E-Paper
Advertisement

Jagapathi Babu: ఓవర్ యాక్షన్ చేశా.. ఎలా ఉంది

Jagapathi Babu: ఓవర్ యాక్షన్ చేశా.. ఎలా ఉంది
Advertisement

Jagapathi Babu:  విలక్షణ నటుడు జగపతి బాబు గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం విలన్ రోల్స్ లో.. సపోర్టివ్ రోల్స్ లో అదరగొట్టేస్తున్నాడు. ఒకప్పుడు హీరోగా ఎంత పేరు తెచ్చుకున్నాడో.. ఇప్పుడు  విలన్ గా కూడా అంతే పేరును తెచ్చుకుంటున్నాడు. ఈ మధ్యనే  కన్నడ మూవీ కాటేరా లో  ఆయన విలనిజానికి ఐఫా  అవార్డు లభించింది. ఇక ప్రస్తుతం జగ్గూభాయ్ చేతిలో  వరుస సినిమాలు ఉన్నాయి. తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ, హిందీ అనే భాషాబేధం లేకుండా జగ్గు భాయ్ తన నటనతో ప్రేక్షకులను మెప్పిస్తున్నాడు.

జగ్గూభాయ్ నటన పక్కన పెడితే.. సోషల్ మీడియాలో ఆయన ఎంతో యాక్టివ్ గా ఉంటాడు. ముఖ్యంగా ఆయన పెట్టే ఫోటోలకు.. క్యాప్షన్స్ కు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉందనే చెప్పాలి. నిత్యం తన జీవితంలో జరిగే విషయాలను తనకు నచ్చిన పనులను వీడియో తీసి.. వాటికి తెలుగులో సెటైరికల్ గా రాసే క్యాప్షన్స్ అద్భుతంగా ఉంటాయి. ఆయనను ఒకరు విమర్శించాల్సిన  అవసరం లేదు.. ఆయనకు ఆయనే తన ఫోటోలను విమర్శించుకుంటాడు.

Advertisement

Siddharth- Aditi: సిద్దార్థ్- అదితి పెళ్ళికి ఇంతమంది సెలబ్రిటీలు వచ్చారా.. ?

నిత్యం ఏదో ఒక ఫోటోను షేర్ చేసి అభిమానులను ఎలా ఉందో చెప్పండి అని అడిగే జగ్గూభాయ్.. ఈసారి ఒక వీడియోతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.  సాల్ట్ అండ్ పెప్పర్ లుక్ లో ఉన్న తన ఫొటోస్ అన్ని ఎడిట్ చేసి.. దానికి జైలర్ లోని  హుకుం సాంగ్ ను యాడ్ చేసిన వీడియోను షేర్ చేశాడు. ఇక దానికి క్యాప్షన్ గా .. ” కొంచెం స్టైల్ కొడదామని ఓవర్ యాక్షన్ చేశా.. బాగుంది అని చెప్పండి. హ్యాపీ అయిపోతా” అంటూ రాసుకొచ్చాడు.

Advertisement

ప్రస్తుతం జగ్గూభాయ్ ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. ఇక ఈ వీడియోపై అభిమానులు తమదైన రీతిలో కామెంట్స్  పెడుతున్నారు. మీకేంటి సార్.. హీరోలా ఉన్నారు అని కొందరు.  హీరో అయినా.. విలన్ అయినా మీకు మీరే సాటి అని ఇంకొందరు కామెంట్స్ చేస్తున్నారు. మరి ముందు ముందు జగ్గూభాయ్ ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తాడో.. ఇంకెన్ని అవార్డులు అందుకుంటాడో చూడాలి.

Related News

కరువు పరిస్థితులపై సినీ ఇండస్ట్రీ సహకారం కోరిన సీఎం రేవంత్.. వెంటనే స్పందించిన నాగ్!

సాయికృష్ణ మిస్టరీ కేసు సంఘటన.. మళయాల క్రైం థ్రిల్లర్‌ మూవీలో ప్రధాన కథనం..! ఇన్విస్టిగేషన్‌ ఆఫీసర్‌ని బురిడీ కొట్టించే సీన్లు..!

వికెట్ పడిన ఆనందంలో జుట్టు పట్టుకున్నా, కానీ ఆ బౌలర్ విగ్గే ఊడిపోయింది

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Big Stories

Advertisement
×