BigTV English

Devara Movie : దేవర మూవీ సెట్స్ నుంచి ఫోటో లీక్.. అతిలోక సుందరిని తలపించే అందానికి ఫ్యాన్స్ ఫిదా..

Devara Movie : దేవర మూవీ సెట్స్ నుంచి ఫోటో లీక్.. అతిలోక సుందరిని తలపించే అందానికి ఫ్యాన్స్ ఫిదా..

Devara Movie : తెలుగు సినీ ఇండస్ట్రీలో అతిలోక సుందరిగా.. ఏ పాత్రనైనా అవలీలగా పోషించగలిగే మేటి నటి గా గుర్తింపు తెచ్చుకున్న తార శ్రీదేవి. ఆమె అందం.. అరవిచ్చిన కమలం.. అలాంటి శ్రీదేవి అందచందాలను, అభినయాన్ని వారసత్వంగా పుణికి పుచ్చుకుంది జాన్వీ కపూర్. బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా అతి తక్కువ కాలంలో తనకంటూ ఒక బలమైన స్థానాన్ని స్వశక్తితో నిర్మించుకుంది ఈ అందాల భామ. ఇక టాలీవుడ్ లో జూనియర్ ఎన్టీఆర్ దేవర చిత్రంతో జాన్వీ ఎంట్రీ ఇవ్వబోతున్న విషయం అందరికీ తెలిసిందే.


జాన్వీ ధడక్ అనే చిత్రం తో బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చింది. ఈ మూవీ సక్సెస్ అవడంతో భారీగా ఆఫర్లు క్యూ కట్టాయి. నెక్స్ట్ ఆమె నటించిన లేడీ ఓరియంటెడ్ మూవీ గుంజన్ అనూహ్యమైన సక్సెస్ ఖాతాలో వేసుకుంది. కెరియర్ గాడిలో పడుతుంది అనుకున్న సమయానికి.. వరుస పెట్టి రూహీ, మిలి, బవాల్ లాంటి చిత్రాలు నిరాశపరిచాయి. ఇక బాలీవుడ్ ని ఒక్కటే నమ్ముకుంటే కుదరదు అని అనుకుందో ఏమో టాలీవుడ్ లో కూడా తన టాలెంట్ చూపించడానికి సిద్ధపడింది జాన్వీ.

టాలీవుడ్ లో టాప్ డైరెక్టర్స్ లో ఒకరైన కొరటాల శివ డైరెక్షన్ లో జూనియర్ ఎన్టీఆర్ హీరోగా వస్తున్న దేవర మూవీ నుంచి ఆఫర్ రావడంతో వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దేవర మూవీ రెండు పార్ట్స్ గా రిలీజ్ చేయడానికి మేకర్స్ నిర్ణయించుకున్నారు. ప్రస్తుతం ఈ మూవీకి సంబంధించిన షూటింగ్ గోవాలో జరుగుతుంది. అక్కడ సెట్స్ నుంచి జాన్వీ కు సంబంధించిన ఒక ఫోటో సోషల్ మీడియాలో లీక్ అయింది. 


దేవర మూవీ కు సంబంధించి కొన్ని సన్నివేశాలు సముద్ర తీరంలో చిత్రీకరించాల్సి ఉంది. దీనికిగాను దాదాపు 15 రోజులకు పైగా ఎన్టీఆర్ తో పాటు హీరోయిన్ జాహ్నవి కపూర్ పై గోవాలో కొన్ని కీలకమైన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఈ మూవీలో జాన్వీ ది స్టోరీకి బలంగా నిలిచే రోల్ అని సినీ ఇండస్ట్రీలో టాక్. ఈ నేపథ్యంలో మూవీ షూటింగ్ నుంచి లీకైన జాన్వీ ఫోటో సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది.

ఇందులో లంగా ఓణీ కట్టుకొని పక్కా పల్లెటూరి అమ్మాయిలాగా చూడ చక్కగా ఉంది జాన్వీ. పదహారణాల తెలుగు అమ్మాయిలా ఉన్న జాన్వీ లో ఒకప్పటి శ్రీదేవి జలక్ స్పష్టంగా కనిపిస్తుంది. చూడ ముచ్చటగా ఉన్న ఆమె ఫోటోను వైరల్ చేసిన నెటిజన్లు.. అతిలోక సుందరిని మించిపోయిన అందం అంటూ పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. ఒక్క ఫోటో ఇంత క్రేజ్ క్రియేట్ చేస్తే ఇక మూవీ మొత్తం మీద జాన్వీ లుక్స్ ఎటువంటి సంచలనం సృష్టిస్తాయో వేచి చూడాలి.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×