BigTV English

BB Telugu 8 Promo 3: పాల ప్యాకెట్ కోసం కొత్త ఛాలెంజ్.. ఇదెక్కడి ట్విస్ట్ గురూ..!

BB Telugu 8 Promo 3: పాల ప్యాకెట్ కోసం కొత్త ఛాలెంజ్.. ఇదెక్కడి ట్విస్ట్ గురూ..!

BB Telugu 8 Promo: బిగ్ బాస్ సీజన్ 8 మొత్తం 14 మంది కంటెస్టెంట్స్ తో ప్రారంభం అవ్వగా.. ఇప్పటికే 8 వారాలు పూర్తయ్యాయి. 8 వారాల్లో భాగంగా 14 మందిలో తొమ్మిది మంది ఎలిమినేట్ అవ్వగా, మరోవైపు వైల్డ్ కార్డు ద్వారా మాజీ బిగ్ బాస్ కంటెస్టెంట్స్ ను ఎనిమిది మందిని హౌస్ లోకి తీసుకొచ్చారు. అందులో ఒకరు మెహబూబ్ తో ఎనిమిదవ వారం ఎలిమినేట్ అయ్యారు. అలా మొత్తం 11 మంది ఎలిమినేట్ అవ్వడం జరిగింది. ఇక మిగతా కంటెస్టెంట్స్ తో మంచి ఎంటర్టైన్మెంట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు బిగ్ బాస్. ఇకపోతే తొమ్మిదవ వారం చివరి దశకు చేరుకుంది. ఈ వారం ఐదు మంది నామినేట్ అవ్వగా అందులో హరితేజ, నయనీ పావని డేంజర్ జోన్లో ఉన్నారు.


ఇకపోతే తాజాగా 61వ రోజుకు సంబంధించి మూడవ ప్రోమోని బిగ్ బాస్ నిర్వాహకులు విడుదల చేశారు. ఇందులో పాల ప్యాకెట్ల కోసం కంటెస్టెంట్స్ పడే తిప్పలు అంతా ఇంతా కాదనే చెప్పాలి. మరి ఈ ప్రోమోలో ఏముందో ఇప్పుడు చూద్దాం. ఇక ప్రోమో విషయానికి వస్తే.. కెమెరా ముందుకొచ్చి మెగా చీఫ్ విష్ణుప్రియ, నయని పావని, ముక్కు అవినాష్ పాలు విరిగిపోయాయి.. ఆ రెండు విరిగిపోయిన పాల ప్యాకెట్లను స్టోర్ రూమ్ లో పెట్టడం జరిగింది. దయచేసి రెండు కొత్త పాల ప్యాకెట్లు పంపించండి అంటూ వేడుకున్నారు. ముక్కు అవినాష్ కూడా..” ప్లీజ్ బిగ్ బాస్ పాలు విరిగిపోయాయి.. దయచేసి పంపించండి” అంటూ రిక్వెస్ట్ చేశారు. ఆ తర్వాత బిగ్ బాస్ మాట్లాడుతూ.. “రెండు మిల్క్ ప్యాకెట్లు పొందడానికి , మీరు రెండు నిమిషాల పాటు బిగ్ బాస్ ని ఎంటర్టైన్ చేయాల్సి ఉంటుంది” అంటూ తెలిపారు.

ఇక ముక్కు అవినాష్ మాట్లాడుతూ..” బిగ్ బాస్ టైం పంపించండి. మా దగ్గర టైం లేదు” అని చెప్పగా, “అవినాష్ ఆ టైం సంగతి నేను చూసుకుంటాను.. మీ టైమింగ్ సంగతి మీరు చూసుకోండి” అంటూ తెలిపారు బిగ్ బాస్. ఆ తర్వాత రోహిణి చప్పట్లు కొడుతూ..” వాట్ ఏ టైమింగ్ బిగ్ బాస్” అంటూ గట్టిగా అరిచింది. ఇంకా ఎంటర్టైన్మెంట్ చేసే పనిలో పడ్డ ముక్కు అవినాష్ మెగాస్టార్ చిరంజీవి వాయిస్ ను రీమేక్ చేస్తూ డైలాగ్ చెప్పారు. ఇక డైలాగులో..” బిగ్ బాస్ చాలా మంచి ఎంటర్టైన్మెంట్ షో.. అందులో అవినాష్ అనే కుర్రాడు ఇంకా బాగా ఎంటర్టైన్ చేస్తాడు” అని అవినాష్ చిరంజీవి డైలాగ్ లాగా చెప్పగా.. టేస్టీ తేజ..” ఇలా చెప్పలేదు” అంటూ కామెంట్ చేశాడు. ఆ తర్వాత అదే చిరంజీవి వాయిస్ తో “దవడ పగిలిపోతుంది” అంటూ జలక్ ఇచ్చాడు అవినాష్. తర్వాత రాజశేఖర్ వాయిస్ తో హరితేజను ఇలా ప్రతి ఒక్కరిని కూడా ఎంటర్టైన్ చేశారు ముక్కు అవినాష్. మొత్తానికి అయితే పాల ప్యాకెట్ కి వచ్చిన తిప్పలు మామూలుగా లేదు అంటూ నెటిజన్స్ కామెంట్లు చేస్తున్నారు.


ఆ తర్వాత కంటెస్టెంట్స్ కి వాళ్ళ కుటుంబ సభ్యుల నుంచి వచ్చిన వీడియో సందేశాలను వినిపించగా.. కంటెస్టెంట్స్ అందరూ కన్నీటి పర్యంతమయ్యారు. ముఖ్యంగా ఇక్కడ హరితేజ కూతురు ప్రత్యక్షమయ్యేసరికి హరితేజ కన్నీటి పర్యంతమౌతూ అందరినీ ఏడిపించింది. ఆ తర్వాత హౌస్ లో దీపావళి వేడుకలు చాలా ఘనంగా జరిగాయి.

Related News

Bigg Boss 9 Promo : సీజన్ 9 లో కొత్త చాప్టర్ మొదలైంది, కన్నీటి కుళాయిలు ఓపెన్, ఆడియన్స్ డెసిషన్ ఏంటి?

Bigg Boss 9: ఈవారం డబుల్ ఎలిమినేషన్.. ట్విస్ట్ ఏంటంటే?

BB9 Wild Cards: నేడే హౌస్ లోకి వైల్డ్ కార్డ్స్.. ఆ 6గురు వీరే!

Bigg Boss 9: అమ్మ బాబోయ్ ఎంతకు తెగించార్రా? మోసం చేసి కెప్టెన్ అయ్యాడు, షాకింగ్ వీడియో

Bigg Boss 9 : భరణి తనూజ బాండింగ్ కు బ్రేక్ పడినట్లేనా? సంచాలక్ గా ఇమ్ము ఫెయిల్? దుమ్ము లేపిన మాస్

Bigg Boss 9 Promo: మైండ్ దొబ్బిందా.. రీతూకి హోస్ట్ స్ట్రాంగ్ కౌంటర్!

Bigg Boss 9 Promo : భరణి గెట్ అవుట్ ఫ్రం హౌస్… హీటెక్కిన వీకెండ్ ఎపిసోడ్

Bigg Boss 9: సుమన్ శెట్టి ఫైర్, కొత్త కెప్టెన్ గా కామనర్, హౌస్ మేట్స్ పై రెచ్చిపోయిన తనూజ

Big Stories

×