IPL 2025 Mega Auction: IPL 2025 వేలానికి సమయం దగ్గర పడుతోంది. అయితే… ఐపీఎల్ 2025 మెగా వేలం ( IPL 2025 Mega Auction )తేదీ దగ్గర పడుతున్న కొద్ది అభిమానుల్లో ఆసక్తి పెరుగుతోందన్న సంగత తెలిసిందే. ఈసారి వేలంలో కేఎల్ రాహుల్, రిషబ్ పంత్ వంటి ఆటగాళ్లు, అనుభవజ్ఞులైన వికెట్ కీపర్లు పాల్గొనబోతున్నారు. ఈ వేలంలో కేఎల్ రాహుల్ ( KL Rahul ), రిషబ్ పంత్ ( Rishabh Pant ) మాత్రమే కాకుండా మరో ప్రమాదకరమైన ఆటగాడు వస్తున్నారని తెలిసి అందరూ షాక్ అవుతున్నారు. ఈసారి వేలంలో ఫ్రాంచైజీలకు ఆటగాళ్ల కొరత ఉండే అవకాశం లేదు.
Also Read: IPL 2025 Auction: RCB కొత్త కెప్టెన్ అతనే…ఏకంగా రూ.20 కోట్లతో కొనుగోలు ?
చాలా మంది ఆటగాళ్లు ఉన్నారు. ఈసారి వేలంలో ఇంగ్లాండ్ దిగ్గజ క్రికెటర్ జోష్ బట్లర్ కూడా రూ. 2 కోట్ల కనీస ధరతో వేలంలో ఉండనున్నాడు. రాజస్థాన్ రాయల్స్ బట్లర్ ను రిటైన్ చేసుకోకపోవడంతో ఇతడు వేలానికి తన పేరును ఇవ్వడం జరిగింది. స్టార్ ఓపెనర్ బట్లర్ ఎంతటి విధ్వంసకర ఆటగాడో చెప్పనవసరం లేదు. కెప్టెన్ గా, ఓపెనర్ గా, వికెట్ కీపర్ గా మూడు పాత్రలు పోషించగల ఈ ఆటగాడి కోసం కొన్ని ఫ్రాంచైజీలు ఆసక్తి చూపే అవకాశాలు ఉన్నాయి.
Also Read: Sanjay Bangar: అబ్బాయి నుంచి అమ్మాయిగా మారిన సంజయ్ బంగర్ కొడుకు ?
బట్లర్ ప్రస్తుతం అత్యుత్తమ ఫామ్ లో లేకపోయినప్పటికీ అతని ట్రాక్ రికార్డు అద్భుతంగా ఉంది. దీంతో జట్లు పోటీపడే అవకాశాలు ఉన్నాయి. గత సీజన్ కు ముందు జరిగిన వేలంలో ఆసీస్ స్టార్ బౌలర్ మిచెల్ స్టార్క్ ని ( Mitechel Stark) కోల్కత్తా నైట్ రైడర్స్ ( KKR ) ఏకంగా రూ. 24.75 కోట్లకు దక్కించుకుంది. దీంతో ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత ఖరీదైన ఆటగాడిగా మిచెల్ స్టార్క్ నిలిచాడు. బట్లర్ ఇప్పుడు ఆ రికార్డును దాటే అవకాశాలు ఉన్నాయని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. బట్లర్ ( Butler ) ఈ లీగ్ లో 107 మ్యాచ్లు ఆడాడు. 147.53 స్ట్రైక్ రేటు రేట్ మరియు 38.11 సగటుతో 3,582 పరుగులు చేశాడు.
Also Read: Hardik – Axar: జాతీయ గీతాన్ని అవమానించిన హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్ !
అంతేకాదు ఐపీఎల్ లో 7 సెంచరీలు మరియు 19 అర్థసెంచరీలు చేశాడు. సీజన్లో 11 మ్యాచ్లలో 140.78 స్ట్రైక్ రేటుతో 359 పరుగులు చేశాడు. 2023లో 392 పరుగులు, 2022లో ఏకంగా 863 పరుగులు చేశాడు. మెగా వేలం నవంబర్ 24, 25వ తేదీలలో జరగనుంది. ఇందుకోసం భారీగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. విదేశీ ప్లేయర్లలో కగిసో రబడ కు ( Rabada ) మంచి రేటు వచ్చే ఛాన్స్ ఉంది. ఈ మధ్య కాలంలో రబడ పెద్దగా రాణించకపోయినా.. అతన్ని ఎక్కువ ధరకు కొంటారని చెబుతున్నారు. అటు మొన్నటి వరకు ముంబైకి ఆడిన గెరాల్డ్ కోయెట్జీ ( Gerald Coetzee).. ఈ సారి వేలంలో ఎక్కువ ధర పలికే ఛాన్స్ ఉంది. ఫిలిప్ సాల్ట్ కు ( Philip Salt ) కూడా భారీ ధర వచ్చే ఛాన్స్ ఉందట.