BigTV English

Complaint Against Posani: జనసేన ఫిర్యాదు, పోసాని అరెస్ట్‌కు రంగం సిద్ధం?

Complaint Against Posani: జనసేన ఫిర్యాదు, పోసాని అరెస్ట్‌కు రంగం సిద్ధం?

Complaint Against Posani: వైసీపీ హార్డ్ నేతలకు కష్టాలు మొదలయ్యాయా? ఆ పార్టీ రూలింగ్‌లో ఉండగా ఇష్టానుసారం రెచ్చిపోయారు. రోజుల ఎప్పుడు ఒకేలా ఉండవన్న విషయాన్ని మరిచిపోయారు. టైమ్ మారింది.. సోమవారం ఫిల్మ్‌మేకర్ ఆర్జీవీ కాగా, లేటెస్ట్ పోసాని కృష్ణమురళి వంతైంది. తూర్పు గోదావరి ఎస్పీకి జనసేన కార్యకర్తలు ఫిర్యాదు చేశారు. రేపో మాపో అరెస్ట్ ఖాయమనే ప్రచారం జోరుగా సాగుతోంది.


సెలబ్రిటీ హోదాలో ఏం మాట్లాడినా చెల్లుబాటు అవుతుందనే ధీమాతో సోషల్ మీడియా వేదికగా రెచ్చిపోయారు కొందరు. టీడీపీ అగ్రనేతలు, జనసేన ముఖ్యనేతలను సైతం టార్గెట్ చేశారు. చివరకు వారి కుటుంబసభ్యులను సైతం వదల్లేదు. వ్యక్తిగత విమర్శలతో వారి మనోభావాలతో ఆడుకున్నారు. మానసికంగా క్షోభకు గురి చేశారు.

సోషల్ మీడియాలో అసభ్యకర, అభ్యంతరకర పోస్టింగులు పెడుతూ మానసిక ఆనందాన్ని పొందారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వారిపై కేసులు నమోదు అవుతున్నాయి. సోమవారం డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మపై కేసు నమోదు అయ్యింది. లేటెస్ట్‌గా మరో సెలబ్రిటీ పోసాని వంతైంది.


జనసేన లీగల్ సెల్ నాయకులు వైసీపీ సీనియర్ నేత పోసాని కృష్ణమురళిపై తూర్పుగోదావరి జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు. గాంధీ జయంతి నాడు శ్రమదానం చేయాలని కార్యకరక్తలకు పిలుపునిచ్చిన పవన్ కల్యాణ్‌పై పోసాని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

ALSO READ: నన్ను ఎన్ కౌంటర్ చేసి, నా భార్యను.. వర్ర సంచలన కామెంట్స్..

పవన్ కళ్యాణ్‌తోపాటు ఆయన కుటుంబసభ్యులు, పార్టీ కార్యకర్తలు, మహిళా నేతలపై అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేశారన్నది ఫిర్యాదులో సారాంశం. గతంలో పోసానిపై నమోదైన కేసు విషయంలో అరెస్ట్ వారెంట్ ఇవ్వవలసిందిగా జనసేన లీగల్ సెల్, కార్యకర్తలు జిల్లా ఎస్పీకి వినతి పత్రాలు ఇచ్చారు. పెండింగ్‌లో ఉన్న కేసు గురించి డీటేల్స్ పరిశీలించిన తర్వాత తదుపరి చర్యలు ఉంటాయని పోలీసులు చెప్పారు.

 

Related News

Pulivendula Politics: పులివెందుల రాజకీయాలు.. 30 ఏళ్లలో రెండోసారి, ఓటర్లు ఫుల్‌ఖుషీ

Pawan Kalyan: రూటు మార్చిన పవన్.. నిన్న మామిడి.. నేడు చీరలు, రేపు?

AP Free Bus Scheme: ఏపీలో ఫ్రీ బస్ స్కీమ్.. ఆ బస్సు లెక్కితే ఉచిత ప్రయాణం ఉండదు

Chandrababu: మళ్లీ జన్మంటూ ఉంటే నాకు అక్కడ పుట్టాలని ఉంది -చంద్రబాబు

Jagan-Sharmila: అన్న పేరెత్తకుండా షర్మిల, చెల్లి పేరు లేకుండా జగన్ రక్షా బంధన్ ట్వీట్లు

AP villages: లం*జబండ.. ఇదేం ఊరండి బాబు, పేరు మార్చాలంటూ.. గ్రామస్తులు గోల!

Big Stories

×