Odela 2.. ఈమధ్య కాలంలో సీనియర్ హీరోయిన్స్ అందరూ కూడా లేడీ ఓరియంటెడ్ చిత్రాలతో బౌన్స్ బ్యాక్ అయ్యే ప్రయత్నం చేస్తున్నారు.ముఖ్యంగా హీరోలతో సంబంధం లేకుండా మంచి కంటెంట్ దొరికితే విజృంభించిపోతున్నారు. అంతేకాదు తమకంటూ స్టార్ ఇమేజ్ సొంతం చేసుకోవడమే కాదు సోలో సక్సెస్ కొట్టాలని కూడా ప్రయత్నం చేస్తున్నారు. ఇక అందులో భాగంగానే నయనతార (Nayanthara) ‘మూకుత్తి అమ్మన్ 2’ సినిమాతో మళ్లీ సత్తా చాటడానికి సిద్ధమవుతుండగా.. అటు తమన్నా భాటియా(Tamannaah Bhatia) కూడా అదే రూట్ లో పయనిస్తోంది. ఈ మిల్క్ బ్యూటీ ఇప్పుడు ఒక డివోషనల్ థ్రిల్లర్ లో నాగ సాధ్వి గా కనిపించనుంది.
‘ఓదెల 2’ తో నాగసాధ్విగా మారిన తమన్నా..
ఇక అసలు విషయంలోకెళితే.. ‘ఓదెల రైల్వే స్టేషన్’ సినిమాకి సీక్వెల్ గా వస్తున్న ‘ఓదెల 2’ సినిమాలో నటిస్తోంది. ముఖ్యంగా ఇందులో శివ భక్తురాలిగా కనిపించబోతోంది తమన్నా. అయితే ఇలా కనిపించడం కోసం తమన్నా లుక్ తో పాటు బాడీ లాంగ్వేజ్ కోసం కూడా చాలా కష్టపడినట్లు సమాచారం. అశోక్ తేజ (Ashok Teja) దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాకి కాంతారా (Kantara ) ఫేమ్ అజనీష్ లోకనాథ్ (Ajaneesh Loknath) సంగీతం అందిస్తున్నారు. ఈసారి తమన్నా ఈ సినిమాతో స్ట్రాంగ్ హిట్ కొట్టాలని ప్రయత్నం చేస్తోంది. ముఖ్యంగా ఈ సినిమా తమన్నా కెరియర్ ను డిసైడ్ చేస్తుంది అనడంలో సందేహం లేదు. ఎందుకంటే ఇటీవల ఈమె చేసిన పలు సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద అంచనాలను అందుకోలేకపోయాయి.. అటు ఓటీటీలో కూడా కొన్ని ప్రయత్నాలు చేసినా.. ఫలితాలు మాత్రం మిశ్రమంగానే నిలిచాయి. అందుకే సంపత్ నంది(Sampath Nandi) రచనా, దర్శకత్వ పర్యవేక్షణలో వస్తున్న ‘ఓదెల 2’ సినిమాపై ఈసారి భారీ నమ్మకంతోనే వుంది తమన్నా..
‘ఓదెల 2’ రిలీజ్ డేట్ లాక్..
ఇక ఆమె నమ్మకం నిజమై.. ఈ సినిమా విజయం సాధిస్తే మాత్రం.. తమన్నా మళ్లీ టాప్ లోకి వెళ్తుందని ట్రేడ్ వర్గాలు కూడా చెబుతున్నాయి. మరి తమన్నా ఈ సినిమాతో ఎలాంటి విజయాన్ని అందుకోబోతుందో చూడాలి. ఇదిలా ఉండగా ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించి ఇప్పుడు రిలీజ్ డేట్ ను మేకర్స్ లాక్ చేశారు. ఏప్రిల్ 17వ తేదీన సమ్మర్ సెలవులు మొదలయ్యే సమయంలో.. అటు విద్యార్థులకు కూడా కాస్త ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలన్న ఉద్దేశంతోనే ఈ డేట్ ను ఫిక్స్ చేసుకున్నట్లు సమాచారం. ముఖ్యంగా ఈ వేసవిలో పెద్దగా భారీ సినిమాల విడుదల లేకపోవడంతో ఒక డివైన్ బ్యాక్ డ్రాప్ కథా చిత్రం మంచి కలెక్షన్లు రాబట్టే అవకాశం ఉంది అని చెప్పవచ్చు.
తమన్నాకు సక్సెస్ లభిస్తుందా..?
ఇకపోతే ఏప్రిల్ మధ్యలో నుంచి టార్గెట్ ఆడియన్స్..థియేటర్ల వైపు మొగ్గు చూపే అవకాశం కూడా ఎక్కువగానే ఉంది. ఇకపోతే ఈ సినిమా పోస్టర్లో తమన్నా లుక్ చాలా ఇంటెన్స్ గా ఉండగా.. ఆమె సగం ముఖం మాత్రమే రివీల్ చేశారు. బ్యాక్ డ్రాప్ లో ఆలయ నిర్మాణాలు, రక్తసిక్త లో, ఆధ్యాత్మికంగా, టెర్రిఫిక్ గా కూడా కనిపిస్తోంది.మొత్తానికైతే హెబ్బా పటేల్ (Hebba Patel) ,తమన్నా నటిస్తున్న ఈ సినిమా మాస్ మిస్టిక్ థ్రిల్లర్ మూవీగా రాబోతోంది. డి.మధు నిర్మాణంలో మధు క్రియేషన్స్, సంపత్ నంది టీం వర్క్స్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈసారి తమన్నా పాత్ర కేవలం గ్లామర్ కే పరిమితం అవ్వకపోవడం విశేషం అనే చెప్పాలి. మరి ఇలాంటి పాత్రలతో తమన్న ఏ విధంగా ఆకట్టుకుంటుందో చూడాలి.