BigTV English
Advertisement

Delimitation MK Stalin: సొంత దేశంలోనే రాజకీయ అధికారాలు కోల్పోతాం.. డీలిమిటేషన్‌పై స్టాలిన్ ప్రసంగం

Delimitation MK Stalin: సొంత దేశంలోనే రాజకీయ అధికారాలు కోల్పోతాం.. డీలిమిటేషన్‌పై స్టాలిన్ ప్రసంగం

Delimitation Tamil Nadu MK Stalin| లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన (Delimitation)లో దక్షిణ భారత రాష్ట్రాలకు అన్యాయం జరుగుతోందనే అంశంపై చర్చించేందుకు తమిళనాడు రాజధాని చెన్నైలో అధికార పార్టీ అయిన డీఎంకే ఆధ్వర్యంలో అఖిలపక్ష సమావేశం శనివారం ప్రారంభమైంది. ఈ సమావేశంలో తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్ మాట్లాడారు. జనాభా ఆధారిత పునర్విభజన వల్ల దక్షిణ భారత రాష్ట్రాలకు చట్టాల రూపకల్పనలో ప్రాతినిధ్యం తగ్గుతుందని ఆయన ఆరోపించారు. సొంత దేశంలోనే మనం రాజకీయ అధికారాన్ని కోల్పోయిన పౌరులుగా మిగిలిపోతామని అన్నారు.


‘‘డీలిమిటేషన్‌పై ఈ అఖిలపక్ష సమావేశం చరిత్రాత్మకంగా నిలిచిపోతుంది. ప్రస్తుత జనాభా ప్రకారం నియోజకవర్గాల పునర్విభజన జరగకూడదు. దీన్ని మనమంతా వ్యతిరేకించాలి. పార్లమెంట్‌లో మన ప్రాతినిధ్యం తగ్గితే, అభిప్రాయాలను వ్యక్తీకరించే బలం కూడా తగ్గుతుంది. కేంద్రం నుంచి రాష్ట్రాలకు వచ్చే నిధుల కోసం మనం పోరాటం చేయాల్సి వస్తుంది. మన సమ్మతి లేకుండానే చట్టాలు రూపొందుతాయి. ఆ నిర్ణయాలు మన ప్రజలపై ప్రభావం చూపుతాయి. విద్యార్థులు అవకాశాలు కోల్పోవాల్సి వస్తుంది. రైతులకు మద్దతు తగ్గుతుంది. మన సంప్రదాయాలు, వృద్ధి ప్రమాదంలో పడతాయి. సామాజిక న్యాయం దెబ్బతింటుంది. ఈ కొత్త పరిణామాలతో సొంత దేశంలోనే మనం రాజకీయ అధికారాన్ని కోల్పోయిన పౌరులుగా మిగిలిపోతాం’’ అని సిఎం స్టాలిన్ వ్యాఖ్యానించారు.

Also Read: అవినీతిని కప్పిపుచ్చడానికే హిందీ వివాదం.. స్టాలిన్ ప్రభుత్వంపై అమిత్ షా సీరియస్


తమ నిరసన పునర్విభజనకు వ్యతిరేకంగా కాదని స్టాలిన్ ఈ సందర్భంగా స్పష్టం చేశారు. న్యాయబద్ధంగా, పారదర్శకంగా డీలిమిటేషన్‌ చేయాలనే తాము డిమాండ్‌ చేస్తున్నట్లు తెలిపారు. అంతకుముందు తమిళనాడు ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్ మాట్లాడుతూ.. ‘‘జనాభా పెరుగుదలను అరికట్టేందుకు కొన్ని దశాబ్దాలుగా పలు దక్షిణ భారత రాష్ట్రాలు కీలక చర్యలు చేపడుతున్నాయి. ఇందుకోసం అనేక విధానాలు కూడా తీసుకొచ్చాం. కానీ, కొన్ని రాష్ట్రాల్లో మాత్రం జనాభా వృద్ధి విపరీతంగా ఉంది. జనాభా నియంత్రణపై మన చర్యలకు ఎలాంటి రివార్డ్‌ లభించలేదు సరికదా, ఇప్పుడు రాజకీయ ప్రాతినిధ్యం కోల్పోయే ప్రమాదంలో పడ్డాం’’ అని అన్నారు.

చెన్నై వేదికగా తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్ నేతృత్వంలో ఏర్పాటుచేసిన ఈ సమావేశంలో పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, విపక్ష నేతలు హాజరయ్యారు. తెలంగాణ నుంచి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్‌, బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ పాల్గొన్నారు. పంజాబ్‌, కేరళ రాష్ట్రాల ముఖ్యమంత్రులు భగవంత్‌ మాన్‌, పినరయి విజయన్‌, శిరోమణి అకాలీదళ్‌ అధ్యక్షుడు బల్వీందర్‌ సింగ్‌, కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌ తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. డీలిమిటేషన్‌ విషయంలో దక్షిణ భారత రాష్ట్రాలకు అన్యాయం జరిగేలా కేంద్రంలోని బిజేపీ ప్రభుత్వం కుట్ర చేస్తోందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఇంతకుముందు కూడా చెప్పారు. అయితే ఈ సమావేశంలో ఆంధ్ర ప్రదేశ్ తరపున ఏ పార్టీ రాకపోవడం గమనార్హం. అధికారంలోని టిడిపి, జనసేన పార్టీలు బిజేపీతో కూటమిలో ఉండగా.. రాష్ట్ర అధికారాల కోసం వైసీపీ కూడా హాజరుకాకపోవడం ఆశ్చర్యకరం.

మరోవైపు ఈ సమావేశంపై బిజేపీ విమర్శలు చేసింది. నేతలు తమ అవినీతిని కప్పిపుచ్చుకునేందుకే ఈ సమావేశం నిర్వహిస్తున్నారని బిజేపీ నాయకురాలు తమిళిసై సౌందరరాజన్‌ ఆరోపించారు. కావేరీ జలాలు, ఇతర కీలక అంశాలపై ఇలాంటి అఖిలపక్ష సమావేశాలు ఎందుకు నిర్వహించట్లేదని ఆమె ప్రశ్నించారు.

Related News

Chhattisgarh: ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్ కౌంటర్.. నలుగురు మావోయిస్టులు మృతి

Pawan Vijay: పవన్ చేసిన ధైర్యం విజయ్ చేయలేక పోతున్నారా?

Project Vishnu: భారత్ బ్రహ్మాస్త్రం రెడీ.. విష్ణు మిసైల్ స్పెషాలిటీస్ ఇవే..

Vote Chori: ఓటు చోరీ వ్యవహారం.. రంగంలోకి బ్రెజిల్ మోడల్ లారిస్సా, ఇంతకీ మోడల్ ఏమంది?

Bihar Assembly Election 2025: బీహార్‌ తొలి విడత పోలింగ్‌.. 121 స్థానాలకు బరిలో 1,314 మంది

Delhi Air Pollution: వాయు కాలుష్యంతో దిల్లీ ఉక్కిరిబిక్కిరి.. సాయం చేసేందుకు ముందుకొచ్చిన చైనా

TVK Vijay: ఒంటరిగానే బరిలోకి టీవీకే.. సీఎం అభ్యర్థిగా హీరో విజయ్

UP Minor Girl: ఫాలోవర్స్ పెంచుకునేందుకు హిందూ దేవుళ్లపై చీప్ కామెంట్స్, టీనేజర్ తోపాటు పేరెంట్స్ అరెస్ట్!

Big Stories

×