో 50% మాత్రమే ఇచ్చారని తెలుస్తోంది. ‘కంగువ’ టీమ్‌ అడిగినప్పటికి అదనపు స్క్రీన్‌లు ఇవ్వడానికి ఎగ్జిబ్యూటర్లు నిరాకరించారని అంటున్నారు. ఇది ఖచ్ఛితంగా ‘కంగువా’ సినిమా కలెక్షన్లపై ఎఫెక్ట్ చూపిస్తుంది.

Advertisement

ఇలా ఎదురుదెబ్బ తగలడానికి ముఖ్యమైన కారణంగా ‘కంగువ’ (Kanguva) మూవీ రిలీజ్ డేట్ ను వాయిదా వేయడం అనే టాక్ నడుస్తోంది. ముందుగా ఈ సినిమాను దసరాతో కలిసి వచ్చే విధంగా అక్టోబర్ 10న రిలీజ్ చేయాలని ప్లాన్ చేశారు. కానీ అదే రోజు విడుదలైన ‘వేట్టయన్‌’ (Vettaiyan) తో క్లాష్ ను ఆపడానికి ‘కంగువ’ నిర్మాతలు తమ సినిమా విడుదలను వాయిదా వేశారు. ఈ సినిమాకు టీజే జ్ఞానవేల్ దర్శకత్వం వహించగా, రజనీకాంత్ హీరోగా నటించారు. ఈ మూవీ తెలుగులో పెద్దగా ఆడలేదు.

ఇక దీపావళి కానుకగా వచ్చిన ‘అమరన్’ (Amaran) మూవీ మంచి అంచనాలతో రిలీజై, మొదటి షోతోనే పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. శివ కార్తికేయన్, సాయి పల్లవి జంటగా నటించిన ఈ చిత్రం దీపావళికి విడుదలైన సినిమాల్లో విన్నర్ గా నిలిచింది. అంతేకాకుండా ‘అమరన్’ జోరు ఇంకా నడుస్తోంది. మొదట మూవీ రిలీజ్ ను వాయిదా వేయడం, రెండవది ‘అమరన్’ కారణంగా ‘కంగువ’ (Kanguva) కు తక్కువ థియేర్లు దొరకడం అన్నది సూర్యకు నెగెటివ్ గా మారే ఛాన్స్ ఉంది. ఇప్పటికే నిర్మాతలు ఇప్పటిదాకా తమిళ చిత్ర సీమ టచ్ చేయని 2000 కోట్ల టార్గెట్ లోటును ‘కంగువ’ తీరుస్తుంది అనే నమ్మకంతో ఉన్నారు. కానీ ఆదిలోనే ఆటంకం అన్నట్టుగా సినిమా రిలీజ్ కాకముందే అనుకున్నంతగా థియేటర్లు దొరకకపోవడం సూర్య ఫ్యాన్స్ ను నిరుత్సాహానికి గురి చేస్తోంది. మరి ఈ సమస్యను ‘కంగువ’ టీం ఎలా దాటుతుందో చూడాలి.

Advertisement

‘కంగువ’ (Kanguva) అనేది ఒక ఫాంటసీ పీరియాడిక్ యాక్షన్ చిత్రం. ఇందులో సూర్య ద్విపాత్రాభినయం చేస్తున్నారు. ఈ చిత్రం బాలీవుడ్ స్టార్స్ బాబీ డియోల్, దిశా పటానీలు లీడ్ రోల్స్ చేస్తున్నారు. వీళ్లిద్దరికీ ఇదే తమిళంలో మొదటి సినిమా. నటరాజన్ సుబ్రమణ్యం, యోగి బాబు, రెడిన్ కింగ్స్లీ, కోవై సరళ, ఆనందరాజ్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×