BigTV English
Advertisement

AdiPurush : ‘ఆదిపురుష్’ ఐమ్యాక్స్ రిలీజ్ ఉందా..లేదా!

AdiPurush : ‘ఆదిపురుష్’ ఐమ్యాక్స్ రిలీజ్ ఉందా..లేదా!

AdiPurush : రామాయ‌ణం ఇతిహాసం ఆధారంగా రూపొందిన చిత్రం ‘ఆదిపురుష్’ (Adipurush). శ్రీరాముడిగా ప్రభాస్ (Prabhas) నటించిన ఈ చిత్రంలో కృతి స‌న‌న్ (Kriti Sanon) సీత‌గా క‌నిపించ‌నున్న సంగ‌తి తెలిసిందే. అలాగే లంకాధిప‌తి రావ‌ణాసురుడుగా సైఫ్ అలీఖాన్ (Saif Ali Khan) అల‌రించ‌బోతున్నారు. ఇది వ‌ర‌కు రూపొందిన రామాయ‌ణం ఆధారిత చిత్రాల క‌న్నా.. ‘ఆదిపురుష్’ డిఫ‌రెంట్‌గా ఉంటుంద‌న‌టంలో సందేహం లేదు. ఎందుకంటే ఇప్ప‌టి వ‌ర‌కు రిలీజైన ట్రైల‌ర్స్‌లోని యాక్ష‌న్ ఎలిమెంట్స్ వైవిధ్యంగా ఉండ‌ట‌మే అందుకు కార‌ణం.. ప్ర‌భాస్ కెరీర్‌లో భారీ బ‌డ్జెట్ మూవీగా రూ.500 కోట్ల‌తో రూపొందిన ఈ సినిమాను భారీ రేంజ్‌లోనే రిలీజ్ చేయ‌టానికి మేక‌ర్స్ ప్లాన్ చేశారు.


‘ఆదిపురుష్’ సినిమాను త్రీడీ మోష‌న్ క్యాప్చ‌ర్ టెక్నాల‌జీతో తెర‌కెక్కించారు ద‌ర్శ‌కుడు ఓం రౌత్‌. దీన్ని ఐమ్యాక్స్‌లో బిగ్ స్క్రీన్‌పై చూస్తే ఆ థ్రిల్లింగ్ మ‌రో లెవ‌ల్లో ఉంటుద‌న‌టంలో సందేహం లేదు. అయితే ఇండియ‌న్ ఐమ్యాక్స్ ప్రియుల‌కు ఇప్పుడ‌ది అందుబాటులో ఉండ‌టం లేద‌ట‌. ఎందుకంటే.. ఈ సినిమాను త్రీడీ టెక్నాల‌జీతో రిలీజ్ చేయ‌టానికి వార్న‌ర్ బ్ర‌ద‌ర్స్ ముందుకు వ‌చ్చారు. వాళ్లే ఐమ్యాక్స్ థియేట‌ర్స్‌ను ముందుగా బ్లాక్ చేస్తూ వ‌స్తున్నారు. దీంతో మ‌న మేక‌ర్స్ ఇండియాలో ఐమ్యాక్స్ రిలీజ్ బాధ్య‌త‌ల‌ను ప‌క్క‌న పెట్టేశార‌నే వార్త‌లు వినిపిస్తున్నాయి.

బాలీవుడ్ డైరెక్ట‌ర్ ఓం రౌత్ .. నిర్మాత భూష‌ణ్ కుమార్‌తో క‌లిసి టి సిరీస్ బ్యాన‌ర్‌పై ‘ఆదిపురుష్’ సినిమాను రూపొందించారు. నిజానికి ఈ ఏడాది సంక్రాంతికి రావాల్సిన సినిమా వి.ఎఫ్‌.ఎక్స్ విజువ‌ల్స్ ప‌నితీరు స‌రిగ్గా లేద‌ని విమ‌ర్శ‌ల‌ను ఎదుర్కొంది. దాంతో మేక‌ర్స్ సినిమా రిలీజ్‌ను జూన్ 16కి వాయిదా వేసి క‌రెక్ష‌న్స్ చేసి సినిమాను రిలీజ్ చేస్తున్నారు. భారీ ఎక్స్‌పెక్టేషన్స్ క్రియేట్ చేసుకున్న‌ ఈ సినిమా రిలీజ్ త‌ర్వాత ఎలాంటి రికార్డుల‌ను క్రియేట్ చేస్తుందో చూడాలి మ‌రి.


Related News

Tejaswini Nandamuri: నందమూరి వారసురాలు వైరల్ యాడ్ డైరెక్టర్ ఎవరో తెలుసా? ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందా?

Film industry: ఘనంగా సినిమాటిక్ ఎక్స్ పో 3వ ఎడిషన్!

CM Revanth on Movie Tickets: సినిమా టికెట్ డబ్బుల్లో సినీ కార్మికులకు వాటా… సీఎం సంచలన ప్రకటన

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇల్లు చూడండి.. ఎంత అద్భుతంగా ఉందో!

Telugu Heroes : సినిమాలతో పాటు హోటల్స్… లగ్జరీ రెస్టారెంట్స్ ఉన్న హీరోలు వీళ్లే

Salman Khan: పాక్ ను కెలికిన సల్లు భాయ్.. తెలుగు సినిమాలు బాగా చూస్తారంటూ..

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Big Stories

×