BigTV English

Jabardast Abhi: బలగం వేణు బాటలో మరో కమెడియన్.. మైథాలజీ సిరీస్ తో ఇండస్ట్రీలోకి అడుగు..!

Jabardast Abhi: బలగం వేణు బాటలో మరో కమెడియన్.. మైథాలజీ సిరీస్ తో ఇండస్ట్రీలోకి అడుగు..!

Jabardasth Abhi: ప్రముఖ బుల్లితెర ఛానల్లో దాదాపు దశాబ్ద కాలానికి పైగా.. నిర్విరామంగా ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తున్న ఏకైక కామెడీ షో జబర్దస్త్ (Jabardasth). ఇప్పటికే ఈ షోలో కమెడియన్స్ గా పాల్గొన్న ఎంతోమంది వెండితెరపై కూడా నటిస్తూ భారీ పాపులారిటీ సొంతం చేసుకున్నారు. ముఖ్యంగా జబర్దస్త్ లో కమెడియన్స్ గా పని చేసిన వారిలో కొంతమంది హీరోలుగా, మరికొంతమంది కమెడియన్స్ గా, ఇంకొంతమంది డైరెక్టర్స్ గా కూడా మారి సంచలనం సృష్టిస్తున్నారు. ఇక యాంకర్ గా మంచి పేరు దక్కించుకున్న అనసూయ(Anasuya )కూడా ఇప్పుడు పాన్ ఇండియా సెలబ్రిటీ అయిపోయింది. ‘పుష్ప'( Pushpa)చిత్రంతో భారీ పాపులారిటీ అందుకున్న ఈ అమ్మడు.. ఈ సినిమా సీక్వెల్ ‘పుష్ప 2’ చిత్రంతో మరోసారి ఆకట్టుకోబోతోంది.


బలగం వేణు బాటలో అదిరే అభి..

ఇకపోతే జబర్దస్త్ ద్వారా కమెడియన్ గా పేరు సొంతం చేసుకున్న ఎల్దండి వేణు (Yeldandi Venu ) ‘బలగం'(Balagam )సినిమా చేసి బలగం వేణుగా పేరు మార్చుకున్నారు. తక్కువ బడ్జెట్ తో వచ్చి భారీ పాపులారిటీ అందుకుని, అనేక అవార్డులు కూడా అందుకుంది. ఇక ఇటీవల చిన్నపిల్లలతో స్కిట్స్ చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్న రాకింగ్ రాకేష్ (Rocking Rakesh) కూడా కేసీఆర్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఇక ఇప్పుడు మరో కమెడియన్ ఇండస్ట్రీలోకి రాబోతున్నారు. ఆయనే అదిరే అభి (Adhire Abhi). హైపర్ ఆది(Hyper Adhi)తో పాటు చాలామందికి జబర్దస్త్ ద్వారా ఒక జీవితాన్ని ప్రసాదించి ఇప్పుడు ఇండస్ట్రీ పై ఫోకస్ చేసిన అదిరే అభి తాజాగా డైరెక్టర్ గా మారబోతున్నారు.


చిరంజీవ వెబ్ సిరీస్ తో డైరెక్టర్ గా అడుగు..

ప్రముఖ ఆహా ఓటీటీ వేదికగా మైథాలజీ సిరీస్ తో అదిరే అభి డిసెంబర్ 2024న ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ వెబ్ సిరీస్ కి సంబంధించిన పోస్టర్ తాజాగా అధికారికంగా విడుదలైంది. ఈ పోస్టర్లో ఒక శక్తివంతమైన దున్నరాజు శివ నామాలతో కనిపించారు. అదే పోస్టర్ లో ఒక యువకుడు రోడ్డు మీద దానికి ఎదురుగా నిలబడి కనిపిస్తున్నాడు. ఆహా ఒరిజినల్ వెబ్ సిరీస్ గా రాబోతున్న ఈ సిరీస్ కి ‘చిరంజీవ’ (Chiranjeeva)అనే టైటిల్ ని కూడా ఫిక్స్ చేసినట్లు సమాచారం. కమెడియన్ గా పేరు దక్కించుకున్న అదిరే అభి ఇప్పుడు డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నారని తెలిసి అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఏ.రాహుల్ యాదవ్, సుహాసిని రాహుల్ నిర్మిస్తున్న ఈ సీరీస్ కి అచ్చు రాజమణి సంగీతం అందిస్తూ ఉండగా.. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడిస్తామని మేకర్స్ కూడా స్పష్టం చేశారు.

సక్సెస్ అవ్వాలని కోరుతున్న ఫ్యాన్స్..

ఇకపోతే తమలోని కామెడీని బయటికి తీసి ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ కమెడియన్స్, ఇప్పుడు తమలోని ఇంకో యాంగిల్ ని కూడా బయటకి తీస్తూ మంచి పాపులారిటీ సొంతం చేసుకుంటున్నారు. ఏది ఏమైనా వేణు డైరెక్టర్ గా సక్సెస్ అయి ఇప్పుడు మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. అలాగే అదిరే అభి కూడా ఈ వెబ్ సిరీస్ తో డైరెక్టర్ గా తనను తాను ప్రూవ్ చేసుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు.

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×