Jaat Movie Trailer :ప్రముఖ హీరోయిన్ రెజీనా కసాండ్రా (Regina Cassandra)గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈమె ఒకప్పుడు భారీ క్రేజ్ దక్కించుకొని ఇప్పుడు సరైన అవకాశాల కోసం ఎదురుచూస్తోంది. ఇక ఇటీవలే వెబ్ సిరీస్ లతో ప్రేక్షకులను అలరిస్తున్న ఈమె.. చివరిగా హాలీవుడ్ స్టార్ హీరో అజిత్ త్రిష కాంబినేషన్ లో వచ్చిన విదాముయార్చి లో యాక్షన్ హీరో అర్జున్ కి జోడిగా నటించి ఆకట్టుకుంది. ఇక ఇప్పుడు బాలీవుడ్లో అవకాశాల కోసం ప్రయత్నం చేస్తున్న ఈమె ఇప్పుడు జాట్ అనే హిందీ యాక్షన్ థ్రిల్లర్ మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
గోపీచంద్ డైరెక్షన్లో జాట్.. జాక్ పాట్ కొడతారా..
గోపీచంద్ మలినేని (Gopichand Malineni) రచన,దర్శకత్వంలో.. మైత్రి మూవీ మేకర్స్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంయుక్తంగా నిర్మిస్తున్నారు ఇక ఈ సినిమాలో రెజీనా కసాంద్ర మహిళా ప్రధాన పాత్రలో నటిస్తుండగా.. సన్నీ డియోల్ (Sunny Deol) ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. అలాగే బాలీవుడ్ ప్రముఖ నటుడు రణదీప్ కూడా ప్రధాన ప్రతి నాయకుడిగా నటిస్తున్నారు. ఇకపోతే ఏప్రిల్ 10వ తేదీన థియేటర్లలోకి రాబోతున్న నేపథ్యంలో ఈ సినిమాకు సంబంధించి ఈ సినిమాకు సంబంధించి ట్రైలర్ ను తాజాగా చిత్ర బృందం విడుదల చేశారు. మరి సన్నీడియోల్, రెజీనా కసాండ్ర కాంబినేషన్లో వస్తున్న ఈ సినిమా ట్రైలర్ ప్రేక్షకులను ఏ విధంగా ఆకట్టుకుంది? ఇందులో ఉండే హైలెట్స్ ఏంటి? అనే విషయం ఇప్పుడు చూద్దాం.
ఆకట్టుకుంటున్న జాట్ ట్రైలర్..
ఇకపోతే ప్రస్తుతం హిందీలో విడుదల చేసిన ఈ ట్రైలర్ ఇటు దక్షిణాది ఆడియన్స్ ని కూడా విపరీతంగా ఆకట్టుకుంటోంది. తాజాగా ఈ సినిమా హిందీ ట్రైలర్ ని చూస్తే ఇందులో పవర్ ఫుల్ డైలాగ్ లతో పాటు యాక్షన్ సన్నివేశాలతో ట్రైలర్ సాగింది. ముఖ్యంగా ఇందులోని డైలాగ్స్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. “ఈ లంకలోకి అడుగు పెట్టేందుకు భగవంతుడే కాదు రావణుడు కూడా భయపడతాడు” అంటూ ప్రతి నాయకుడు పాలించే ప్రాంతం గురించి రెజినా చెప్పిన డైలాగ్స్ బాగా ఆకట్టుకున్నాయి. ఇక తర్వాత..”నిన్ను, నీలంకను వదిలిపెట్టే ప్రసక్తే లేదు.. ఈ చేతికి ఉన్న పవర్ ఏంటో ఇప్పటివరకు మొత్తం ఉత్తరాది చూసింది. ఇప్పుడు దక్షిణాది చూస్తుంది” అంటూ సన్నీడియోల్ చెప్పిన పవర్ ఫుల్ డైలాగ్స్ కూడా థియేటర్లలో అభిమానుల చేత ఈలలు వేయించేలా ఉన్నాయి. ఏప్రిల్ 10వ తేదీన విడుదల కాబోతున్న ఈ సినిమాపై ఈ ట్రైలర్ భారీగా అంచనాలు పెంచేసిందని చెప్పవచ్చు. ఇప్పటికే ప్రముఖ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న సన్నీ డియోల్ వరుస చిత్రాలతో భారీ విజయాన్ని సొంతం చేసుకుంటున్న విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు ఈ జాట్ చిత్రంతో ఉత్తరాదిని కాదు దక్షిణాదిని ఏలేయాలని ప్రయత్నం చేస్తున్నారు. మరి సన్నీ డియోల్ కి ఈ సినిమా ఎలాంటి సక్సెస్ అందిస్తుందో చూడాలి. ఇకపోతే అటు రెజినా కసాండ్రా కూడా ఈ సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకొని అక్కడ పాగా వేయాలని చూస్తోంది. మరి వీరందరికీ ఈ సినిమా ఫలితం ఎలాంటి క్రేజ్ అందిస్తుందో చూడాలి.