MAD Square Censor : చిన్న సినిమాగా రిలీజ్ అయ్యి, బాక్సులు బద్దలు కొట్టిన సూపర్ హిట్ మూవీ ‘మ్యాడ్’ (MAD). ఈ మూవీకి సీక్వెల్ గా మరో నాలుగు రోజుల్లో బిగ్ స్క్రీన్ పైకి రాబోతోంది ‘మ్యాడ్ స్క్వేర్’ (MAD Square). మార్చ్ 28న రిలీజ్ కాబోతున్న ఈ సినిమా నిర్మాణానంతర పనులను శర వేగంగా పూర్తి చేసుకుంటుంది. ఈ నేపథ్యంలోనే తాజాగా సెన్సార్ కూడా పూర్తయింది. మరి ‘మ్యాడ్ స్క్వేర్’ మూవీ సెన్సార్ రిపోర్ట్ ఏంటి ? అనే వివరాల్లోకి వెళితే…
సెన్సార్ కి కూడా ప్రమోషన్లు
‘మ్యాడ్ స్క్వేర్’ మూవీలో నార్నే నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్ లు హీరోలుగా నటిస్తున్నారు. కళ్యాణ్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీకి నాగ వంశీ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. బీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నారు. ఈ మోస్ట్ అవైటింగ్ మూవీ మార్చ్ 28న థియేటర్లలోకి రాబోతోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది ఈ మూవీ.
రిలీజ్ డేట్ దగ్గర పడుతుండడంతో సరికొత్తగా ప్రమోషన్స్ చేస్తూ, యూత్ దృష్టిని ఆకట్టుకుంటున్నారు ‘మ్యాడ్ స్క్వేర్’లో నటించిన ముగ్గురు యంగ్ హీరోలు. అదేవిధంగా తాజాగా సెన్సార్ కార్యక్రమాలు కూడా పూర్తయ్యాయి అన్న విషయాన్ని ఓ స్పెషల్ వీడియో ద్వారా వెల్లడించారు. ఆ వీడియోలో సినిమాకు U/A సర్టిఫికెట్ వచ్చింది అన్న విషయాన్ని అఫీషియల్ గా అనౌన్స్ చేశారు.
అవి లేకపోతే కుర్రాళ్లకు ఎక్కుద్దా ?
సాధారణంగా యూత్ ఫుల్ సినిమాలు అనగానే ఇటీవల కాలంలో కొన్ని సినిమాలలో ఎక్కువగా బూతులు, అతిగా రొమాంటిక్, వయోలెన్స్ ఇలాంటి సన్నివేశాలను చూపిస్తున్నారు. ‘మ్యాడ్ స్క్వేర్’ మూవీలో మాత్రం అవేమీ లేకుండా క్లీన్ యూ/బై సర్టిఫికెట్ రావడంతో చిన్నా పెద్దా అందరూ కలిసి సరదాగా చూడగలిగే విధంగా మూవీ ఉంటుందన్న విషయం పై క్లారిటీ వచ్చింది. కానీ ఇవన్నీ లేకపోతే అసలు యూత్ కి ఎక్కుద్దా? అనే అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు నెటిజన్లు. ఇప్పటికే నిర్మాత నాగవంశీ ‘మ్యాడ్ స్క్వేర్’లో కథ ఉండదు, లాజిక్ ఉండదు, కేవలం ఎంటర్టైన్మెంట్ కావాలి అనుకునే వారు మాత్రమే ఈ మూవీని చూడాలని చెప్పేశారు. అంతేకాదు ‘మ్యాడ్ స్క్వేర్’ కడుపుబ్బా నవ్వించడం ఖాయమని హామీ కూడా ఇచ్చారు.
‘మ్యాడ్ స్క్వేర్’ రన్ టైమ్
ఇక ‘మ్యాడ్ స్క్వేర్’ సెన్సార్ టాక్ తో పాటు ఈ మూవీ రన్ టైం కూడా సినిమాపై అంచనాలను పెంచుతోంది. ఈ ఫుల్ లెన్త్ కామెడీ ఎంటర్టైనర్ మరీ లెంగ్త్ గా లేకుండా, సింపుల్ గా క్రిస్పీగా ఉండేలా ప్లాన్ చేశారు మేకర్స్. ఈ మూవీ కేవలం 2 గంటల 7 నిమిషాల రన్ టైం మాత్రమే ఉందని తెలుస్తోంది. ఇలా మొత్తానికి మూవీ సెన్సార్ రిపోర్ట్ పాజిటివ్ గా ఉండగా, రన్ టైమ్ ప్లస్ పాయింట్ అని చెప్పవచ్చు. ‘మ్యాడ్ స్క్వేర్’ పేరుతో ఈ ముగ్గురు కుర్రాళ్ళు చేసే రచ్చ ప్రేక్షకులను ఎంత వరకు ఆకట్టుకుంటుంది అనేది చూడాలి.
Manaki yedi thinnaga jaragavu gaa…
Idhi anthe …Mission Censor: Completed ☑️#MADSquare certified U/A for a fun packed theatrical ride ❤️
Theatres lo kooda anni light lu velige entertainment tho siddam 😎
In cinemas worldwide from MARCH 28th! 🥳@NarneNithiin… pic.twitter.com/HRDODIX4ib
— Sithara Entertainments (@SitharaEnts) March 24, 2025